చక్రవడ్డీ.. కథే వేరు

Spread the love

  • జీవితంలో ప్రారంభంలో పెట్టుబడి ప్రాముఖ్యత
  • ఆలస్యం చేయవద్దు.. ఇది చక్రవడ్డీ, సాధారణ పెట్టుబడి సత్తా

మన జీవితంలో ప్రారంభంలో పెట్టుబడి పెట్టినప్పుడు, ఆ మొత్తం పెరుగుతూనే ఉంటుంది. అది పెద్ద భాగం అయినప్పుడు, ప్రారంభ సంవత్సరాలతో పోలిస్తే ప్రతి ఏటా పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే చక్రవడ్డీ శక్తి.. మహిమ.. అని చెప్పవచ్చు. దీనినే ఆంగ్లంలో ముద్దుగా పవర్ ఆఫ్ కంపౌండింగ్ (Power of Compound) అంటారు.

ఉదాహరణకు..
మీరు పదవీ విరమణ కోసం 2008లో పొదుపు ప్రారంభించారని అనుకుందాం.. ప్రతి సంవత్సరం 15% రాబడితో క్రమం తప్పకుండా 1 లక్ష పెట్టుబడి పెడితే, 2038 సంవత్సరంలో మీ పెట్టుబడి రూ. 4.35 కోట్లు అవుతుంది. కానీ మీరు 2 సంవత్సరాలు ఆలస్యం చేసి 2010లో ప్రారంభిస్తే, అది 2038 నాటికి రూ. 3.27 కోట్లు మాత్రమే అవుతుంది. అది మీకు రూ. 1.08 కోట్ల తక్కువ డబ్బును ఇస్తుంది. ఒకవేళ 1 సంవత్సరం ఆలస్యం అయినా మొత్తం రూ. 3.77 కోట్లు వస్తుంది. దీంతోకూడా రూ. 58 లక్షలు తగ్గుతుంది. ఈ కోల్పోయిన రూ.58 లక్షలు రూ.3.77 కోట్లపై 15% వడ్డీ తప్ప మరొకటి కాదు. ఆలస్యం కారణంగా తరువాతి సంవత్సరాలలో ప్రయోజనం పొందలేరు, కాబట్టి ఇది జరుగుతుంది.


Spread the love

Leave a Comment

error: Content is protected !!