ఐపిఒలో డిస్కౌంట్ చాన్స్ వారికే..
ఎల్ఐసి దేశంలో అతిపెద్ద బీమా సంస్థ, దీనికి కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. దేశంలో అతిపెద్ద ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)ను ఈ సంస్థ తీసుకొచ్చింది. దీని పరిమాణం రూ.21 వేల కోట్లు ఉంది. ఐపిఒ అంటే ప్రజలకు కంపెనీలో వాటాలకు అవకాశం ఇవ్వడం అన్నమాట. రూ.10 ముఖవిలువతో కూడిన 22 కోట్ల షేర్లతో ఎల్ఐసి మార్కెట్లోకి వచ్చింది. ఈ బీమా సంస్థలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంటే, దీనిలో తన 3.5 శాతం వాటాను విక్రయిస్తోంది. ప్రభుత్వం 10 శాతం వాటాలను పాలసీదారులకు అందిస్తోంది. కావున వీరంతా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకంటే అతిపెద్ద కంపెనీలో వాటాలను కొనుగోలు చేసి, వాటి నుంచి లాభాలను పొందే అవకాశం వీరికి దక్కుతుంది. అయితే ఈ వాటాల కోసం పాలసీదారులు రెండు పనులు చేసిపెట్టుకోవాలి. మొదట.. పాన్ కార్డును అనుసంధానం చేయడం. రెండోది.. డీమాట్ ఖాతా తెరవడం. ఈ రెండు పనులు తప్పనిసరిగా చేసుకోవాలి. దీని తర్వాత దరఖాస్తు చేసుకుంటే కొంత మేర డిస్కౌంట్ ధరకే వాటాలు పొందవచ్చు.
ఎవరు దరఖాస్తు చేయొచ్చు? ఎవరు చేయకూడదు?
- ప్రస్తుతం లేదా కొత్తగా ఎల్ఐసి పాలసీ తీసుకుంటే, వారు ఐపిఒకు అర్హత పొందుతారా.. అంటే అవకాశం లేదు
- పాలసీ ల్యాప్స్ అయినప్పటికీ సరెండ్ మాత్రం కాకూడదు. అలాంటి వారికే అర్హత ఉంటుంది.
- ఒకే కుటుంబంలో ఇద్దరికి, అంటే బార్యభర్తలకు ఎల్ఐసి పాలసీ ఉంటే గనుక వేర్వేరుగా డీమ్యాట్ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది.
- ప్రస్తుతం యాన్యుటీ పొందే పాలసీదారుడి జీవిత భాగస్వామికి ఎల్ఐసి ఐపిఒ కోసం బిడ్ వేవే అవకాశం ఉండదు.
- తప్పనిసరిగా డీమ్యాట్ ఖాతాను తెరవాలి, దీని ద్వారానే పాలసీదారుడు ఐపిఒ కోసం దాఖలు చేయాలి.
- పాలసీదారుడు కాకుండా, ఆయన లేదా ఆమె తన కుమారుడు లేదా కుమార్తె డీమ్యాట్ ఖాతా ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు.
- ఎల్ఐసి ఐపిఒలో ఎన్నారైలకు అవకాశం లేదు. కేవలం భారత్ లో నివసించే వారికే ఛాన్స్ ఇచ్చారు.
- గ్రూప్ పాలసీలకు అవకాశం లేదు, అయితే ఇతర ఏ పాలసీ అయినా దాఖలు చేసుకోవచ్చు.
- పాలసీ హోల్డర్లు కాకపోయినప్పటికీ రిటైల్ ఇన్వెస్టర్లు సాధారణ ఇష్యూల మాదిరిగానే.. ఈ ఎల్ఐసి ఐపిఒ కోసం దరఖాస్తు చేయవచ్చు.
- పాలసీతో పాన్‌ను లింక్ చేయడం అవసరం, ఐపిఒలో పాల్గొనడానికి, పాలసీదారుడు ఇచ్చిన పాన్ సమాచారం సరైనదా? కాదా? అని చెక్ చేసుకోవాలని LIC ప్రకటించింది. సరైంది కాకపోతే పాన్ ను అప్‌డేట్ చేయండి. IPOలో పెట్టుబడి పెట్టడానికి పాన్‌ను పాలసీతో లింక్ చేయడం తప్పనిసరి.

చెక్ చేసుకోవడం ఎలా ?
- పాన్ అప్ డేట్ అయ్యిందా, లేదా తెలుసుకోవడానికి ఈ కింద ఇచ్చిన లింక్ ను చూడండి.
- https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus ఈ లింక్ ద్వారా మీరు పాన్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు .
- పాలసీ నంబర్, పుట్టిన తేదీ, మీ పాన్ నంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత కింద క్యాప్చాను టైప్ చేసి సబ్ మిట్ బటన్ క్లిక్ చేయాలి.
- దీని తర్వాత పాన్ మీ పాలసీతో లింక్ అయిందా? లేదా? అనేది తెలుస్తుంది.
అప్‌డేట్ చేసుకోవడం ఎలా?
- పాన్ ను అప్ డేటా చేసుకునేందుకు ఈ కింద ఇచ్చిన లింక్ కు వెళ్లాలి. https://linkpan.licindia.in/UIDSeedingWebApp/ని
- ఇప్పుడు మీ ఇమెయిల్ ఐడి, పాన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, ఎల్ఐసి పాలసీ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత బాక్స్‌లో క్యాప్చా కోడ్ టైప్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఓటిపి(OTP) కోసం గెట్ ఒటిపి క్లిక్ చేయాలి.
- ఒటిపి పొందిన తర్వాత దానిని మళ్లీ టైప్ చేసి సబ్ మిట్ చేయాలి.
- ఫామ్‌ను సబ్ మిట్ చేసిన తర్వాత సక్సెస్ ఫుల్ రిజిస్ట్రేషన్ అనే మెసేజ్ వస్తుంది.
డీమ్యాట్ ఖాతాను ఎలా తీసుకోవాలి
ఇప్పుడు పాన్ అనుసంధానం తర్వాత రెండో పని డీమ్యాట్ ఖాతాను తెరవడం. ఇదంతా ఆన్ లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఐపిఐ ద్వారా వచ్చే వాటాలను అంటే షేర్లను కొనడానికి, అమ్మడానికి డీమ్యాట్ ఖాతా తెరవాలి. ఈ ఖాతాలు ఎన్ఎస్డిఎల్(NSDL), సిడిఎస్ఎల్(CDSL) వంటి డిపాజిటరీ సంస్థలు నిర్వహిస్తాయి. డీమ్యాట్ ఖాతాను తెరవడానికి ఆధార్, పాన్ నంబర్, అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలు కూడా ఉండాలి.
- నెలకు 50 వేలతో ₹1 కోటి చేరడమెలా..
- రూ.15 లక్షలు ఉండాల్సిందే.. సెబీ కొత్త నియమాలు
- ఫ్యూచర్స్ & ఆప్షన్స్‌కు కావాల్సిన మార్జిన్ ఇంతే..
- కవర్డ్ కాల్ స్ట్రాటజీతో ఎక్కువ డబ్బులు ఎలా వస్తాయో తెలుసా..
- ఫ్యూచర్స్ & ఆప్షన్స్ ట్రేడింగ్‌లో లక్షలు సంపాదించే వ్యూహాలివే..