ఆలస్యం చేయోద్దు.. ఎలా, ఎవరు తీసుకోవాలో తెలుసుకుందాం
నెలవారీ ఆదాయంపై ఆధారపడిన వ్యక్తులకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆర్థికంగా భరోసా, రక్షణను ఇస్తుంది. ఫైనాన్షియల్ ప్లానర్లు ఉద్యోగం ప్రారంభంలోనే టర్మ్ ప్లాన్ తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. ఏదైనా వ్యక్తి లేదా కుటుంబం ఏదైనా వ్యక్తి ఆదాయంపై ఆధారపడి ఉంటే, అతను టర్మ్ ప్లాన్ తీసుకోవడంలో ఆలస్యం చేయకూడదని ప్లానర్లు అంటున్నారు. పాలసీదారుడు లేనప్పుడు కుటుంబ కలలను నెరవేర్చుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.
టర్మ్ ప్లాన్ ఎందుకు తీసుకోవాలి
ఇది సాధారణ జీవిత బీమా ఉత్పత్తి. మీరు లేనప్పుడు ఇది మీ కుటుంబ ఆర్థిక అవసరాలను రక్షిస్తుంది. ఒక వ్యక్తి టర్మ్ ప్లాన్ తీసుకున్నట్లయితే, అతను దురదృష్టవశాత్తు మరణిస్తే, కుటుంబానికి ఏకమొత్తం అందుతుంది.
ఏ వయస్సులో బెటర్
ఎవరైనా 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా టర్మ్ బీమాను కొనుగోలు చేయవచ్చు. అయితే ప్లానర్లు 20-25 ఏళ్ల వయస్సులో టర్మ్ పాలసీని కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ఉద్యోగం ప్రారంభంలోనే టర్మ్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
చిన్న వయస్సులో చౌక
భారతదేశంలోని బీమా ప్రొవైడర్లు ఆరోగ్యవంతమైన దరఖాస్తుదారులకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను అందించాలనుకుంటున్నారు. సాధారణంగా చిన్న వయస్సులో ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో బీమా సంస్థలు వారికి తక్కువ ప్రీమియంలతో టర్మ్ ప్లాన్‌లను అందిస్తాయి.
మెచ్యూరిటీ బెనిఫిట్ లేదు
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఎటువంటి మెచ్యూరిటీ ప్రయోజనాలను కల్గి ఉండవు అని గుర్తుంచుకోవాలి. అంటే ప్లాన్ కవరేజ్ వ్యవధిలో జీవించి ఉన్న పాలసీదారు ఎటువంటి చెల్లింపు లేదా బోనస్ పొందరు.
తక్కువ ప్రీమియంలతో ఎక్కువ కవరేజ్
టర్మ్ ప్లాన్ పూర్తిగా జీవిత బీమా పథకం. దీంతో మీరు తక్కువ ప్రీమియంతో చాలా ఎక్కువ మొత్తంలో కవరేజీని పొందుతారు. అయితే ఎండోమెంట్ ప్లాన్‌లో మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. కానీ టర్మ్ ప్లాన్‌తో పోలిస్తే ఎండోమెంట్ ప్లాన్ లో చాలా తక్కువ కవరేజీని పొందుతారు.
డబ్బు ఆదా ఇలా..
టర్మ్ ప్లాన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో మొదటి విషయం ఏమిటంటే, మీరు బీమా ప్రొవైడర్ నుండి నేరుగా ఆన్‌లైన్‌లో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. దీనింతో మీరు బ్రోకరేజ్ లేదా బ్రోకర్ కమీషన్‌ను ఆదా చేస్తారు.