క్రిప్టోకరెన్సీపై 30 శాతం పన్ను చెల్లించాల్సిందేనా?

Spread the love

బడ్జెట్ ప్రకటనలో ఏం చెప్పారు? ఇప్పుడు ఇది సురక్షితమేనా?

మనం ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన లాభాలను పొందవచ్చా?

క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనలో బిట్ కాయిన్ వంటి క్రిప్టోలపై 30 శాతం పన్ను విధిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ ఇది చట్టబద్ధమేమీ కాదంటున్నారు. ఇది ఒక లాటరీ, జూదం వంటి వ్యవహారం అని, దానిలాగే పరిగణిస్తామని ఆదాయం పన్నుశాఖ, ప్రభుత్వం చెబుతున్నాయి. 2022 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ 1 అన్ని రకాల వర్చువల్ డిజిటల్ ఆస్తులపై 30 శాతం టాక్స్ విధిస్తామని ప్రకటించారు. దీంతో పాటు క్రిప్టో లావాదేవీలపై 1 శాతం టిడిఎస్ విధిస్తామని కూడా చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో పన్ను క్రిప్టో పెట్టుబడిదారులను నిరుత్సాహానికి గురిచేస్తుంది. అయితే అసలు క్రిప్టోకరెన్సీ కొంటే మన పరిస్థితి ఏమిటి? ఏం జరుగుతుంది? కొనాలా? వద్దా? వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

వర్చువల్ అసెట్స్ నుండి వచ్చే ఏదైనా ఆదాయంపై 30 శాతం పన్ను రేటు, క్రిప్టో గిఫ్ట్ కార్డ్‌లకు గ్రహీతకు చివరిలో పన్ను విధిస్తారు. నష్టాల విషయంలో సెట్ ఆఫ్ అనుమతించరు. క్రిప్టోతో కూడిన కొనుగోలు, అమ్మకాల లావాదేవీలపై 1 శాతం టిడిఎస్ గా డిడక్ట్ చేస్తారు.

గ్రహీత ఇప్పుడు తన ఆదాయంతో సంబంధం లేకుండా వచ్చిన రాబడిలో 30 శాతం పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

క్రిప్టోపై 1 శాతం(TDS) విధించడం ఈ మార్కెట్‌ చేసే ట్రేడర్లు, ఇన్వెస్టర్లు, ఎక్స్ఛేంజీలు, ఇతర వ్యక్తులకు ఆందోళన కల్గిస్తోంది. ఇది ఈ అసెట్స్ లావాదేవీల కోసం చేసిన అన్ని పేమెంట్లను ప్రభావితం చేస్తుందంటున్నారు.

కానీ క్రిప్టో హోల్డింగ్‌లను విక్రయించినట్లయితే ఎలాంటి పన్ను ఉంటుందనే దానిపై బడ్జెట్ 2022లో ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చినట్లయింది. పన్నుల పరంగా కొంత సమాచారం ఉండటం వల్ల ఇన్వెస్టర్లు టాక్స్ కోసం తమను తాము సిద్ధం చేసుకుంటారు.

క్రిప్టోకరెన్సీ ఆదాయాలను ప్రభుత్వం లాటరీల అమ్మకంతో పోల్చింది. అవి పూర్తిగా ఊహాజనిత స్వభావంగా పరిగణించనున్నట్టు గవర్నమెంట్ తేల్చింది.

మొత్తానికైతే నిషేధించలేదు.. పన్నులపై స్పష్టత

భారతదేశంలో క్రిప్టోపై నిషేధం విధిస్తారంటూ చాలా కాలం వార్తలు వచ్చాయి. కానీ బడ్జెట్ ఈ మాట లేకుండా 30 శాతం పన్ను ప్రకటన చేశారు. అంటే నిషేధించలేదు, అదే సమయంలో పన్నులపై స్పష్టతనిచ్చారు. ప్రభుత్వానికి పన్ను రూపంలో మంచి ఆదాయ వనరు అని క్రిప్టోను భావించింది. అయితే క్రిప్టో రిస్క్ తో కూడిన అసెట్ గా పరిగణించడం వల్ల పెట్టుబడిదారులు తక్కువ అంచనా వేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

అయితే కొన్ని దెబ్బతీసే విషయాలు..

టిడిఎస్ వంటి అనేక చాలా నిబంధనలు ఉన్నప్పటికీ పన్ను రేటు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

ప్రజలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి అనుమతించలేదు, దీనివల్ల వారు పన్ను ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది.

భారీ పన్నుల కారణంగా ఎక్స్ఛేంజీలు వాల్యూమ్‌లను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

పలు నిబంధనల కారణంగా తక్కువ వాల్యూమ్, దీంతోపాటు ట్రేడ్‌లు కూడా తగ్గుతాయి.


Spread the love

1 thought on “క్రిప్టోకరెన్సీపై 30 శాతం పన్ను చెల్లించాల్సిందేనా?”

Leave a Comment

error: Content is protected !!