యుపిఐ(UPI)తో క్రెడిట్ కార్డ్‌ లింక్ ఎలా చేయాలి?

Spread the love

మీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేయవచ్చు. ఇది కూడా చెల్లింపు ప్రక్రియ డెబిట్ కార్డ్ మాదిరిగానే

టెక్నాలజీ వేగంగా మారుతోంది. మారుతున్న కాలంతో పాటు క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య కూడా వేగంగా పెరరుగుతోంది. ప్రస్తుతం ప్రజలు క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు ఎందుకంటే వారు తరువాత ఇఎంఐ(EMI) ద్వారా కూడా బిల్లును చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డ్ చాలా ఉపయోగకరమైనదే, కానీ అది ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిందే. ఇప్పుడు మీరు మీ వెంట భౌతికంగా క్రెడిట్ కార్డ్‌ని తీసుకెళ్లకుండా కూడా చెల్లించవచ్చు. ఒక వినియోగదారు తన UPIని క్రెడిట్ కార్డ్‌తో లింక్ చేసినట్లయితే, అతను క్రెడిట్ కార్డ్ లేకుండానే దాని ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ చెల్లింపు ప్రక్రియ డెబిట్ కార్డ్ మాదిరిగానే ఉంటుంది, దీని గురించి పూర్తిగా తెలుసుకుందామా..

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల ఒక ఫీచర్‌ను పరిచయం చేసింది, దీని ద్వారా మీరు మీ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేయవచ్చు. ఇందులో కూడా చెల్లింపు ప్రక్రియ ఖచ్చితంగా డెబిట్ కార్డ్ లాగానే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీ రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేయడం, అదెలాగో తెలుసుకుందామా..

బీమ్ యుపిఐ(BHIM UPI)ని లింక్ చేయాలి
ఎన్పిసిఐ(NPCI) ఇటీవలే ఈ ఫీచర్‌ను ప్రారంభించింది, ఇందులో రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారులు BHIM UPI యాప్‌తో లింక్ చేయడానికి అనుమతి పొందారు. దీని ద్వారా, మీరు BHIM UPI యాప్ ద్వారా మాత్రమే క్రెడిట్ కార్డ్ నుండి డబ్బు చెల్లించవచ్చు. 

దీని కోసం మీరు ఇకపై మీ క్రెడిట్ కార్డును భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. క్యూఆర్(QR) కోడ్‌ని మునుపటిలా స్కాన్ చేసి, క్రెడిట్ కార్డ్ ఎంపికను ఎంచుకుని, పిన్‌ను నమోదు చేయడం ద్వారా మీరు సులభంగా చెల్లించవచ్చు. 

ప్రారంభ దశలో ఆర్బిఐ(RBI) ప్రస్తుతం ఈ సదుపాయాన్ని కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు మాత్రమే అందిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ కస్టమర్‌లు రూపే క్రెడిట్ కార్డ్‌ని యుపిఐ(UPI)తో లింక్ చేసే సదుపాయాన్ని పొందుతున్నారు.

UPIతో క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేయడం ఎలానో తెలుసుకుందాం..

  • వినియోగదారు, ముందుగా మీ యుపిఐ(UPI) యాప్‌ని ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత కార్డ్ ఎంపికను ఎంచుకోండి.
  • తర్వాత మీకు యాడ్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి.
  • దీని తర్వాత కార్డ్ నంబర్, సివివి(CVV) నంబర్ మొదలైన మీ క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి.
  • దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒటిపి(OTP) వస్తుంది, దానిని UPI యాప్‌లో నమోదు చేయాలి.
  • మీ కార్డ్ ధృవీకరణ అవుతుంది. దీని తర్వాత చెల్లింపు చేస్తున్నప్పుడు, మీరు UPIలో క్రెడిట్ కార్డ్ ఎంపికను కూడా చూస్తారు.
  • ఇప్పుడు మీకు కావాలంటే మీరు యుపిఐ యాప్ ద్వారా క్రెడిట్ కార్డ్‌తో చెల్లించవచ్చు. 

Spread the love

Leave a Comment

error: Content is protected !!