సమస్యలు-పరిష్కారాలు.. మార్పులు-చేర్పులు.. పూర్తి సమాచారం..
మనకు పాన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. ఇవి లేకుండా ప్రభుత్వ పథకాలు, బ్యాంకు లావావేదేవీలు, ఇతరత్రా నిర్వహించలేం. డబ్బుకు సంబంధించి పెద్ద పెద్ద లావాదేవీలకు ఈ విలువైన కార్డులు లేకుంటే కష్టమే. ఇప్పుడు పాన్ లేదా ఆధార్ కార్డు పోయినా, లేదా వాటిలో ఏమైనా మార్పులు చేయాల్సి వచ్చినా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కొత్త కార్డును పొందడానికి కనీసం 1 నెల సమయం తీసుకుంటుంది. ఈ పరిస్థితిలో వాటి గురించి కొంత సమాచారం తెలుసుకుందాం.
పాన్ కార్డు పోయినట్లయితే ఏం చేయాలి?
పాన్ కార్డు పోతే పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు కొత్త పాన్ కార్డు పొందడానికి చాలా సమయం పడుతుంది. అందుకే తక్షణ అవసరం కోసం ఇ-పాన్ కార్డు తీసుకోవాలి. అయితే మనం కొద్ది నిమిషాల్లోనే ఇ-పాన్ కార్డును పొందవచ్చు. ఇ-పాన్ ను లావాదేవీలకు అన్ని రకాల వాటికి అనుమతిస్తారు. ఇది పాన్ కార్డును కోల్పోయినా పనులు జరిగేలా చూస్తుంది. స్మార్ట్‌ఫోన్ లేదా ఏదైనా డిజిటల్ పరికరం ద్వారా ఇ-పాన్‌ను చూపించి వినియోగించుకోవచ్చు. ఇ-పాన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకుందాం.
- ఇ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ కావాలి. https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html.
- ఆ తర్వాత డౌన్‌లోడ్ ఇ-పాన్ కార్డ్ పై క్లిక్ చేసి, మీ పాన్ నంబర్‌ను నమోదు చేయాలి. పాన్ నంబర్ తో పాటు ఆధార్ కార్డ్ నంబర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
- పుట్టిన తేదీ నమోదు చేసిన తర్వాత నిబంధనలు, షరతులను అంగీకరించాలి. రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఒటిపి(OTP) వస్తుంది. ఒటిపి నమోదు చేసిన తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ రూ.8.26 చెల్లించాలి. Paytm, UPI, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా చెల్లించే సౌకర్యం ఉంటుంది. చెల్లించిన తర్వాత ఇ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఇ-పాన్ కార్డును పిడిఎఫ్ ఫార్మాట్లో డౌన్‌లోడ్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం అవుతుంది. ఈ పాస్‌వర్డ్ వినియోగదారుడి పుట్టిన తేదీ ఉంటుంది.
ఆధార్ కార్డు సహాయంతో పాన్ కార్డు పొందడం ఎలా?
పాన్ కార్డ్ పోయినట్లయితే ఆధార్ కార్డ్ సహాయంతో తాత్కాలిక కార్డు పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
- పాన్ కార్డ్ పోయినట్లయితే ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ TIN-NSDLకి వెళ్లాలి.
- ఆ తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, జిఎస్టి నంబర్ (GSTIN) (ఆప్షనల్) వంటి వివరాలను పూరించాల్సి ఉంటుంది. అనంతరం నిబంధనలు, షరతులపై క్లిక్ చేయాలి. దీని తర్వాత క్యాప్చాపై క్లిక్ చేయాలి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఎంపిక చేశాక, ఇక వచ్చే ఒటిపి(OTP)ని పూరించాలి.
- ఆధార్‌పై సందేశాన్ని పంపే ‘వాలిడేట్’ బటన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ సహాయంతో మీ పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవడానికి వీలు కల్గుతుంది.
ఆధార్ కార్డ్ ఫోటో సరిగ్గా లేదా?
ముద్రించిన ఆధార్ కార్డులో మన ఫొటో ఒక్కోసారి సరిగ్గా ఉండకపోవచ్చు. మన ఫొటో స్పష్టంగా లేకపోతే మనం దానిని సరిచేసువచ్చు. మీరు అస్పష్టమైన ఫొటోను మార్చుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) అవకాశం కల్పిస్తోంది. ఇది అత్యంత సులభం కూడా, అదేలాగో తెలుసుకుందాం.
- ఆధార్ వెబ్సైట్ లాగిన కావాలి. ఆ తర్వాత ఆధార్ ఫామ్ నింపాలి.
- ఆ తర్వాత ఆధార్ కేంద్రాలకు వెళ్లి మీరు నింపిన ఫామ్‌ను అందజేయండి
- దానితో పాటుగా మీ ఓటరు ఐడి కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డు పత్రాలను సమర్పించాలి.
- అనంతరం ఆధార్ కార్డ్ సెంటర్‌లో ఫొటో, బయోమెట్రిక్ సమాచారాన్ని సమర్పిస్తే ఒక స్లిప్ పొందుతారు. దానిలో మీ అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) వస్తుంది. దీంతో ఆన్‌లైన్‌లో ఫోటోను మార్పు చేసుకోవచ్చు.
- కనీసం 2 వారాల తర్వాత అప్‌డేట్ చేసిన ఆధార్ కార్డ్ మీ చిరునామాకు వస్తుంది. దీనికి గాను రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డులో అడ్రస్ ను అప్‌డేట్ చేయడం ఎలా?
- మీరు ssup.uidai.gov.in/ssup/లో UIDAI అధికారిక లింక్‌కి లాగిన్ కావాలి. ఆ తర్వాత ప్రొసీడ్ టు అప్‌డేట్ ఆధార్ పై క్లిక్ చేసి 12 అంకెల యుఐడి(UID) నంబర్‌ను పూరించాలి.
- ఇక క్యాప్చా కోడ్, సెక్యూరిటీ కోడ్‌ను టైప్ చేసి, ఆ తర్వాత సెండ్ ఒటిపి (OTP)ని క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు ఒటిపి అందుతుంది.
- ఒటిపి పొందిన తర్వాత దాన్ని నమోదు చేసి, లాగిన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే ఆధార్ కార్డు వివరాలు మనకు కనిపిస్తాయి.
- ఐడి(ID), అడ్రస్ రుజువు కోసం వాటిని ఎంచుకుని, సూచించిన 21 డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉంటుంది.
మొబైల్ నంబర్‌ను ఆధార్‌లో అప్‌డేట్ చేయడం ఎలా?
- దీనికి ముందుగా మీ సమీపంలో ఉండే ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ సిబ్బంది వద్ద ఫోన్ నంబర్‌ను లింక్ చేసేందుకు కావాల్సిన ఫామ్ ను తీసుకోండి.
- ఆధార్ కరెక్షన్ ఫామ్ లో సమాచారాన్ని పూరించిన తర్వాత రూ.25 చెల్లించి, నింపిన ఫామ్‌ను ఆధార్ సెంటర్లో సమర్పించాలి. సిబ్బంది మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్‌లో అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ ఉంటుంది.
- ఈ స్లిప్ నంబర్‌తో కొత్త ఫోన్ నంబర్ ను మీ ఆధార్‌తో లింక్ చేశారా, లేదా, తెలుసుకోవచ్చు. కనీసం మూడు నెలల సమయం పడుతుంది.