మీకు డబ్బు అవసరమైందా.. కారు ఉంటే, ఇదే పనిచేయండి.
అకస్మాత్తుగా డబ్బు అవసరం ఏం చేస్తాం, ఎవరినైనా అడగడం లేడా బ్యాంకులను ఆశ్రయించడం చేస్తాం. అయితే మీ దగ్గర కారు ఉంటే, దానిపై రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బిఎఫ్సీలు) రెండూ కారుపై రుణం అందిస్తున్నాయి. కారు ప్రస్తుత ధరలో 50 శాతం నుండి 150 శాతం వరకు రుణాలు ఉంటాయి. 15 శాతం వడ్డీ, ప్రాసెసింగ్ రుసుము 1-3 శాతం వరకు ఉంటుంది. చాలా బ్యాంకులు కారుపై లోన్ మంజూరు చేయడానికి ముందు కనీసం 9 నెలలకు సంబంధించిన దరఖాస్తుదారు లోన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తాయి. మీరు ఇప్పటికే ఉన్న లోన్ అన్ని ఇఎంఐలను సకాలంలో చెల్లించినట్లయితే మీకు లోన్ సులభంగా లభిస్తుంది.
బ్యాంకులు, ఎన్బిఎఫ్సీలు సాధారణంగా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కార్లపై రుణాలు ఇస్తాయి. ఇంకా దరఖాస్తుదారుకు ఉద్యోగం లేదా వ్యాపారం వంటి ఖచ్చితమైన ఆదాయ వనరు ఉండాలి. దరఖాస్తుదారు వయస్సు కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 65 సంవత్సరాలు ఉండాలి.
దీనికి ఉండాల్సిన పత్రాలు
- ఓటరు ఐడి కార్డ్, ఫోటో, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్
- మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్
- మూడు నెలల జీతం స్లిప్
- జీతం ఖాతా ప్రకటన
- కారు ఆర్సీ, కారు భీమా పత్రాలు