ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో బంపర్ రిటర్న్‌

Spread the love

అత్యధిక వడ్డీ చెల్లించే పథకం,ఇది పోస్టాఫీసు పథకం కావడంతో డబ్బు ఎంతో సురక్షితం

మీరు సీనియర్ సిటిజన్ అయితే, మంచి రాబడితో మంచి పొదుపు ప్రణాళికను కావాలనుకుంటున్నట్లయితే పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) మీకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ పథకం కావడంవల్ల మీ డబ్బు ఇందులో సురక్షితంగా ఉంటుంది. ఈ పథకం సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చారు. అయితే ఈ పథకం కింద కొన్ని షరతులకు లోబడి విఆర్ఎస్(VRS) తీసుకునే సివిల్ సెక్టార్ ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పదవీ విరమణ పొందిన వారికి వయో సడలింపు ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబర్ 1 నుండి ఈ పథకం వడ్డీ రేటును పెంచింది. గతంలో 7.4 శాతం వడ్డీ లభించేది. ఇప్పుడు అది 7.6 శాతానికి పెరిగింది. ఈ పథకం మంచి రాబడులను ఇస్తోంది.

పెట్టుబడి ఎలా పెట్టాలి ?
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ స్కీమ్‌లో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఖాతాను తెరవవచ్చు. అంతేకాదు సివిల్ సెక్టార్ ప్రభుత్వ పోస్టుల నుండి విఆర్ఎస్(VRS) తీసుకున్న వ్యక్తులు, 55 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు, రక్షణ రంగం నుండి పదవీ విరమణ పొందిన వారు అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇతర భద్రతా దళాలు కూడా సింగిల్ లేదా జాయింట్ ఖాతా తెరవవచ్చు. 50 నుండి 60 సంవత్సరాల వయస్సులో కూడా ఈ పథకం కింద ఖాతా చేయవచ్చు ఈ పథకం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. ఇందులో ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది.

కనీసం రూ.1000, గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిదారులు 7.6 శాతం వడ్డీని పొందుతారు. సాధారణంగా, చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 6 శాతం నుంచి 7 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.  ఇది బ్యాంక్ ఎఫ్డీ(FD)ల కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తుంది. మరోవైపు దేశీయ ద్రవ్యోల్బణం రేటును పరిశీలిస్తే, ప్రస్తుతం ఇది 7 శాతంగా ఉంది. ఈ పరిస్థితిలో ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మంచి రాబడిని పొందే అవకాశం ఉంది. పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు.

ప్రీ  మెచ్యూరిటీ  ఖాతా నిబంధనలు
ఈ పథకంలో తెరిచిన తర్వాత ఎప్పుడైనా మూసివేయవచ్చు. కానీ ఒక సంవత్సరం లోపు ఖాతా మూసివేస్తే పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ చెల్లించరు. దీనితో పాటు మీరు 1 నుండి 2 సంవత్సరాల మధ్య ఖాతాను మూసివేస్తే మీరు చెల్లించిన వడ్డీ మొత్తం నుండి 1.5 శాతం మినహాయింపు పొందుతారు. అదేవిధంగా మీరు 2 నుండి 5 సంవత్సరాల మధ్య పెట్టుబడిని మూసివేస్తే మీ మొత్తం నుండి 1 శాతం తీసివేస్తారు.


Spread the love

Leave a Comment

error: Content is protected !!