మీ పిల్లలను డాక్టర్‌గా చూడాలనేది మీ కలా..

Spread the love

ఇప్పుడు వైద్య విద్య ఎంతో ఖర్చుతో కూడినది
దీనికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి

ఈ రోజుల్లో తల్లిదండ్రులు అత్యంత ఆందోళన చెందే అంశాల్లో పిల్లల చదువు ఒకటి. నేడు పిల్లల చదువు ఎంత ఖరీదు అయిందో మీకు తెలుసు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు అన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవే. ముఖ్యంగా తమ బిడ్డను డాక్టర్‌గా చూడాలనుకునే తల్లిదండ్రుల కల నెరవేరడం ఇప్పుడు చాలా కష్టమై విషయం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఫీజులు తక్కువగా ఉన్నా నీట్ ద్వారా అక్కడ ప్రవేశం లభిస్తుంది. ఈ పరీక్షలో మంచి మార్కులు రాకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం లభించదు. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ పొందినప్పటికీ, ప్రైవేట్ వైద్యంతో పోలిస్తే మౌలిక సదుపాయాల కొరత, అధ్యాపకుల కొరత నిరాశ కల్గిస్తుంది. 

డాక్టర్ విద్య ఖరీదైనది
ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదవడం చాలా ఖర్చుతో కూడిన విషయం. ఎందుకంటే ప్రస్తుతం మెడికల్ కాలేజీలు ఏడాదికి రూ.15 లక్షల నుండి 25 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు మీ పిల్లవాడు చిన్నవాడైతే, అతను పెద్దయ్యాక ఫీజు మరింత ఎక్కువ అవుతుంది. ఈ పరిస్థితిలో మీ కలను నెరవేర్చుకోవడానికి ఇప్పటి నుండే ఒక పక్కా ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. 

ఇప్పటి నుండి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పిల్లలను ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో అడ్మిషన్ పొందేలా ఒక పెద్ద కార్పస్‌ని తయారు చేయవచ్చు. మీరు ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందామా. పిల్లల తల్లిదండ్రులు ఈ రెండు ఆలోచనలను చూడండి.. వాటిని ఓసారి పరిశీలిద్దాం.. 

ప్లాన్-1

 మీ పిల్లల వయస్సు 6 ఏళ్లు ఉంటే.. అతనికి 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అంటే 12 సంవత్సరాల వరకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారని అనుకుందాం. మీరు 12 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 50,000 సిప్ (SIP) చేస్తే, అది 12 శాతం వార్షిక రాబడిని ఇస్తుందని అనుకుంటే.. అప్పుడు మీరు రూ. 1.62 కోట్ల ఫండ్‌ని సేకరించవచ్చు. 

ప్లాన్-2 

 మీ పిల్లల వయస్సు 5 సంవత్సరాలు ఉంటే.. మీరు 15 సంవత్సరాల పాటు వైద్య విద్య కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేయాలి అనుకుందాం. రూ. 2 కోట్ల ఫండ్‌ని సేకరించడానికి, మీరు ప్రతి నెలా రూ. 40,000 సిప్ చేయాలి. ఏడాదికి 12 శాతం రాబడిని పొందితే అప్పుడు మీ పిల్లల చదువు కోసం రూ. 2.01 కోట్లు సేకరించవచ్చు. 


Spread the love

1 thought on “మీ పిల్లలను డాక్టర్‌గా చూడాలనేది మీ కలా..”

Leave a Comment

error: Content is protected !!