అమెరికాకు మాంద్యం ముప్పు..

Spread the love

అగ్రరాజ్యం యుఎస్ లో 40 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం
రాబోయే ఆర్థిక మాంద్యానికి సిద్ధం కావాలంటూ నిపుణుల హెచ్చరికలు

అమెరికాలోని ప్రజలు ఇప్పుడు ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం సమయంలో ప్రపంచం మొత్తం ద్రవ్యోల్బణంతో అవస్థలు పడుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు గత 7 నెలలుగా ప్రతిరోజూ కొత్త గరిష్టాలను తాకుతోంది. డేటా ప్రకారం, మార్చి నెలలో యుఎస్ ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గినప్పటికీ 40 ఏళ్ల గరిష్ఠ స్థాయిలోనే ఉంది. దిగ్గజ ఫైనాన్స్ సంస్థ గోల్డ్ మన్ శాచ్స్ అమెరికా ఆర్థిక మాంద్యం ముప్పు ఎదుర్కోనుందని, ఇది జాగ్రత్త పడాల్సిన సమయమని హెచ్చరించాడు. అయితే అమెరికా వంటి అగ్రదేశం ఆర్థిక మాంద్యం బారినపడితే భారతదేశానికి కూడా ప్రమాదమేనని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారత్ అమెరికాపై వ్యాపార పరంగా చాలా వరకు ఆధారపడి, మన ఐటి సంస్థలు చాలా వరకు యుఎస్ వ్యాపారంతోనే నడుస్తున్నాయి. అందుకే అమెరికా మాంద్యం  బారిన పడితే భారత్ పైనా ప్రభావం ఉంటుంది.

ఇది యుద్ధం ప్రభావమేనా?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కనిపిస్తోంది. యుద్ధం ప్రపంచ ఆహార ధరలను కూడా ఖరీదైనదిగా చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు బాగా పెరిగాయి. ఒక గ్యాలన్ సాధారణ గ్యాస్ ధర రికార్డు స్థాయిలో $4.40కి చేరుకుంది.

ఫెడ్ వడ్డీ పెంపును ప్రారంభించింది

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు కరోనా మహమ్మారి దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. కరోనా కారణంగా ప్రభుత్వాలు ప్రజల కోసం చాలా ఖర్చు చేశాయి. మరోవైపు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నిరోధించడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించింది. ఇది తక్కువ ప్రభావాన్ని చూపింది. గత నెలలో 50 బేసిస్ పాయింట్ల పెంపు తర్వాత, రేట్ల పెంపు మరింత కొనసాగుతుందని ఫెడ్ సూచించింది.

ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి..

ద్రవ్యోల్బణం అంటే ఏమిటి.. ?

Spread the love

Leave a Comment

error: Content is protected !!