మీరు టర్మ్ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా..

ఈ విషయాలపై జాగ్రత్త వహించడం ముఖ్యం..  జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేయడంపై ప్రజల్లో ఇప్పటికే చాలా అవగాహన ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది జీవిత బీమా పాలసీలో ఒక భాగం, ఇది మరణం సంభవించినప్పుడు పాలసీదారుని కుటుంబానికి పెద్ద బీమా రక్షణను అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది. నేటి అనిశ్చితి కాలంలో ఇంటి పెద్ద చనిపోతే, అటువంటి పరిస్థితిలో, ఇంటిపై ఆధారపడిన వారికి టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. మీకు కుటుంబ బాధ్యతలు, వివిధ … Read more

ఆదాయం పెరిగిందా, ఇంక్రిమెంట్ ఇచ్చారా..?

 పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా ఎలా చేయవచ్చో తెలుసుకోండి.. కంపెనీ ఇంక్రిమెంట్, ఇతర పనులతో ఆదాయం పెరిగితే, ఇప్పుడు టాక్స పడుతుంది. పన్ను పడకుండా చేయాలంటే ఎలా.. తెలుసుకుందాం.. ఆర్థిక సంవత్సరం(2022-23) అద్భుతమైన ఆర్థిక ఫలితాలు రావడంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇచ్చాయి. ఆదాయం పెరగడంతో పాటు పన్ను భారం కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో పన్ను ప్రణాళిక చాలా ముఖ్యం, పెరుగుతున్న పన్ను భారం నుండి ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలో తెలుసుకుందామా.. … Read more

ఇది బాహుబలి షేరు.. మల్టీబ్యాగర్

2003లో ఈ షేర్‌లో రూ.50 వేలు పెట్టుబడి పెడితే, నేడు రూ. 5 కోట్లు అయింది.. దాదాపు 10000 శాతం రాబడిని ఇచ్చింది.. స్టాక్ మార్కెట్ రిస్కే గానీ, మంచి షేరు తగిలిందంటే.. మీ కిస్మత్ మారిపోతుంది. అలాంటి ఒక షేరు గురించి చర్చించుకుందాం. గతేడాది కూడా చాలా షేర్లు ఇన్వెస్టర్ల అదృష్టాన్ని మార్చివేసి లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టిన వారిని కోట్లకు యజమానులుగా చేశాయి. మీరు అలాంటి షేర్లలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ రోజు … Read more

టాటా షేర్‌కు భవిష్యత్ అదుర్స్.. 

 స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారు, టాటా గ్రూప్‌లోని ఈ షేర్‌లో డబ్బును పెట్టుబడి పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ స్టాక్ వచ్చే ఏడాదిలో మీకు భారీ లాభాలను ఇవ్వగలదు. స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టాలనేది మీ ప్లాన్ అయితే, ఖచ్చితంగా ఈ స్టాక్ను పరిశీలించండి. 22% పెరగవచ్చని అంచనా టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్ షేర్లను కొనుగోలు చేయాలని ఎంకే గ్లోబల్ కూడా సూచించింది. ఎంకే గ్లోబల్ అంచనాల ప్రకారం, ఈ … Read more

ఈ పోస్టాఫీసు పథకాల్లో డబ్బు పెట్టుబడితో కనకవర్షం

 టెన్షన్ లేకుండా డబ్బు రెట్టింపు అవుతుంది పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం అనేది ఎంతో సురక్షితమైంది. ఇప్పటికే ప్రజలు వీటి పట్ల అత్యధిక ఆసక్తి చూపుతున్నారు. పోస్టాఫీసులో డబ్బు మరింత భద్రంగా ఉంటుందని, అది బ్యాంకు నుంచి మంచి రాబడిని ఇస్తుందని ఉంటారు. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (టిడి)పై 5.5 శాతం వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంది. అదేవిధంగా ఐదేళ్ల డిపాజిట్లపై 6.7 శాతం … Read more

లాభాల పంట.. ఈ ఎల్ఐసి ఐపిఒ.. మిస్ కావొద్దు..

మే 4న ఇష్యూ ప్రారంభం..

ఒక్కో షేరు ధర రూ. 902-949

ఎట్టకేలకు ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తన ఐపిఒను మే 4న ప్రారంభించనుంది. రూ. 21,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా వస్తున్న ఈ ఐపిఒలో ఒక్కో షేరుకు రూ. 902-949 ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఐపిఒలో పాలసీదారులకు రూ.60 తగ్గింపు, రిటైల్ పెట్టుబడిదారులు, ఉద్యోగులకు రూ.45 తగ్గింపు లభిస్తోంది.యాంకర్ ఇన్వెస్టర్ల కోసం మే 2న, మిగిలిన వారికి మే 4 నుంచి 9 వరకు ఐపిఒ తెరవనున్నట్లు నివేదిక పేర్కొంది. ఇష్యూలో 10% (2.21 కోట్ల షేర్లు) పాలసీదారులకు, 0.15 కోట్ల షేర్లు అర్హులైన ఉద్యోగులకు రిజర్వ్ చేశారు. ఎల్‌ఐసిలో 3.5% వాటా (22 కోట్ల షేర్లు) విక్రయించడం ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.21,000 కోట్లను సమీకరించాలనుకుంటోంది.

