శాలరీకి టాక్స్ ఎలా లెక్కిస్తారు..

Spread the love

 చేతికి వచ్చే జీతంపై కటింగ్ లు ఏముంటాయ్..చివరికి వచ్చేది ఎంత..

మీకెంత వేతనం వస్తుంది. మీరు జీతాలు తీసుకునే తరగతి అయితే, మీ మొత్తం జీతంపై మీ టేక్ హోమ్ జీతం ఎంత వస్తుందో తెలుసుకోవడం మీకు ముఖ్యం.  ప్రతి నెలా కొంత మొత్తం మీ ఖాతాలోకి వస్తుంది. సిటిసి (కంపెనీకి ఖర్చు) ప్రకారం వారి టేక్ హోమ్ శాలరీ లెక్కిస్తారు. జీతాన్ని లెక్కించడానికి ఒక ఫార్ములా ఉంది, దాని ఆధారంగా మనం ఒకరి స్థూల జీతం నుండి నికర జీతం ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు.. రూ.లక్ష జీతం తీసుకునే వారికి ఆఖరికి ఎంత డబ్బు ఇంటికి తీసుకెళ్తారో తెలుసుకుందాం.

జీతం ఫార్ములా.. బేసిక్ + హెచ్‌ఆర్‌ఏ + ఇతర అలవెన్సులు, వీటిలో ప్రావిడెంట్ ఫండ్- ఆదాయపు పన్ను- బీమా-పన్ను మైనస్ తర్వాత వచ్చే మొత్తం.. మీ ఇన్-హ్యాండ్ జీతం అవుతుంది.

ఇప్పుడు దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం

రూ.1 లక్ష జీతంపై ఫార్ములా కింద చేతికి జీతం ఎంతోస్తుందో చూద్దాం..

జీతం లేదా సిటిసి = రూ.1 లక్ష

ప్రాథమిక జీతం – సిటిసిలో 40 శాతం = రూ. 40,000

హెచ్ఆర్ఎ- 50 శాతం బేసిక్ = రూ. 20,000

ఇతర భత్యం – 70 శాతం బేసిక్ = రూ. 28,000

మినహాయింపు – రూ. 4800 ప్రావిడెంట్ ఫండ్‌గా నెలవారీగా తీసివేయబడుతుంది = బేసిక్‌లో 12 శాతం

బీమా, పన్నుగా కలిపి రూ.7200 మినహాయిస్తారు

ఈ విధంగా చూస్తే నెల జీతం లక్ష రూపాయలు ఉన్న ఉద్యోగి ఖాతాలో చేతికి వేతనం రూపంలో 40 వేలు + 20 వేలు + 28 వేలు = 88,000 రూపాయలు రావచ్చు.

ఇది అవగాహన కోసమే.. కంపెనీలు, వారి వారి సంస్థల ఆధారంగా వ్యక్తుల జీతాలు, వారి టేక్ హోమ్ శాలరీ మారుతూ ఉండొచ్చు.


Spread the love

Leave a Comment

error: Content is protected !!