చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయిగా..
ఇతర ఫండ్స్ కు ఇండెక్స్ ఫండ్ కు తేడా ఏమిటి..
అసలు సిప్ కు ఏది బెటర్?
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ గురించి వినే ఉంటారు. అయితే వాటిలో ఏది బెటర్ అనేది తెలుసుకునేందుకు విశ్లేషణ అవసరం. నేను మీకు ముందు మ్యూచువల్ ఫండ్స్ గురించి చెబుతాను. ఎందుకంటే షేర్ల కంటే ఫండ్స్ సురక్షితమైనవి. మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తి అవగాహన ఇస్తాను. ఇలాంటివి వీడియోల ద్వారా పూర్తి వివరంగా తెలుసుకుని, అర్థం చేసుకోలేం. అయితే చదవడం ద్వారా అత్యంత వివరంగా తెలుసుకోవచ్చన్నది నా అభిప్రాయం, కానీ ఈ రోజుల్లో చదివే వారు తగ్గిపోయారు. మీకు చదివే ఓపిక ఉంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి వివరంగా చెబుతాను చూడండి.
2022లో భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి నాకు తెలిసిన కొన్ని ఉత్తమ ఎస్ఐపి(SIP) మ్యూచువల్ ఫండ్‌ల గురించి చెబుతాను.
ఈ రోజుల్లో ఇండెక్స్ ఫండ్ ఉత్తమమైంది. అయితే “రెగ్యులర్” కాకుండా “డైరెక్ట్” మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టండి. దాంతో మంచి రాబడిని పొందుతారు. మార్కెట్ అంటే రిస్క్, దీర్ఘకాలికంగా మాత్రం మంచి రాబడిని ఆశించవచ్చు. దీన్నకి మీరు డెట్, ఈక్విటీ సమతూకంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎఎంసి(AMC)లు చాలా ఇండెక్స్ ఫండ్‌లను ప్రారంభిస్తున్నాయి. ఎందుకంటే వారు ట్రెండ్‌ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇండెక్స్ ఫండ్‌లను సొంతం చేసుకోవడం మంచిది. దీనికి చాలా ఓపిక అవసరం. కొత్త మ్యూచువల్ ఫండ్ల కొనుగోలులో ఎక్కువ భాగం వాటి గత పనితీరుపై ఆధారపడి ఉంటుంది. చాలా వరకు గత పనితీరు ఆధారంగా ఫండ్లను తీసుకుంటారు. అయినప్పటికీ ఫండ్ మేనేజర్‌లు గత పనితీరును పునరావృతం చేస్తారో లేదో ఖచ్చితంగా తెలియదు. కానీ పెట్టుబడిదారులు వారినే నమ్మవలసి వస్తుంది.
ఇండెక్స్ ఫండ్ ను బీట్ చేయగల కొంతమంది ఫండ్ మేనేజర్‌లు ఉన్నారు. అయినప్పటికీ ఇండెక్స్ మాదిరిగా స్థిరంగా ఉంటూ, దీర్ఘకాలంలో రాబడినిచ్చేవి చాలా తక్కువే.
ఉత్తమ ఇండెక్స్ ఫండ్‌లను ఎలా ఎంచుకోవాలి?
మీరు ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటే, ముఖ్యంగా ఫండ్స్‌లోని మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. వాటి గురించి తెలుసుకుందాం..
వ్యయ నిష్పత్తి: తక్కువ ఖర్చు ఉండే ఫండ్ ఉత్తమం.
ట్రాకింగ్ ఎర్రర్: ఇది బెంచ్‌మార్క్ చేసిన ఇండెక్స్‌కు సంబంధించి రిటర్న్‌లను చూసేది. ఫండ్ గురించి తప్పిదాలు తక్కువగా అంటే ఫండ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. కొన్ని ఫండ్ హౌస్‌లు డేటాను క్రమం తప్పకుండా ప్రచురించవు. అందుకే ఈ డేటా పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఎయుఎం : అధిక ఎయుఎం(AUM) అంటే ఫండ్ మేనేజర్‌కి లిక్విడిటీ సమస్యలను నిర్వహించడానికి మెరుగైన ప్రయోజనం ఉందన్నమాట.
పెట్టుబడి పెట్టడానికి ముందు..
- పెట్టుబడిలోకి దూకడానికి ముందు ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవాలి. ప్రమాదం, ఆసుపత్రిలో చేరడం, ఆకస్మిక ఆదాయ నష్టం, ఉద్యోగ నష్టం వంటి వాటికి ముందస్తుగా ఏం చేయాలో తెలుసుకోవాలి.
