ఆ తర్వాత జీవితాంతం సంతోషంగా గడపాలనుకుంటున్నారా? ఈ చిట్కాలను పాటించండి.
ప్రతి ఒక్కరు కష్టపడేది డబ్బు, సంతోషకరమైన జీవితం కోసమే.. దీని కోసం ఒక్కొక్క విధంగా కష్టపడతారు, ఆర్థిక ప్రణాళికలను కల్గివుంటారు. అసలు మీరు మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు పని చేయాలనుకుంటున్నారు? ఎప్పుడు రిటైర్మెంట్ (పదవీ విరమణ) తీసుకోవాలనుకుంటున్నారు? ఈ ప్రశ్న నేటి యువతను అడిగితే వారి సమాధానం 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుంది. రోజూ ఆఫీసుకు వెళ్లి ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపాలని ఎవరు కోరుకుంటారు? చెప్పండి.. ఎవ్వరైనా త్వరగా పదవీ విరమణ చేసి, తమ జీవితాంతం హాయిగా గడపాలని కోరుకుంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్(ఆర్థిక ప్రణాళిక) ప్రకారం ముందుకు వెళితే అలా చేయడం కష్టమేమీ కాదు. మీరు 40 సంవత్సరాల వయస్సులో సులభంగా పదవీ విరమణ పొందవచ్చు. అయితే దీనికి క్రమశిక్షణ చాలా ముఖ్యం. పెట్టుబడులకు సంబంధించిన కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మీరు ముందుగానే రిటైర్ కావచ్చు. ఆ విషయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..
మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు?
రెండు ప్రాథమిక ప్రశ్నలను మీకు మీరే అడగండి.
మొదటిది.. పదవీ విరమణలో మీ జీవనశైలిని కొనసాగించడానికి మీకు ఎంత ఆదాయం అవసరం?
రెండోది.. మీరు ఎంత త్వరగా పదవీ విరమణ చేయాలనుకుంటున్నారు?
మీ నెలవారీ లేదా వార్షిక ఖర్చులు ఏమిటి, ఎంత ఉంటాయి?
ఈ నియమం దీనికి మీకు సహాయం చేస్తుంది. అదే 4 శాతం నియమం..
మీరు 5 కోట్ల రూపాయలతో పదవీ విరమణ చేస్తే, 4 శాతం నియమం ప్రకారం, మీరు ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలలో 4 శాతం ఉపయోగించవచ్చు. ఈ మొత్తం 20 లక్షల రూపాయలు ఉంటుంది. వాస్తవానికి, దీన్ని చేయడానికి మరొక మార్గం నిబంధనలను రివర్స్ చేయడం. అంటే మీ రిటైర్‌మెంట్ ఫండ్ మొదటి సంవత్సరంలో మీరు విత్‌డ్రా చేసుకునే మొత్తానికి 25 రెట్లు ఉండాలి. పదవీ విరమణ చేసిన మొదటి సంవత్సరంలో మీరు 10 లక్షలు ఖర్చు చేయాలి అనుకుందాం, ఆపై 25 రెట్లు అంటే 2.5 కోట్లు. కాబట్టి మీరు పదవీ విరమణ సమయంలో ఈ మొత్తాన్ని కలిగి ఉండాలి.
50 నుంచి 70 శాతం ఆదా చేయాలి తప్పదు..
- మీకు వచ్చే ఆదాయంలో ప్రతి నెలా 50 నుంచి 70% ఆదా చేయాలి. అయితే ఇంటి అద్దె, ఆహారం, పిల్లల చదువులు, ఇంటి రుణం వంటి కొన్ని అవసరమైన ఖర్చులతో ఒకరి ఆదాయంలో సగం ఆదా చేయడం సాధ్యం కాదు. కానీ మీరు ఈ స్థాయికి వీలైనంత దగ్గరగా సేవ్ చేయాలి.
- లేకపోతే ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
- మీరు పార్ట్‌టైమ్ ఉద్యోగం వంటి సైడ్ బిజినెస్‌ని ప్రారంభించడం,
- వేతనం పెంపు కోసం అడగడం, మెరుగైన వేతనం కోసం ఉద్యోగాలను మార్చడం, మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం లేదా మరొక ఆదాయ వనరును కనుగొనడం ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
- మీ ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీరు ఆర్థిక క్రమశిక్షణను ప్రదర్శించాలి.
- మీరు మీ పొదుపులను తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్ వంటి వాటిలో తెలివిగా పెట్టుబడి పెట్టాలి.
- ఎక్కువ ఆదా చేయండి, తక్కువ ఖర్చు పెట్టండి, తెలివిగా పెట్టుబడి పెట్టండి.
సరైన వాటిలో పెట్టుబడి ఎంతో ముఖ్యం
- వీలైనంత ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాలి. వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి.
- తక్కువ రేటుతో ఇండెక్స్ ఫండ్స్ లేదా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లలో డబ్బును పెట్టుబడి పెట్టాలి.
- ఇండెక్స్ ఫండ్స్, ఇటిఎఫ్‌లలో కూడా భారతదేశం వృద్ధిని సాధిస్తోంది. మీరు వాటిని మరింత తెలివిగా ఉపయోగించుకోవచ్చు, బెంచ్‌మార్క్ కంటే ఎక్కువ రాబడిని పొందవచ్చు.