డబ్బు రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుంది..? తెలుసుకోవచ్చా?

Spread the love

మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డి, పిపిఎఫ్.. ఇవి రెట్టింపు కావడానికి లెక్కించే సూత్రం ఏమిటి?

మనం డబ్బు త్వరగా రెట్టింపు కావాలని కోరుకుంటాం. ఏ పథకంలో పెట్టుబడి పెడితే డబ్బు త్వరగా రెట్టింపు అవుతుంది. అంటే ఇప్పుడు చాలా పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పోస్టాఫీస్ స్కీమ్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఎఫ్‌డి, పిపిఎఫ్‌ వంటివి ముఖ్యమైనవి. వీటిలో పెట్టుబడి పెడితే ఎంత సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందో తెలుసుకునేందుకు ఒక సూత్రం ఉంది. అదే రూల్ 72, రూల్ 114.. ఇది డబ్బు రెట్టింపు కావడానికి పట్టే సమయాన్ని చెబుతుంది. నిర్ణయించిన వడ్డీ ప్రకారం డబ్బు రెట్టింపు ఎలా అవుతుంది. రెట్టింపే కాదు మూడు రెట్లు పెరిగేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలా.. దానికి రూల్ 72, రూల్ 114తో లెక్కిస్తే తెలుస్తుంది. అదెలాగో తెలుసుకుందాం..

సూత్రం 72
మన ఇన్వెస్ట్ చేసే డబ్బు రెట్టింపు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ సూత్రం చెబుతుంది. ఈ ఫార్ములా చాలా సులభంగా ఉంటుంది. పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుసుకునేందుకు వడ్డీ రేటును 72 తో విభజించాలి.

అదెలాగో ఉదాహరణలతో తెలుసుకుందాం..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)ను తీసుకుంటే.. దీనిలో ఈ ప్లాన్ లో ఈనెలలో 100,000 పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం పిపిఎఫ్‌పై వడ్డీ రేటును 7.1 శాతంగా ప్రకటించింది. ఇప్పుడు మీరు రూ .1 లక్ష పెట్టుబడి పెడితే, ఇది రెట్టింపు.. అంటే రూ.2 లక్షలుగా మారడానికి 72ను వడ్డీ రేటు (7.1 శాతం)తో భాగిస్తే అది 72/7.1 కి గాను 10.14 వస్తుంది. అంటే వడ్డీ రేటు 7.1 శాతం ఉంటే మీ డబ్బు 10.14 సంవత్సరాలలో రెట్టింపు అవుతుందన్న మాట.

మూడు రెట్లకు ఎంత సమయం
రెట్టింపు కావడానికి ఎలాగో తెలుసుకున్నాం. ఇప్పుడు మీ డబ్బును మూడింతలు చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. దానికి 114 సూత్రాన్ని వినియోగించాలి. ఇది 72 సూత్రం మాదిరిగానే ఉంటుంది. మీ డబ్బు పెట్టుబడి పెడితే మూడు రెట్లు అయ్యేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకునేందుకు 114ను వడ్డీ రేటుతో భాగించాలి. అంటే 114/ వడ్డీ రేటు అన్నమాట. పై ఉదాహరణ ప్రకారం, పిపిఎఫ్ ఖాతాలో రూ.100,000 పెట్టుబడి పెడితే 7.1 శాతం వడ్డీ రేటుతో రూ .300,000 కావడానికి 16.05 సంవత్సరాలు పడుతుందన్న మాట.

ఈ సూత్రం వార్షిక రాబడికి మాత్రమే
72 సూత్రం వార్షిక రాబడిని మాత్రమే సూచిస్తుందనే విషయం గమనించాలి. వార్షిక రాబడిని లెక్కించే అన్ని రకాల ప్లాన్లను ఇది వర్తించవచ్చు. అయితే త్రైమాసిక లేదా అర్ధ వార్షిక రాబడిని లెక్కించేందుకు మాత్రం ఇది ఉపయోగపడదు.

