సైబర్ నేరాలను నివారించేందుకు యుఐడిఎఐ ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది..
మీ డేటాను సురక్షితంగా ఉంచే పూర్తి ప్రక్రియను తెలుసుకోండి
ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డుగా ఎన్నో అవసరాలకు, పథకాలకు ఉపయోగపడుతుంది. బ్యాంక్ ఖాతా తెరవడం, పాఠశాలలో ప్రవేశం, ఆస్తి కొనుగోలు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తయారు చేయడం, నగలు కొనడం వంటి అనేక ముఖ్యమైన పనులకు ఆధార్ కార్డ్ ఉపయోగించబడుతుంది. దేశంలో మొదటిసారిగా 2009లో భారత ప్రభుత్వం ఆధార్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి దేశంలో దీని వినియోగం వేగంగా పెరుగుతోంది. ఆధార్ కార్డ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే యుఐడిఎఐ(UIDAI) అనే సంస్థ ద్వారా జారీ చేస్తారు.
ఆధార్ వినియోగం పెరుగుతున్న కొద్దీ దానికి సంబంధించిన మోసాల సంఘటనలు కూడా చాలా వేగంగా పెరగుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది ఆధార్ డేటాను దొంగిలించడం ద్వారా వారి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రజలు అనేక రకాలుగా మోసపోతున్నారు.
ఈ పరిస్థితిలో ఈ సమస్యను అధిగమించడానికి యుఐడిఎఐ ఆధార్‌ను లాక్ చేయడం, అలాగే అన్‌లాక్ చేసే సౌకర్యాన్ని ప్రారంభించింది.
డేటా గోప్యత ప్రధాన ఉద్దేశం
సైబర్ నేరాల సంఘటనలను నివారించడానికి యుఐడిఎఐ ఆధార్ కార్డ్‌ను లాక్, అన్‌లాక్ చేసే సౌకర్యాన్ని ప్రారంభించింది. ఆధార్ కార్డు బయోమెట్రిక్‌ను లాక్ చేయడం ద్వారా మీరు దాని దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ డేటా సురక్షితంగా ఉంటుంది.
ఆధార్ కార్డ్‌ను లాక్ చేసిన తర్వాత ఇతర వ్యక్తులు మీ ఆధార్ డేటాను యాక్సెస్ చేయలేరు. మీరు డేటాను మళ్లీ యాక్సెస్ చేయాలనుకుంటే, మీ ఆధార్ కార్డ్‌ని అన్‌లాక్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే మీరు దాన్ని మళ్లీ ఉపయోగించవచ్చు. ఆధార్ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఆధార్ డేటాను లాక్, అన్‌లాక్ చేయవచ్చు.
ఆధార్ వినియోగదారులకు దాన్ని ఎలా లాక్, అన్‌లాక్ చేయాలో తెలుసుకోండి
- దీని కోసం మీరు యుఐడిఎఐ అధికారిక వెబ్‌సైట్ www.uidai.gov.in/ ని సందర్శించండి.
- తర్వాత మీరు My Aadhaar ఎంపిక చేసుకోవాలి, ఆ తర్వాత ఆధార్ సేవలను ఎంచుకోండి.
- తర్వాత మీరు లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్‌లను ఎంచుకోండి.
- తర్వాత, మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. ఆపై మీ క్యాప్చా కోడ్‌ని నమోదు చేయాలి.
- తర్వాత Send OTPపై క్లిక్ చేయండి.
- దీని తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని ఇక్కడ నమోదు చేయాలి.
- దీని తర్వాత మీరు బయోమెట్రిక్ డేటాను లాక్ / అన్‌లాక్ చేసే ఎంపికను చూస్తారు. మీరు ఎంచుకోవాలనుకుంటున్న లాక్ లేదా అన్‌లాక్ ఎంపికను త్వరగా ఎంచుకోండి.
- దీని తర్వాత మీ ఆధార్ బయోమెట్రిక్ డేటా లాక్ లేదా అన్‌లాక్ అవుతుంది.