1 బాండ్ కు రూ. 5,059 చెల్లించాలి
ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వారు సావరిన్ గోల్డ్ బాండ్(SGB)లో డబ్బును పెట్టుబడి పెట్టడం ఎంతో ఉత్తమం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో సావరిన్ గోల్డ్ బాండ్లను సద్వినియోగం చేసుకోవాలి. వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 కింద ఫిబ్రవరి 28 నుండి మార్చి 4 వరకు బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈసారి సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.5,109 లేదా ఒక బాండ్‌గా నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి డిజిటల్ చెల్లింపు చేసే వారికి గ్రాముకు రూ.50 తగ్గింపు లభించనుంది. అంటే 1 గ్రాము బంగారానికి రూ.5,059 చెల్లిస్తే సరిపోతుంది.
ఆర్బిఐ(RBI) జారీ చేస్తుంది..
సావరిన్ గోల్డ్ బాండ్(SGB) అనేది ప్రభుత్వ బాండ్, దీనిని ఆర్బిఐ(RBI) జారీ చేస్తుంది. దీన్ని డీమ్యాట్ రూపంలోకి మార్చుకోవచ్చు. వీటి విలువ బరువు ఆధారంగా ఉంటుంది. బాండ్ విలువ 5 గ్రాముల బంగారం ఉంటే, ఇక గోల్డ్ బాండ్ విలువ కూడా భౌతిక 5 గ్రా. బంగారం ధరతో సమానంగా ఉంటుంది. కొనుగోలు చేసేందుకు ఈ బాండ్ ధరను సెబీ ఆధీనంలోని బ్రోకర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. బాండ్ కొని, ఆ తర్వాత అమ్మితే పెట్టుబడిదారుడి ఖాతాలో డబ్బు జమ చేస్తారు.
ఇష్యూ ధరపై 2.50% వడ్డీ
సావరిన్ గోల్డ్ బాండ్(SGB) ఇష్యూ ధరపై ప్రతి సంవత్సరం 2.50 శాతం స్థిర వడ్డీ రేటు కూడా వస్తుంది. ఈ డబ్బు ప్రతి 6 నెలలకు ఓసారి మీ ఖాతాలో జమచేస్తారు. అయితే దానిపై శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది సుమా.
24 క్యారెట్ల స్వచ్ఛత
స్వచ్ఛత గురించి చింతించాల్సిన అవసరం లేదు. సావరిన్ గోల్డ్ బాండ్లలో ప్యూరిటీ బయటి పసిడికి కంటే ఎక్కువ. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రకారం, గోల్డ్ బాండ్ల ధర ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) నిర్ణయిస్తుంది. ఇది 24 క్యారెట్ల స్వచ్ఛత బంగారం ధర ప్రకారం ఉంటుంది. డీమ్యాట్ రూపంలో ఉండే ఇది ఎంతో సురక్షితం, దీనికి ఎలాంటి ఖర్చు కూడా ఉండబోదు.
పన్ను చెల్లించాల్సి ఉంటుంది..
సావరిన్ గోల్డ్ బాండ్ మెచ్యూరిటీ వ్యవధి 8 సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చే లాభంపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే మీరు 5 సంవత్సరాల తర్వాత డబ్బును ఉపసంహరించుకుంటే, దాని నుండి వచ్చే లాభంపై దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG) పన్ను విధిస్తారు.
ఆఫ్‌లైన్‌లో కూడా ఇన్వెస్టే చేయచ్చు..
గోల్డ్ బాండ్ లో పెట్టుబడి పెట్టడానికి ఆర్బిఐ అనేక ఎంపికలను ఇచ్చింది. వాటిలో బ్యాంకు బ్రాంచ్ లు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL) వంటివి ఉన్నాయి. వీటి ద్వారా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారు దరఖాస్తు ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత డబ్బు మీ ఖాతా నుండి డెబిట్ అయ్యి, ఈ బాండ్‌లు మీ డీమ్యాట్ ఖాతాకు బదిలీ అవుతాయి.
ఆరేళ్లలో 92% రాబడినిచ్చింది..
2015-16లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రారంభించగా, గత 6 సంవత్సరాల్లో 92% రాబడి వచ్చింది. ఆ సమయంలో గ్రాము ధర రూ. 2,684, దీనిపై రూ.50 తగ్గింపుతో రూ.2,634కే లభించిది. ఇప్పుడు(2022) ప్రారంభించబడిన సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ ధర రూ. 5,109, రూ.50 తగ్గింపుతో రూ.5,059కి లభిస్తుంది. అంటే గత ధరతో పోలిస్తే 6 సంవత్సరాలలో 92% రాబడిని ఇచ్చింది.
వచ్చే 2, 3 గోల్డ్ రేటు మరింత పెరగనుంది..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల రూ. 56,000 కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చే రెండు మూడు నెలల్లో బంగారం 2100 డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంటే రూపాయిల్లో మారిస్తే ఈ రేటు 10 గ్రాములు రూ. 56 వేలకు చేరుతుందన్నమాట.
ఈ స్కీమ్ 2015లో ప్రారంభించారు..
2015 నవంబర్ లో ఈ సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) స్కీమ్ ప్రభుత్వం ప్రారంభించింది. భౌతిక బంగారం డిమాండ్‌ను తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. సబ్‌స్క్రిప్షన్ వ్యవధికి ముందు వారంలోని చివరి 3 రోజులకు ఐబిజెఎ జారీ చేసిన 999 స్వచ్ఛత బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా బాండ్ ధర నిర్ణయిస్తారు.
ఎస్జిబిలో ఒక గ్రాము గోల్డ్ కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు
ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 500 గ్రాముల గోల్డ్ బాండ్లను కొనవచ్చు. ఇక కనీసం ఒక గ్రాము బంగారాన్ని పెట్టుబడి పెట్టే వీలుంది. ఈ హిందూ అవిభక్త కుటుంబం లేదా హెచ్యుఎఫ్ (HUF) 4 కిలోలు, ట్రస్ట్ వంటివారు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి మార్చి వరకు 20 కిలోలు పెట్టుబడి పెట్టవచ్చు.
బంగారం దొంగిలిస్తారనే భయం ఉండదు.. పెట్టుబడి సురక్షితం