మీ డబ్బు రెట్టింపు కావడానికి 10 మార్గాలేమిటో చూద్దాం

రిస్క్ తీసుకునేవారికీ  ఈ మార్గాలు ఉపయోగపడతాయ్..

  స్టాక్ మార్కెట్
 స్టాక్ మార్కెట్ పెట్టుబడి మీ డబ్బును త్వరగా రెట్టింపు చేస్తుంది. కానీ నష్టభయం కూడా ఉంటుంది.  మీరు పెట్టుబడి కోసం సరైన స్టాక్స్ ఎంచుకోవాలి. ఎంట్రీ, ఎగ్జిట్ గురించి తెలిసి ఉండాలి.

 చిన్న వ్యాపారం
 చిన్న లాభదాయకమైన వ్యాపారం చేస్తే కూడా డబ్బు రెట్టింపు అవుతుంది. ఉదా.. గిఫ్ట్ వస్తువులు, స్వంతంగా ప్లేట్స్ తయారీ వంటివి. ఇది మీరు చేసే కృషిని బట్టి ఉంటుంది. అయితే నష్టం వచ్చే అవకాశమూ లేకపోలేదు.

వడ్డీలకు డబ్బు ఇవ్వడం
 మీ డబ్బు రెట్టింపు కావాలంటే ఇది అందరికి తెలిసిన మార్గం. డబ్బు ఉన్నట్లయితే వడ్డీకి ఇతరులకు ఇవ్వడం. దీని వల్ల కూడా మీ డబ్బు వేగంగా రెట్టింపు అవుతుంది. కానీ నమ్మకస్తులకే ఇవ్వాలి సుమా..

 బంగారం & గోల్డ్ ఇటిఎఫ్
బంగారం ప్రతి 3 సంవత్సరాలకు మీ డబ్బు రెట్టింపు చేసే మంచి పెట్టుబడి ఎంపిక. 2007 నుండి 2012 వరకు బంగారం 22-24% రాబడిని ఇచ్చింది. 2020లో 35 వేలు ఉన్న పసిడి 2021 నాటికి 50 వేలకు వచ్చింది.

 రియల్ ఎస్టేట్
 రియల్ ఎస్టేట్ సుమారు 5 సంవత్సరాల లో మీ డబ్బును రెట్టింపు చేస్తుంది. ఇది మరొక మంచి పెట్టుబడి ఎంపిక. అయితే సరైన ప్రాంతం, సమస్యలు లేకుండా జాగ్రత్తపడాలి.

 మ్యూచువల్ ఫండ్
ముచువల్ ఫండ్స్ ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. వీటిలో పెట్టుబడులు మీ డబ్బును రెట్టింపు చేస్తాయి. ఇవి సురక్షితమైన మార్గంగా చెప్పవచ్చు. మంచి మ్యూచువల్ ఫండ్ 10-12% రాబడిని ఇస్తుంది. దీనిలో రెట్టింపు కావాలంటే  6-7 ఏళ్ల సమయం పట్టవచ్చు.

  కంపెనీ ఫిక్స్ డ్ డిపాజిట్
 కంపెనీ ఫిక్సిడ్ డిపాజిట్ 11-12.5% రాబడిని ఇస్తుంది. 6-7 సంవత్సరాలలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది.

 మీ డబ్బు రెట్టింపు అయ్యేందుకు పైన ఇచ్చిన మార్గాలను పరిశీలించండి. నిర్ణయాలు తీసుకోవడానికి ముందు వ్యక్తిగత సలహాదారులను సంప్రదించడం మరవకండి. 


Spread the love

11 thoughts on “డబ్బు రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుంది..? తెలుసుకోవచ్చా?”

 1. Hi there to every one, for the reason that I am genuinely
  keen of reading this web site’s post to be updated on a regular basis.
  It includes nice data.

  Reply
 2. Nice post. I was checking continuously this blog and I’m impressed!
  Extremely helpful info particularly the last part 🙂 I care for such
  information a lot. I was looking for this particular information for a very long
  time. Thank you and best of luck.

  Reply

Leave a Comment

error: Content is protected !!