13 నెలల వరకు చెల్లుబాటు, రోజుకు రూ.7 మాత్రమే..
ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా రిలయన్స్ జియో సంవత్సరం చివరిలో కస్టమర్ల కోసం ఒక గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అదే 2,999 వార్షిక ప్లాన్, జియో 24 రోజుల అదనపు వాలిడిటీని అందిస్తోంది. ఈ ఆఫర్ Jio న్యూ ఇయర్ ఆఫర్ కింద అందుబాటులో ఉంది. జియో ఆఫర్తో రోజువారీ ధర రూ.8.21 నుండి రూ.7.70కి తగ్గుతుంది.
జియో రూ. 2,999 ప్లాన్ వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్. జియో రూ. 2,999 ప్లాన్ 12 నెలలు అంటే 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ ఆఫర్ కింద 24 రోజుల అదనపు వాలిడిటీని కూడా జియో అందిస్తోంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే, జియో వినియోగదారులు 365 రోజులకు బదులుగా 389 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. అంటే మీ జియో సిమ్ దాదాపు 13 నెలల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.
ప్రయోజనాలు ఏమిటి?
Jio ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మీరు రోజుకు 2.5 GB డేటాను పొందుతారు. మీ ప్రాంతంలో Jio 5G సేవను కలిగి ఉంటే, ఈ ప్లాన్‌లో 5G సేవ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు సంవత్సరానికి మొత్తం 912.5GB డేటాను పొందుతారు. రోజువారీ ఇంటర్నెట్ డేటా అయిపోయిన తర్వాత, వేగం 64Kbpsకి తగ్గుతుంది.
ఇతర ప్రయోజనాలు?
ఇది అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS సేవలను అందిస్తుంది. JioCinema, JioTV మరియు JioCloud వంటి Jio యాప్‌లకు కంపెనీ ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. ఈ ప్రీమియం ప్లాన్‌లో JioCinema సబ్‌స్క్రిప్షన్ ఉండదు. దీనిని విడిగా కొనుగోలు చేయాలి.. ఈ ఆఫర్ 20 డిసెంబర్ 2023 నుండి ప్లాన్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ పథకం ప్రయోజనాలను ఎప్పుడు పొందవచ్చనే దాని గురించి వెబ్‌సైట్‌లో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.