దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో ఉత్తమ రాబడిని పొందండి
స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో మంచి లాభాలను పొందాలంటే, దీర్ఘకాలం వేచిచూడాలి. ఒక స్టాక్ కొన్నాక పెరుగుతున్నా, తగ్గుతున్నా మనం చలించకుండా ఓపికతో ఉండాలి. అప్పుడే మనం అనుకున్న అధిక రాబడిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇది ఉత్తమ స్టాక్ లను కొనుగోలు చేస్తేనే సుమా.. ఫండమెంటల్ గా సరిగ్గా లేని స్టాక్స్ కొంటే దీర్ఘకాలంలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఒక స్టాక్ కొన్నాక మూడు నెలలకోసారి సమీక్షించుకోవాలి. అది సరైనది కానట్లయితే వదిలించుకుని, మరో ఉత్తమ స్టాక్ ను ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల నుండి ఉత్తమ రాబడిని పొందాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. దీని కోసం ఒక షేరును ఎంచుకుని కొనుగోలు చేసిన తర్వాత దాని ధరను చూడవద్దు. మీరు బ్యాంకులో ఎఫ్డి(FD) చేసినప్పుడు మీరు ఎలాగైతే వేచి ఉంటారో? అలా స్టాక్స్ విషయంలో ఉండాలి. ఉత్తమ రాబడిని పొందడానికి అనేక సంవత్సరాల పాటు ఆ కంపెనీతో ఉండండి. దీర్ఘకాలంలో ధర పెరుగుతూనే ఉంటుంది. దీని కోసం కొన్ని ఉత్తమ స్టాక్స్ ను పరిశీలిద్దాం.
ఐషర్ మోటార్స్ (EICHERMOT)
రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను తయారు చేసే ఐషర్ మోటార్స్ అందరికీ సుపరిచితమే. ఐషర్ మోటార్స్ లిమిటెడ్ ఒక ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ, అంతేకాదు ఈ కంపెనీ ఐషర్ బ్రాండ్ పేరుతో ట్రక్కులు, మినీ ట్రక్కులు, ప్యాసింజర్ బస్సులను తయారు చేసి విక్రయిస్తుంది. Eicher AB వోల్వోతో సహకారాన్ని కలిగి ఉంది.
ముఖ విలువ : రూ.1 ఒక్కో
షేరు ప్రస్తుత ధర : రూ. 3,745 ఒక్కో షేర్
మార్కెట్ క్యాప్ : రూ. 95 వేల కోట్లు
ధర స్థాయి : వార్షిక గరిష్టం రూ. 3,737- కనిష్టం రూ.2,160
బోనస్ షేర్లు : బోనస్ షేర్లు ఇంకా జారీ చేయలేదు
షేర్ స్ప్లిట్ : అక్టోబర్ 2020లో 1:10
డివిడెండ్ : డివిడెండ్ వాటాదారులకు చెల్లిస్తుంది.
రాబడులు: గత పదేళ్లలో, పెట్టుబడిదారులు 19 రెట్లు రాబడిని అందుకున్నారు.
భవిష్యత్ అవకాశాలు: ఆటో పరిశ్రమ ఒక దశను దాటుతోంది. మాంద్యం పరిస్థితులను చూసింది, విజృంభిస్తుంది. మాంద్యం సమయంలో కొనుగోలు చేసిన స్టాక్‌లు భవిష్యత్తులో అద్భుతమైన రాబడిని ఇస్తాయి. అయితే దీనికి కొన్నాళ్లు ఆగాల్సిందే. దీంతో పాటు ఈ షేర్‌లో బోనస్ షేర్లను పొందే అవకాశం కూడా ఉంది.
ఇమామి లిమిటెడ్ (EMAMILTD)
ఇమామి లిమిటెడ్ అనేది వ్యక్తిగత సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, అందం విభాగాలలో ఉత్పత్తులను అందించే కంపెనీ. బోరో ప్లస్, నవరత్న తైల్, జండూ బామ్, జండూ పంచరిష్ట, ఇమామీ ఫేస్ క్రీమ్ మొదలైన బ్రాండ్‌లు ఈ కంపెనీ చేసే ప్రోడక్ట్లు., వీటిని మీరు వాటిని కొనుగోలు చేసే ఉంటారు.
ముఖ విలువ: రూ. 1
షేరు ప్రస్తుత ధర : రూ. 465.80
షేరు మార్కెట్ క్యాప్ : రూ. 21 వేల కోట్లు
ధర స్థాయి : వార్షిక గరిష్టం రూ. 578, కనిష్టం రూ.393
బోనస్ షేర్లు : 2004, 2018 మధ్య బోనస్ షేర్లు మూడుసార్లు జారీ చేసింది.
షేర్ల విభజన: 2014, 2010లో షేర్లు విభజించింది
రాబడులు: గత పదేళ్లలో పెట్టుబడి రెండున్నర రెట్లు పెరిగింది.
డివిడెండ్: డివిడెండ్ వాటాదారులకు చెల్లిస్తుంది.
భవిష్యత్ అవకాశాలు: వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న మార్కెట్. ఇది భవిష్యత్తులో తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కంపెనీకి గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఇందులో ఎంత విజయం సాధిస్తే షేరు ధర అంత ఎక్కువగా పెరుగుతుంది.
ఎస్కార్ట్స్ ఖుబోటా లిమిటెడ్ (ESCORTS)
పవర్ ట్రాక్, ఫార్మ్‌ట్రాక్ అనేవి రెండు ట్రాక్టర్లు, అలాగే రైల్వే, వ్యవసాయం, నిర్మాణ యంత్రాలు, ఆటోమోటివ్ పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తులు అందించే కంపెనీ ఇది.
ముఖ విలువ : రూ.10
ప్రస్తుత ధర : రూ. 1,996.20
మార్కెట్ క్యాప్ : రూ.27 వేల కోట్లు.
ధర స్థాయి: గరిష్టం 2,190 – కనిష్టం రూ. 1,306
బోనస్ షేర్లు : 1,997 వరకు ఐదు సార్లు
షేర్ స్ప్లిట్: ఇంకా లేదు
రిటర్న్స్: గత 10 సంవత్సరాలలో 30 సార్లు
డివిడెండ్: డివిడెండ్ వాటాదారులకు చెల్లిస్తోంది.
భవిష్యత్ అవకాశం: షేర్ స్ప్లిట్ కు అవకాశం ఉంది, గత 10 సంవత్సరాల చార్ట్ ప్యాటర్న్‌ను పరిశీలిస్తే ఈ స్టాక్ భవిష్యత్తులో మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంది.
పెట్టుబడి పెట్టడానికి ఇతర కంపెనీలు:
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఒక బ్యాటరీ తయారీ సంస్థ. భవిష్యత్తు బ్యాటరీతో నడిచే వాహనాలదే. ఈ సంస్థ దీనిపై పరిశోధన చేస్తోంది. బ్యాటరీ వాహనాల రంగం విషయంలో దృష్టి పెడితే భవిష్యత్తులో ఇందులో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. దీనిపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచితే మంచిది.