లాంగ్ టర్మ్ లోన్ ఆప్షన్ సరైందా? కాదా?
అలా చేస్తే కొన్న కారు మరింత ఖరీదైనదిగా మారుతుందని తెలుసా?
సొంత కారు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల, అయితే ఈ కలను సాకారం చేసుకునేందుకు లోన్ తీసుకుంటారు. మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తే, దాని కోసం లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ లోన్ కాలపరిమితిని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రుణాన్ని వీలైనంత తక్కువ కాలానికి తీసుకోవాలి, రుణాన్ని పొడిగించకూడదు. మీరు ఎక్కువ కాలం రుణం తీసుకుంటే, మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాలి. ఈ రోజు మీకు దీర్ఘకాలిక రుణం తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తున్నాం..
కారు లోన్
కారు లోన్ గరిష్టంగా 8 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. అయితే మీరు ఎక్కువ కాలం అంటే 7 నుండి 8 సంవత్సరాల వరకు రుణం తీసుకుంటే మీకు ఎక్కువ వడ్డీ రేటుకు రుణం ఇస్తారు. ఈ వడ్డీ రేటు స్వల్పకాలిక (3 నుండి 4 సంవత్సరాలు) రుణాల వడ్డీ రేటు కంటే 0.50 శాతం వరకు ఎక్కువగా ఉండే అవకాశముంది. మీరు చాలా కాలం పాటు కారు లోన్ తీసుకుంటే ఆ కారుకు చాలా ఖర్చు పెరుగుతుంది . ఇది వాహనం ధరను 25 శాతం వరకు పెంచవచ్చు. మరోవైపు మీరు తక్కువ కాల వ్యవధి కోసం రుణం తీసుకుంటే, దీర్ఘకాలంతో పోలిస్తే మీరు తక్కువ ధర చెల్లిస్తారు.
వినియోగదారులు 8 సంవత్సరాల పాటు కారు లోన్ తీసుకున్నారు అనుకుందా.. కానీ మీరు 5 సంవత్సరాలకే కారును విక్రయించాలనుకున్నారు.. అప్పుడు మీరు మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించాలి లేదా మరొక వ్యక్తికి రుణాన్ని బదిలీ చేయాలి . దీని కోసం మీరు బ్యాంకుకు వెళ్లాల్సి రావచ్చు.
రుణం గురించి స్పష్టంగా..
మీరు రూ.8 లక్షల కారు తీసుకుని, దాని కోసం 5 లక్షల రుణం తీసుకున్నారనుకోండి, దీనికి మీరు వివిధ కాలాల కోసం రుణాలు తీసుకోవడానికి ఎంత వడ్డీ చెల్లించాలి? ఇది కారు ధరను ఎలా ప్రభావితం చేస్తుంది? స్పష్టంగా తెలుసుకుందా..
ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు
బ్యాంక్ | వడ్డీ రేటు | ఎంత రుణం పొందవచ్చు |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 7.30% | వాహనం ధరలో 85% వరకు |
ఇండస్సిండ్ బ్యాంక్ | 7.00% | వాహనం ధరలో 85% వరకు |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 7.25% | వాహనం ధరలో 85% వరకు |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 7.05% | వాహనం ధరలో 85% వరకు |
యాక్సిస్ బ్యాంక్ | 7.45% | వాహనం ధరలో 100% వరకు |
ఐసిఐసిఐ బ్యాంక్ | 7.50% | వాహనం ధరలో 100% వరకు |