ఈ సర్వేలో ఆర్థిక నిర్ణయాలు, లక్ష్యాలను నిర్దేశించడం, పొదుపులు, పెట్టుబడి విధానాలు, డిజిటల్ సాధనాలను స్వీకరించడ, వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులకు సంబంధించి వారి ప్రాధాన్యతల గురించి మహిళల నుండి సమాచారం సేకరించారు. డిబిఎస్ బ్యాంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ జోషి మాట్లాడుతూ, భారతదేశంలోని శ్రామిక మహిళల ఆకాంక్షలలో ఆర్థిక స్థిరత్వం ప్రాముఖ్యతను సర్వే హైలైట్ చేస్తుంది. ఆధునిక మహిళలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేసుకుంటారనడానికి ఆర్థిక నిర్ణయాధికార సామర్థ్యాలు, వైవిధ్యభరితమైన పెట్టుబడులు, డిజిటల్ ఛానెల్‌లకు పెరుగుతున్న ఆదరణే రుజువు అని అన్నారు.
సర్వే ప్రకారం, 25-35 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో 33 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్ కోసం UPIని ఉపయోగిస్తున్నారు, అయితే 45 ఏళ్లు పైబడిన వారిలో 22 శాతం మంది మాత్రమే UPIని ఉపయోగిస్తున్నారు.
జీతం, స్వయం ఉపాధి పొందుతున్న భారతీయ మహిళల్లో 98 శాతం మంది దీర్ఘకాల కుటుంబ నిర్ణయాధికారంలో చురుకుగా పాల్గొంటారు.
ఇంటిని కొనడం అనేది 25-35 ఏళ్ల మధ్య ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత, అయితే ఇది 35-45 ఏళ్ల కేటగిరీలో ఉన్న వారికి పిల్లల విద్య, 45 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి వైద్య సంరక్షణ పట్ల జాగ్రత్త ఉంది.
పొదుపు, రుణాలు, పెట్టుబడిపై సర్వే ప్రకారం, మెట్రోలలోని మహిళలు తమ పెట్టుబడులలో 51% ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), సేవింగ్ ఖాతాలలో ఉంచడంతో రిస్క్ తగ్గించుకుంటారు. ఆ తర్వాత బంగారంలో 16%, మ్యూచువల్‌లో 15% ఉన్నారు. రియల్ ఎస్టేట్‌లో 10% మరియు స్టాక్‌లలో కేవలం 7 శాతమే ఉంది.
ఆధారపడిన వారితో ఉన్న వివాహిత మహిళల్లో 43% మంది తమ ఆదాయంలో 10-29% పెట్టుబడికి కేటాయిస్తారు, అయితే దీనికి విరుద్ధంగా, ఆధారపడి లేని వివాహిత మహిళల్లో నాలుగింట ఒక వంతు మంది తమ ఆదాయంలో సగానికిపైగా పెట్టుబడి పెట్టడానికి ఎంచుకుంటారు.
క్రెడిట్ కార్డ్ వినియోగంలో హైదరాబాద్, ముంబై ముందంజలో ఉన్నాయి, ముంబైలో 96% మంది మహిళలు క్రెడిట్ కార్డ్‌లపై ఆధారపడగా, కోల్‌కతాలో 63% మంది మహిళలు మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారు.
జీతాలు తీసుకునే మహిళల్లో సగం మంది తాము ఎప్పుడూ రుణం తీసుకోలేదని పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. రుణం తీసుకున్న వారిలో ఎక్కువ మంది గృహ రుణం కోసం ఎంచుకున్నారు.
25-35 ఏళ్ల వయస్సు ఉన్నవారిలో 33% మంది ఆన్‌లైన్ షాపింగ్ కోసం UPIని ఉపయోగించడానికి ఇష్టపడగా, 45 ఏళ్లు పైబడిన 22% మంది మాత్రమే UPIని ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల చెల్లింపు అవసరాల కోసం UPI పేమెంట్ పట్టణ మహిళలకు ముఖ్య ఎంపికగా నిలుస్తుందని నివేదిక పేర్కొంది. నగదు బదిలీలు (38%), యుటిలిటీ బిల్లులు (34%), ఇకామర్స్ కొనుగోళ్లు (29%), నగదుపై ఆధారపడటం తగ్గుముఖం పడుతోంది. ఢిల్లీలో కేవలం 2% మంది మహిళలు మాత్రమే నగదు చెల్లింపులను ఎంచుకున్నారు, అయితే కోల్‌కతాకు చెందిన 43% మంది మహిళలు ఈ ఎంపికను ఎంచుకున్నారు.