సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపిక చేసుకోవడం ఎలా?

Spread the love

వివిధ రకాల ఆరోగ్య బీమా కంపెనీలు, వాటిలో ఏది మనకు తగినది తెలుసుకోవాలంటే ఎలా?

హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య బీమా) కంపెనీల్లో చాలా రకాలు ఉన్నాయి. ఆస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీలు ఉన్నట్టే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో కూడా ఫలానా ట్రీట్ మెంట్ కు మాత్రమే మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ ఇచ్చేవీ, అన్ని రకాల వ్యాధుల చికిత్సలకు బిల్లులు చెల్లించేవీ ఉన్నాయి. ఉదాహరణకు మాక్స్ బూపా అనే ఆరోగ్య బీమా సంస్థ కేవలం కంటికి సంబంధించిన చికిత్సలకు, ఆపరేషన్లకూ మాత్రమే బీమా సదుపాయం కల్పించింది. కిడ్నీ వ్యాధులకు, కేన్సర్ వంటి వాటికి ప్రత్యేకంగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి.

వివిధ హెల్త్ పాలసీలు

హెల్త్ పాలసీలు కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్ని ప్రత్యేకించి కొంతకాలం వరకు, మరికొన్ని పాలసీలు జీవితకాలానికి ఉంటాయి. కస్టమర్లు తమ వీలునుబట్టి వాటిని ఎంచుకోవచ్చు. పదేళ్ల నుంచి పదిహేను, ఇరవై, పాతిక, ముప్పయి ఏళ్ల టైమ్ లిమిట్ తో పాలసీలు ఉంటాయి. అలాగే ఎన్నో రకాల ప్లాన్ లను కంపెనీలు అందిస్తున్నాయి. ఒక్కో ప్లాన్ కు కొన్ని ప్రత్యేకతలు, సదుపాయాలు ఉంటాయి. వాటిని ఏజెంట్లు వివరంగా చెబుతారు.

కంపెనీల విధానాలు

ప్రతి ఆరోగ్య బీమా కంపెనీకి కొన్ని టెరమ్స్ అండ్ కండిషన్స్, విధానాలూ ఉంటాయి. బీమా పాలసీ అనేది … ఇప్పటి పరిస్థితుల్ని బట్టి చూస్తే అన్ని ఏజ్ గ్రూపుల వారికీ అవసరమే. అదివరకటి రోజుల్లో ఇన్ని రోగాలు లేవు. 80,90 ఏళ్లపాటు హ్యాపీగా బతికేవారు. ఇప్పుడు బిడ్డ పుట్టినప్పటి నుంచీ కొన్ని సందర్భాల్లో డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అందుకు తగ్గట్టే ఆరోగ్య బీమా కంపెనీలు వివిధ ఏజ్ గ్రూప్ ల వారికి రకరకాల పథకాలు అందిస్తున్నాయి. అయితే కొన్ని సమస్యలూ ఎదురవుతున్నాయి.

కొన్ని ఆరోగ్య బీమా కంపెనీల మొదటి ప్రీమియం ఎక్కువగా ఉంటోంది. కస్టమర్లు ఒకేసారి అంత పెద్ద మొత్తాన్ని కట్టలేకపోతున్నారు. ప్రీమియం ఎక్కువగా ఉంటే పాలసీదారులు కూడా వెనకడుగు వేస్తారు. అది కంపెనీకి కూడా సమస్యే అవుతుంది. 

కొన్ని కంపెనీలు 60, 65 ఏళ్లు దాటిన వారిని పాలసీదారులుగా చేర్చుకోవడం లేదు. ఒకవేళ చేర్చుకున్నా తక్కువ పీరియడ్ పెట్టి, ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తున్నారు. సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాంటప్పుడే ఆరోగ్య బీమా అవసరమవుతుంది.

ముసలివాళ్లు ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని, అందుకే ఎక్కువ ప్రీమియం, తక్కువ పిరియడ్ ఇస్తున్నామని బీమా కంపెనీలు అంటున్నాయి. వృద్ధులు ఎక్కువ కాలం బతుకుతారన్న నమ్మకం లేకపోతే, వారి కుటుంబ సభ్యుల్ని నామినీలుగా వేసి పాలసీలు ఇవ్వవచ్చు. 

కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు నెలకు ఇన్ని పాలసీలు చేయాలని టార్గెట్లు పెడుతుంటాయి. ఒకరకంగా మంచిదే కానీ అది ఎంప్లాయిస్ కు, జనానికీ ఇబ్బందే. శాలరీతో పాటు టార్గెట్లు పూర్తి చేసిన వారికి ఇన్ సెంటివ్స్ ఇస్తే మంచిది.

ఆరోగ్య బీమా గురించి తెలుసుకోవాలంటే..

ప్రీమియం కాలిక్యులేటర్

ఇన్సూరెన్స్ ఏజెంట్ లేదా కంపెనీకి ఎంత మొత్తం చెల్లించాలో తెలుసుకోవడంలో ఈ కాలిక్యులేటర్ సహాయం చేస్తుంది. ఎన్నో కంపెనీలు టెరమ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందిస్తున్నాయి. వాటిలో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి?, లాభాలేమిటి అనేది వీటిద్వారా తెలుస్తుంది. ఆ కాలిక్యులేటర్ కు మీ ఏజ్, జెండర్, వార్షిక ఆదాయం, మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, మీరు పొగ తాగుతారా? వంటి వివరాలు ఇవ్వాలి.

ఏ వయసువారికి ఆరోగ్య పాలసీ?

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోడానికి కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. కనీస గరిష్ఠ వయసు 75-80 సంవత్సరాలు. అయితే, పాలసీలను బట్టి ఏజ్ లిమిట్ మారుతుంటుంది. తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే తక్కువ ప్రీమియం, ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి.

వేటికి ఆరోగ్య బీమా క్లయిమ్ చేయవచ్చు?

సాధారణ అనారోగ్యం, వ్యాధులు బీమా పాలసీ కిందికే వస్తాయి. మంచి ఆరోగ్య బీమా పాలసీలు ఈ పరిధిలోనే ఉంటాయి. అయితే కొన్ని వ్యాధులు, అనారోగ్యాలు విభిన్నంగా ఉంటాయి. కంపెనీలు ఏఏ వ్యాధులకు, అనారోగ్యాలకు బీమా ఇస్తాయి ? అన్నది తెలియాలంటే ఆ కంపెనీ బీమా లిస్ట్ లో ఏఏ వ్యాధులు. చికిత్సలు, వైద్య పరీక్షలకు బీమా వర్తిస్తుందో , ఏఏ ఆస్పత్రులు, క్లినిక్ లు ఆ కంపెనీ పరిధిలోకి వస్తాయో పాలసీ తీసుకోడానికి ముందే తెలుసుకోవాలి.

ఆరోగ్య బీమాకు కావలసిన డాక్యుమెంట్లు

 • 1 వయసు ధ్రువీకరణ పత్రం (ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికేట్).
 • 2 ఐడెంటిటీ ప్రూఫ్ ( ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్డ్, ఆధార్ కార్డ్).
 • 3 అడ్రస్ ధ్రువీకరణ ( రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, రెంట్ అగ్రిమెంట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, యుటిలిటీ బిల్స్).
 • 4 మీ పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
 • 5 మెడికల్ రిపోర్టులు.
 • 6 సరిగా నింపి, సంతకం చేసిన ప్రపోజల్ ఫాం

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకోసం..

ఈ దిగువ కంపెనీలు కొన్ని ఆరోగ్య బీమా పాలసీలు చూడండి
 • ఇఫ్కో (ఐఎఫ్ ఎఫ్ సి ఓ) హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.
 • న్యూ ఇండియా ఎస్యూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.
 • ఓరియంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.
 • బజాజ్ అలియన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.
 • కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.
 • మాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ.

మన ఆహార అలవాట్లతో పాటు జీవన శైలి మారింది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. మంచి గాలి పీల్చడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఈ పరిస్థితుల్లో మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. మన ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా చేయించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందుకు ఎన్నో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, పాలసీలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకుని ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకుంటే ఆనందంగా ఉండొచ్చు.

ఈరోజుల్లో ఆసుపత్రి ఖర్చులు భరించలేం.. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే..

Spread the love

Leave a Comment

error: Content is protected !!