ఒక లాట్ ఎంత ?
ఈ ఐపిఒలో ఎల్ఐసి ఉద్యోగి కనీసం 13,560 రూపాయల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. పాలసీదారులు కనీసం రూ. 13,335 పెట్టుబడి పెట్టాలి. అదే సమయంలో, ఇతర పెట్టుబడిదారులు ఎల్ఐసి 15 షేర్లను కొనుగోలు చేయడానికి రూ.14,235 ఖర్చు చేయాలి.

మే 13న షేర్ల కేటాయింపు
షేర్ కేటాయింపు ఎల్ఐసి ఐపిఒ మే 4న ప్రారంభమై, మే 9న ముగుస్తుంది. మే 9 సోమవారం, కావున కంపెనీ 3 రోజుల పాటు ఐపిఒ బిడ్‌లను పరిశీలిస్తుంది. శని, ఆదివారాల్లో షేర్ కేటాయింపు ఉండదు. అందువల్ల మే 13 శుక్రవారం షేర్ల కేటాయింపు జరగనుంది.

మే 16 నాటికి మీ డీమ్యాట్‌లోకి షేర్లు
ఎల్ఐసి ఐపిఒ పెట్టుబడిదారులకు కేటాయించిన షేర్లు మే 16 నాటికి డీమ్యాట్ ఖాతాలోకి క్రెడిట్ చేస్తారు. ఈ ఐపీఓలో మొత్తం 22.13 కోట్ల ఎల్‌ఐసీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది.

మే 17 నుంచి షేర్ల ట్రేడింగ్
ఎల్‌ఐసీ షేర్లు మే 17న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి. దీనిలో ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మెగా ఐపీఓ (ఎల్‌ఐసీ మెగా ఐపీఓ) ధరను రూ.902 నుంచి రూ.949గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఐపిఒలో ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి.

బ్యాంకులు, పోస్టాఫీసుల్లో FDలు ఎంత కాలంలో రెట్టింపు అవుతాయో తెలుకోవడం ఎలా?

దీనికి ఒక ఫార్ములా ఉందనే విషయం మీకు తెలుసా? బ్యాంకులు, పోస్టాఫీసు వంటి వాటిలో ఎఫ్డీ (ఫిక్స్ డ్ డిపాజిట్)లు చేస్తాం. అయితే ఇప్పుడు వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. అవి ఎంత కాలంలో రెట్టింపు అవుతాయో తెలుసుకోవాలంటే ఎలా? అనే సందేహం మనలో వస్తుంది. అయితే దీనికి సమాధానం ఉంది. అదే 72 ఫార్ములా.. అవును దీంతో ఎంత కాలంలో ఎఫ్డీ రెట్టింపు అవుతుందో తెలుసుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద ఎస్బిఐ(బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- … Read more

ఈ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి (IFSC) కోడ్ మారింది..

పాత చెక్ బుక్ పని చేయదు, వెంటనే బ్రాంచ్ ను సంప్రదించండి లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిబిఎస్ బ్యాంక్ లో విలీనం అయిన విషయం తెలిసిందే. కావున కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. డిబిఎస్ (DBS) బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (DBIL)తో విలీనం కావడం వల్ల లక్ష్మీ విలాస్ బ్యాంక్ (LVB) కస్టమర్‌లకు పాత IFSC కోడ్‌లు 2022 ఫిబ్రవరి 28 నుండి మారాయి. విలీనం తర్వాత అన్ని శాఖల ఐఎఫ్ఎస్సి(IFSC), ఎంఐసిఆర్(MICR) కోడ్‌లు మార్చారు. కొత్త కోడ్‌లు … Read more

బంగారం కొంటున్నారా? సావరిన్ గోల్డ్ బాండ్‌(SGB) గుర్తుంచుకోండి..

1 బాండ్ కు రూ. 5,059 చెల్లించాలి ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వారు సావరిన్ గోల్డ్ బాండ్‌(SGB)లో డబ్బును పెట్టుబడి పెట్టడం ఎంతో ఉత్తమం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో సావరిన్ గోల్డ్ బాండ్లను సద్వినియోగం చేసుకోవాలి. వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 కింద ఫిబ్రవరి … Read more

క్రిప్టోకరెన్సీపై 30 శాతం పన్ను చెల్లించాల్సిందేనా?

బడ్జెట్ ప్రకటనలో ఏం చెప్పారు? ఇప్పుడు ఇది సురక్షితమేనా? మనం ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన లాభాలను పొందవచ్చా? క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనలో బిట్ కాయిన్ వంటి క్రిప్టోలపై 30 శాతం పన్ను విధిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ ఇది చట్టబద్ధమేమీ కాదంటున్నారు. ఇది ఒక లాటరీ, జూదం వంటి వ్యవహారం అని, దానిలాగే పరిగణిస్తామని ఆదాయం పన్నుశాఖ, ప్రభుత్వం చెబుతున్నాయి. 2022 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ … Read more

error: Content is protected !!