ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనవచ్చా?

Spread the love

ద్రవ్యోల్బణం పెరుగుతోంది..

ఇప్పుడు సరైన సమయమా లేక మరికొంత కాలం వేచి ఉండాలా?

ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ సమయంలో ఇళ్లు లేదా కార్ల కొనుగోలు చేయవచ్చా? అనే ప్రశ్న అందరి మదిలో తలెత్తుతోంది. అయితే ప్రజలు మాత్రం ఆస్తులు, కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత ఈ ఏడాది కొనుగోళ్లకు జనం మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాత ఇల్లు, కారు కొనడానికి సరైన సమయం ఎప్పుడని వారు ఆలోచనలో పడ్డారు. మరికొందరు మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజా ద్రవ్యోల్బణం గణాంకాల తర్వాత డిసెంబర్ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ రుణ రేట్లను మరింత పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే డిసెంబర్ నుంచి ఇల్లు లేదా కార్ లోన్ తీసుకోవడం మరింత ఖరీదు అవుతుంది. అంటే మీరు కొనాలని ప్లాన్ చేస్తే, వేచి ఉండటం మేలు, లేకపోతే మీకు చాలా ఖర్చు అవుతుంది. దీని గురించి ఒక ఆర్థిక సంస్థ చెప్పిందేమిటో చూద్దాం..

వడ్డీ రేట్లు ఎంతమేరకు పెరగవచ్చు

  • డిసెంబర్‌లో జరగబోయే సమీక్షలో ఆర్‌బిఐ రేట్లలో అర శాతం(0.50 శాతం) పెంపుదల ఉంటుందని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేసింది. దీంతో కీలక రేట్లు 6.4 శాతానికి చేరనున్నాయి.
  • నివేదిక ప్రకారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్‌పై ఒత్తిడి పెంచింది. అందువల్ల సెంట్రల్ బ్యాంక్ రేట్లు పెంచడానికి సిద్ధంగా ఉంది. అంతకుముందు సెప్టెంబర్ లో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును అర శాతం పెంచింది. 
  • డిసెంబర్‌లో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను అర శాతం పెంచితే, ఏడాది చివరి నాటికి రుణాల రేట్లు కూడా పెరుగుతాయి. అంటే రాబోయే సంవత్సరాల్లో రుణాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. 
  • రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ఠ స్థాయి 7.4 శాతానికి చేరుకుంది. ఎందుకంటే ఆహార ధరలు వరుసగా తొమ్మిదవ నెలలో అదుపు తప్పాయి. వరుసగా 9వ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ టార్గెట్ పరిధి 2-6 శాతం కంటే ఎక్కువగానే నమోదైంది. ఈ డేటా ఆధారంగా ఆర్బిఐ తన క్రెడిట్ పాలసీని నిర్ణయిస్తుంది.
  •  అధికారిక గణాంకాల ప్రకారం, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.41 శాతానికి చేరుకుంది. ఇది ఆగస్టులో 7 శాతం, సెప్టెంబర్ 2021లో 4.35 శాతంగా ఉంది. ఆగస్టులో 7.62 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది సెప్టెంబర్‌లో 8.60 శాతానికి పెరిగింది.
ద్రవ్యోల్బణం అంటే ఏమిటి.. ?

Spread the love

Leave a Comment

error: Content is protected !!