- సరైన జీవిత బీమా తీసుకోవాలి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ మీ వార్షిక ఆదాయంలో కనీసం 15-20 రెట్లు ఉండాలి. మీరు మీ స్వంత ఆరోగ్య బీమాను కలిగి ఉండాలి. యజమాని అందించిన ఆరోగ్య బీమాపై ఆధారపడకుండా ఉండాలి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్, సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో మెరుగైన కవరేజీని తీసుకోండి. రూ. 3-5 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్, దాదాపు రూ.10-25 లక్షల సూపర్ టాప్ అప్ ఈ రోజుల్లో తప్పనిసరి. చివరకు కనీసం 6-24 నెలల అత్యవసర నిధిని సిద్ధంగా ఉండనివ్వండి. మీ ఆదాయం ఆగిపోయినప్పుడు, మీరు ఏదైనా ప్రణాళిక లేని ఖర్చులను ఎదుర్కొన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
- పైన పేర్కొన్న అంశాలు పూర్తయిన తర్వాత పెట్టుబడి గురించి ఆలోచించండి. వీటిని పాటించకపోతే మీ పెట్టుబడి నిర్మాణం ఏ సమయంలోనైనా కుప్పకూలవచ్చు. పెట్టుబడి గురించి అంతా తెలుసుకుని ముందుకు సాగండి.
సరైన ఆర్థిక లక్ష్యాన్ని కలిగి ఉండాలి
చాలా మంది పెట్టుబడిదారులు తమ వద్ద కొంత మిగులు డబ్బు ఉంది, కావున మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడతారు. బ్యాంక్ ఎఫ్‌డిలు, పిపిఎఫ్, ఆర్‌డిలు లేదా ఎల్‌ఐసి ఎండోమెంట్ ఉత్పత్తులతో పోలిస్తే దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్‌లు ఉత్తమమని చెప్పడం వల్ల అలా చేసే వారున్నారు.
- మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు?
- మీ పిల్లల విద్య లేదా వివాహ ఖర్చుల కోసమా
- మీకు డబ్బు ఎప్పుడు కావాలి?
- మీరు అనుకున్న సమయంలో మీకు ఎంత డబ్బు కావాలి?
పైన వాటిలో స్పష్టత ఉంటే స్కీమ్ ను ఎంచుకోవడంలో సరిగ్గా ఉన్నారన్నమాట.
ఇది స్వల్పకాలిక లక్ష్యం అయినా లేదా దీర్ఘకాలిక లక్ష్యం అయినా, రుణం, ఈక్విటీ మధ్య సరైన ఆస్తి కేటాయింపు తప్పనిసరి. లక్ష్యం 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఈక్విటీ ఉత్పత్తి జోలికి వెళ్లొద్దు. ఇలాంటి వారు ఎఫ్డీ(FD)లు, ఆర్డీ(RD)లు, లిక్విడ్ ఫండ్‌లు, మనీ మార్కెట్ ఫండ్‌లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్‌లు వంటి డెట్ ఉత్పత్తులను ఉపయోగించండి.
లక్ష్యం 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటే ఈక్విటీ 60:40 నిష్పత్తిలో ఉండాలి.
లక్ష్యం 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఈక్విటీ 40:60 నిష్పత్తిలో ఉండాలి.
రుణ ఉత్పత్తిని ఎంచుకునే సమయంలో ఉత్పత్తి మెచ్యూరిటీ వ్యవధి తప్పనిసరిగా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలి. పిపిఎఫ్ మెచ్యూరిటీ వ్యవధి 13 సంవత్సరాలు, మీ లక్ష్యం 10 సంవత్సరాలు అయితే ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేరు. అందుకే దీర్ఘకాల వ్యవధి నిబంధనను తప్పనిసరిగా పాటించాలి.
2022లో పెట్టుబడి పెట్టడానికి కొన్ని ఉత్తమ మ్యూచువల్ ఫండ్ లు
- – UTI నిఫ్టీ ఇండెక్స్ ఫండ్-డైరెక్ట్-గ్రోత్
- – HDFC ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్ ప్లాన్-డైరెక్ట్-గ్రోత్
- – ICICI ప్రూ నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్ ఫండ్-డైరెక్ట్-గ్రోత్
- – UTI నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్ ఫండ్-డైరెక్ట్-గ్రోత్
- – పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్-డైరెక్ట్-గ్రోత్
- – యాక్సిస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్-డైరెక్ట్-గ్రోత్
- – SBI ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్
- – కెనరా రోబెకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్