ప్రతిరోజూ రూ.20 పొదుపుతో కోటీశ్వరుడు కావచ్చు

Spread the love

ఈ కలను నెరవేర్చుకోవచ్చని మీకు తెలుసా?

ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ధనవంతులు కావాలని, వారి బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు చూడాలని కోరుకుంటారు. కానీ మధ్యతరగతి వ్యక్తికి చాలా ఎక్కువ సంపద అంత సులభం కాదని అందరికీ తెలుసు. కానీ మీ కల నెరవేరవచ్చు. సిప్(SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ మెంట్(పెట్టుబడి) ఇలా చేయడం ద్వారా మీరు కోటీశ్వరులు కావాలనే మీ కలను నెరవేర్చుకోవచ్చు. దీని కోసం మీరు రోజుకు 20 రూపాయలు మాత్రమే పొదుపు చేయాలి.

ప్రతిరోజూ కేవలం 20 రూపాయలు పొదుపు చేయడం ద్వారా మీరు కోటీశ్వరులు కావచ్చు. మ్యూచువల్ ఫండ్‌లో రోజుకు రూ. 20 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు రూ. 10 కోట్లు పోగు చేసుకోవచ్చు. అయితే దీన్ని చేయడానికి, పొదుపు లేదా పెట్టుబడి ఎలా చేయాలో పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ కేవలం 20 రూపాయలు ఆదా చేయడం ద్వారా మీరు కోటీశ్వరుడిడా ఎలా కావొచ్చో చూద్దాం.

సిప్ (SIP)లో పెట్టుబడితో..

  • మీరు 20 సంవత్సరాల వయస్సు నుండి రోజుకు కేవలం 20 రూపాయలు ఆదా చేస్తే, అది ఒక నెలలో 600 రూపాయలు అవుతుంది.
  •  మీరు మ్యూచువల్ ఫండ్‌లో నెలవారీ రూ. 600 సిప్ చేస్తారు. మీరు ఈ పెట్టుబడిని ఇలా మొత్తం 40 ఏళ్లపాటు చేయాలి. 
  • ఈ పెట్టుబడి గానూ మీకు సంవత్సరానికి 15 శాతం వరకు రాబడి పొందవచ్చు. దీని ప్రకారం 40 ఏళ్ల తర్వాత మీకు మొత్తం రూ.1.88 కోట్లు వస్తాయి. ఈ 40 ఏళ్లలో మీరు కేవలం రూ.2,88,000 మాత్రమే పెట్టుబడి పెడతారు. 
  • మీరు రూ. 600 SIPపై ఒకవేళ 20 శాతం రాబడిని పొందినట్లయితే, మీరు 40 సంవత్సరాలలో మొత్తం రూ. 10.21 కోట్లు జమ చేస్తారు. అంటే రాబడి ఎక్కువగా ఉంటే, మనం పొందే మొత్తం కూడా భారీగానే ఉంటుంది.

Spread the love

Leave a Comment

error: Content is protected !!