సిప్ టాప్అప్’తో మీ డబ్బు రెట్టింపు..

Spread the love

అది ఏవిధంగా అవుతుందో తెలుసా?
సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అంటే ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టడం అన్నమాట. ఈ సిప్(SIP) పదం ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ లో వినిపిస్తుంది. చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే, అది మంచి రాబడితో పెరుగుతుంది. అంటే చిన్న విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. అది మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈక్విటీలలో నేరుగా పెట్టుబడి పెట్టడం కంటే ఇలా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టం సురక్షితమైన ఎంపిక. అయితే ప్రతి సంవత్సరం సిప్(SIP)ను పెంచుకుంటూ వెళితే మీ పెట్టుబడి త్వరగా రెట్టింపు అవుతుందీ. దీనినే టాప్ అప్ అంటారు. ఫండ్స్ సిప్ ను పెంచే విధానమే టాప్ అప్ అన్నమాట. ప్రతి సంవత్సరం సిప్ లో టాప్ అప్ ను 10 శాతం చేస్తే పెట్టుబడిదారుడు రెట్టింపు రాబడులు పొందుతాడు.

సిప్ గురించి మంచి విషయం ఏమిటంటే, మీకు కావలసినప్పుడు SIP మొత్తాన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. ప్లాన్‌ను ప్రారంభించే ముందు ఈ ఎంపికను ఎంచుకోవాలి. జీతం లేదా ఆదాయం పెరిగినప్పుడు సిప్ మొత్తాన్ని పెంచాలనే ఆలోచన వస్తుంది. ఇది అమలు చేస్తే మెచ్యూరిటీపై దాదాపు రెట్టింపు రాబడిని ఇస్తుంది.

సిప్ టాప్-అప్ ద్వారా ప్రతి సంవత్సరం పెట్టుబడిని 10 శాతం పెంచినట్లయితే, పెట్టుబడి 20 సంవత్సరాలలో 22.37 లక్షల రూపాయలకు పెరుగుతుంది. అయితే, రిటర్న్‌లను పరిశీలిస్తే ఇది సాధారణ సిప్ కంటే రాబడి ఎక్కువగా ఉంటుంది. అంటే, ప్రతి సంవత్సరం పెట్టుబడిలో కేవలం 10 శాతం పెంచడం ద్వారా సాధారణ సిప్ తో పోలిస్తే టాప్-అప్ ద్వారా ప్రయోజనం రెట్టింపు అవుతుంది.

పెట్టుబడిని పెంచుకునే వెసులుబాటు

ఒక వ్యక్తి 20 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టి టాప్-అప్ ఎంచుకున్నాడు అనుకుందాం. ప్రతి సంవత్సరం కేవలం 10 శాతం పెట్టుబడిని పెంచడం ద్వారా అతను సాధారణ SIP కంటే రెట్టింపు రాబడిని పొందుతాడు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఎప్పటికప్పుడు నెలవారీ పెట్టుబడిని పెంచడానికి సిప్(SIP) టాప్-అప్ ఎంపికను అందిస్తాయి.

సిప్ రాబడి పోలిక

వివరాలు________________రెగ్యులర్ సిప్_________సిప్ టాప్-అప్
నెలవారీ సిప్______________5,000___________________5000

వ్యవధి____________________20 ఏళ్లు________________20 ఏళ్లు
అంచనా రాబడి__________12 శాతం_______________12 శాతం

ఏడాదికి టాప్-అప్________0 శాతం________________10 శాతం
మొత్తం పెట్టుబడి_________రూ.12 లక్షలు_________రూ.34.37 లక్షలు

మెచ్యూరిటీ మొత్తం_______రూ.49.95 లక్షలు_______రూ.93.55 లక్షలు

లాభం__________________రూ.37.96 లక్షలు_______రూ.59.18 లక్షలు


Spread the love

1 thought on “సిప్ టాప్అప్’తో మీ డబ్బు రెట్టింపు..”

Leave a Comment

error: Content is protected !!