ఐటి ఫైల్తో ఉద్యోగులు రూ. 50 వేల ప్రయోజనాలు

Spread the love

  • ఉద్యోగులకు ఐటి పన్ను నుంచి స్టాండర్డ్ డిడక్షన్
  • 50,000 రూపాయల ప్రయోజనం లభిస్తుంది
ప్రస్తుతం పన్నుల ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే  జాబ్ చేసేవారు మాత్రం ఆదాయపు పన్ను నుండి స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా ప్రయోజనాన్ని అందుకోవచ్చనే విషయం తెలుసుకోవాలి. ఎంత లబ్ధి పొందుతారంటే దాదాపు 50,000 రూపాయలు, ఇది తక్కువ అమౌంట్ ఏం కాదు. అందుకే దీని గురించి తెలుసుకోండి.
స్టాండర్డ్ డిడక్షన్
స్టాండర్డ్ డిడక్షన్ అనేది శాలరీ, పెన్షన్ నుండి సంపాదించే వ్యక్తులకు ఇచ్చే మినహాయింపు అన్నమాట.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 50,000 ఉంది. అయితే బడ్జెట్ 2023 ప్రకారం, జీతం పొందే పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హత కల్గి ఉంటారు. FY 2023-24 నుండి కొత్త పన్ను విధానంలో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా అందుబాటులో ఉంది.
స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50 వేల ప్రయోజనం లభిస్తుంది. దాదాపు అందరు ఉద్యోగులు ఈ తగ్గింపును పొందవచ్చు. అలాగే మధ్యతరగతి జీతం పొందే వారు ఈ బెన్ఫిట్ను పొందవచ్చు. ఉద్యోగులే కాకుండా పెన్షనర్లు కూడా లబ్ధి పొందవచ్చు. 2023 బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీతాలు, పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్  ప్రయోజనాన్ని ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే. ఒక ఉద్యోగి అంటే జీతం పొందిన పన్ను చెల్లింపుదారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, అతను ప్రామాణిక మినహాయింపును పొందుతాడు. బడ్జెట్ 2023 ప్రకారం, కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీతం లేదా పెన్షన్ ద్వారా పొందిన ఆదాయంపై పెన్షనర్లు రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. బడ్జెట్ 2023లో ప్రతిపాదించినట్లుగా, కుటుంబ పింఛనుదారులు రూ. 15,000 స్టాండర్డ్ డిడక్షన్ పొందుతారు.
 ITR ఫైల్ లో ఏ అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి?
ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు సొంతంగా ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు. ఈ సందర్భంలో, మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. ఈ సందర్భంలో ముందుగా సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మొత్తం ఆదాయం 50 లక్షల కంటే తక్కువ ఉంటే ఒక వ్యక్తి ITR-1ని ఫైల్ చేయవచ్చు. కానీ అతను దేశ నివాసి అయి ఉండాలి. అంతేకాకుండా, ఐటీఆర్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు పన్ను పోర్టల్‌లో చెల్లించాల్సిన సమాచారంతో ఫారం 16లోని సమాచారాన్ని సరిపోల్చడం ముఖ్యం. ఇది కాకుండా, మీరు ఇంటి అద్దె లేదా రుణంపై వడ్డీ చెల్లించవలసి వస్తే, మీరు దానిపై కూడా తగ్గింపు పొందవచ్చు.

Spread the love

Leave a Comment

error: Content is protected !!