అప్పుల ఊబిలో చిక్కుకున్నారా..

Spread the love

అయితే, మీరు ఆ భారం నుంచి బయటపడేందుకు ఈ పనులు చేయండి..

అవసరానికి అప్పు చేస్తాం.. అది తీరిస్తే ఒకే.. లేదంటే అది మనకు ఒక గుదిబండలా మారుతుంది. ఆ అప్పును వదిలించుకునేంత వరకు మనకదో పీడకలలా అలా ఉండిపోతుంది. రుణం చిన్నదైనా, పెద్దదైనా వదిలించుకుంటేనే మనకు ప్రశాంతత ఉంటుంది. అప్పుల నుంచి బయటపడటం కష్టమైందే. కొన్నిసార్లు అత్యవసర లేదా ఇతర కారణాల వల్ల మనం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత క్రెడిట్ కార్డు బిల్లు, కారు, గృహ రుణం నెలవారీ వాయిదా చెల్లించడం కష్టంగా మారుతుంది. మెల్లగా మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతాం. మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, అప్పుల బాధ నుండి బయటపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని మీరు పరిశీలించండి..

ఆస్తులను తనఖా పెట్టడం

ప్రతికూల సమయంలో కొత్త రుణం ద్వారా పాత రుణ ఉచ్చు నుండి బయటపడే మార్గంగా సరైంది అనిపించదు. అప్పటికే మీ సిబిల్ (CIBIL) స్కోరు పడిపోయి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఆస్తి ఎల్లప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఆస్తిని తనఖా పెట్టడం లేదా విక్రయించడం ద్వారా పెద్ద రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. మీరు షేర్లను కలిగి ఉంటే, మీరు ఈక్విటీ సహాయంతో కూడా రుణం నుండి బయటపడవచ్చు. అలాగే మీ సేవింగ్ టోటల్ అమౌంట్ రుణాన్ని చెల్లించేందుకు ఉపయోగించవచ్చు.

లోన్ టైమ్ ను పొడిగించుకోండి

రుణం నుంచి విముక్తి పొందడానికి మరొక మార్గం ఏమిటంటే మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి బ్యాంక్ ఉద్యోగులతో మాట్లాడండి. లోన్ తిరిగి చెల్లించడానికి అదనపు సమయం కోసం వారిని అడగండి. ఈ విధంగా మీరు ఇఎంఐ (EMI) ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీని నుండి మీరు ఎంత ఎక్కువ సమయాన్ని పొందుతారో, అంత ఎక్కువ మీరు సంపాదన ఎంపికలను కనుగొని, లోన్ ను తీర్చేందుకు ప్రయత్నిస్తారు.

గోల్డ్ లోన్

మూడో ఎంపిక ఏమిటంటే మీరు అప్పుల ఉచ్చులో చిక్కుకున్నట్లయితే, మీరు గోల్డ్ లోన్ ఎంపిక సరైంది అని చెప్పవచ్చు. ప్రతి ఇంట్లో బంగారం సాధారణంగా ఉంటుంది. మీరు బంగారు ఆభరణాలు, నాణేలు ఉంటే తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు. ఇది ఉత్తమమైన, వేగవంతమైన మార్గం. ఈ రకమైన రుణంపై వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది. ముత్తూట్, మణప్పురం వంటి కంపెనీలు గోల్డ్ పై తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తున్నాయి. అందువల్ల మీరు ఎక్కువ వడ్డీ రుణాలను కల్గివుంటే, గోల్డ్ లోన్ ద్వారా వాటిని వదిలించుకోండి.

ముందుగా అధిక వడ్డీ రుణాలను వదిలించుకోండి..

మీరు అప్పుల ఊబిలో చిక్కుకున్నట్లయితే లేదా చాలా అప్పులు ఉంటే, ముందు అధికంగా వడ్డీ కట్టాల్సి వస్తున్న లోన్ల నుండి బయటపడండి. మీ రుణం, బిల్లింగ్ వ్యూహాలను చాలా తెలివిగా ప్లాన్ చేసుకోండి. మీరు చెడ్డ అప్పుల జాబితాను తయారు చేసుకోండి. ఆపై మీరు ఏ రుణాన్ని చెల్లించాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. అదేవిధంగా అన్ని రుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ వ్యూహంలా భాగంగా ముందుగా అత్యంత ఎక్కువ వడ్డీ భారం కల్గిన రుణాన్ని చెల్లించాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డ్ చెల్లింపు వంటివి. ఎందుకంటే వీటికి సాధారణంగా వార్షికంగా 40 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.


Spread the love

Leave a Comment

error: Content is protected !!