ప్రాపర్టీ టాక్స్ ఎందుకు చెల్లించాలి? 

Spread the love

మున్సిపల్ అధికారులు తమ పరిధిలోని ఇళ్లు లేదా ఫ్లాట్ల యజమానుల నుంచి ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఈ టాక్స్ చెల్లించకపోయినట్లయితే ఏమవుతుంది? 

దేశవ్యాప్తంగా ప్రజలు ఇంటి కలను నెరవేర్చుకోవడానికి కష్టపడతారు. కొత్త ఇంటిని కొనుగోలు చేసే వాారి సంఖ్య పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం, 2022లో టాప్-7 నగరాల్లోని మొత్తం విక్రయాలు 3.6 లక్షల యూనిట్లను దాటే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఇల్లు కొనాలని ఆలోచిస్తే ఇది మీకు ఉపయోగపడే విషయమే. మీరు ఆస్తి పన్ను చెల్లించకపోతే జరిమానా అనేది ఉంటుందనే విషయం తెలుసుకోవాలి.

మున్సిపల్ అధికారులు తమ పరిధిలోని ఇళ్లు లేదా ఫ్లాట్ల యజమానుల నుంచి ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఆస్తిపన్ను చెల్లించని వారిపై లేదా సకాలంలో ఆస్తిపన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఆస్తిపన్ను చెల్లించనందుకు చర్యలు, జరిమానాలు వేర్వేరు అంశాల ద్వారా నిర్ణయిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఉదాహరణకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ప్రతి నెలా చెల్లించాల్సిన మొత్తంపై 1 శాతం పెనాల్టీని విధిస్తుంది. మరోవైపు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ నెలకు 2 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. మరోవైపు ఆస్తిపన్ను సకాలంలో చెల్లించకపోతే, మున్సిపాలిటీ లేదా అధికార యంత్రాంగం షోకాజ్ నోటీసు కూడా జారీ చేస్తుంది. షోకాజ్ నోటీసును అందించినప్పటికీ ఆస్తి యజమాని ఆస్తి పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే, సంబంధిత మున్సిపాలిటీ న్యాయపరమైన ఆశ్రయం తీసుకోవచ్చు. షోకాజ్ నోటీసును నిర్లక్ష్యం చేస్తే జరిమానా విధించవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో చట్టం ప్రకారం, బ్యాంకు ఖాతాలు, అద్దె మరియు అన్ని చరాస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా బకాయిలను తిరిగి పొందవచ్చు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు కఠిన కారాగార శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు.


Spread the love

Leave a Comment

error: Content is protected !!