వెంటనే బ్యాంక్ కు వెళ్లి కొత్త నంబర్ ను లింక్ చేయండి లేకపోతే…
బ్యాంక్ ఖాతాతో లింక్ అయిన మొబైల్ నంబర్ ఇప్పుడు లేదా, లేక ఫోన్ మార్చారా? జాగ్రత్త, ఎందుకంటే వెంటనే మీరు మార్చుకున్న కొత్త నంబర్ ను బ్యాంకుకు వెళ్లి లింక్ చేయమని చెప్పండి. లేకపోతే మోసం బారిన పడే అవకాశం ఉంది. మీరు మీ మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో లేదా ఎటిఎం ద్వారా కూడా మార్చుకోవచ్చు. దాని గురించి కూడా తెలుసుకుందాం.. అయితే బ్యాంకుకు లింక్ అయిన వున్న మొబైల్ నంబర్ ఇప్పుడు లేకుంటే గనుక వీలైనంత త్వరగా దాన్ని తీసివేసి, కొత్త నంబర్‌ను లింక్ చేసుకోండి. ఎందుకంటే మూడు నెలల తర్వాత క్లోజ్డ్ చేసిన నంబర్ ను మరొకరికి కేటాయిస్తారు. ఇది మోసానికి అవకాశమిస్తుంది.
ఖాతాతో ప్రస్తుత నంబర్ లేకపోతే మోసానికి అవకాశం
ప్రస్తుతం నకిలీ మొబైల్ నంబర్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయి. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సైబర్ నేరగాళ్లు మీ మొత్తం ఖాతాను ఖాళీ చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో మీరు ఖాతా తెరిచే సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ క్లోజ్ చేస్తే లేదా వినియోగించకపోతే, మీ ప్రస్తుత మొబైల్ నంబర్‌ను వెంటనే బ్యాంక్‌లో నమోదు చేసుకోవాలి. దీంతో మీ ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరిగినా, మీకు మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దీని వల్ల మోసాల నుంచి బయటపడతారు.
మార్చాలంటే ఎలా?
బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను మార్చడానికి మీ డెబిట్ కార్డ్, ముందుగా నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ అవసరమవుతాయి. మీరు మీ మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో లేదా ఎటిఎం ద్వారా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందా..
ఇంటి వద్ద ఆన్లైన్లో మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు
మీ బ్యాంకు ఖాతాకు నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉందా.. అయితే మీ మొబైల్ లేదా కంప్యూటర్ సహాయంతో ఇంట్లో కూర్చొని బ్యాంకు ఖాతా మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. ఎస్ బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)ని ఉదాహరణగా తీసుకుందాం.
ముందుగా మీరు బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ www.onlinesbi.comని లాగిన్ కావాలి.
లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి.
ఆపై వ్యక్తిగత వివరాలపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
దీన్ని సబ్మిట్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ని మార్చుకునే ఆప్షన్‌తో మీ ఇమెయిల్ ఐడి, పాత నంబర్ మీకు కనిపిస్తాయి. ఈ సూచనను అనుసరించి, మీ మొబైల్ నంబర్‌ను మార్చుకోవాలి.
బ్యాంకుకు వెళ్లి కూడా మార్చుకోవచ్చు
మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేకపోతే, మీరు బ్యాంకుకు వెళ్లి మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. మీరు మీ బ్యాంక్ బ్రాంచ్ ను సందర్శించి, అక్కడ మొబైల్ నంబర్ మార్పు ఫామ్‌ను నింపి వారికి ఇవ్వాలి. దీంతో పాటు మీ పాస్‌బుక్, ఆధార్ కార్డు ఫోటోకాపీలను వారికివ్వాలి. దీని తర్వాత బ్యాంకు మీ మొబైల్‌ని మారుస్తుంది.
ఎటిఎంలో ఎలా మార్చుకోవాలి
ఎటిఎం నుండి కూడా మీ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. అయితే దీనికి మీరు ఇప్పటికే బ్యాంకులో నమోదు చేసుకున్న పాత నంబర్‌ను కలిగి ఉండాలి. పాత నంబర్ సరిగ్గా లేకుంటే, మీరు దాని ద్వారా మీ నంబర్‌ను మార్చలేరు.
ఎటిఎం ద్వారా నంబర్‌ను మార్చడానికి మీరు ముందుగా మీ పిన్ ని నమోదు చేయాలి.
ఆ తర్వాత, మొబైల్ నంబర్ మార్పు ఎంపికను ఎంచుకోవాలి. దీని తర్వాత మీరు ఎటిఎంలో నమోదు చేయవలసిన మీ రిజిస్టర్డ్ నంబర్‌కు ఒటిపి(OTP) వస్తుంది.
దీని తర్వాత మీరు కొత్త నంబర్ కోసం రిక్వెస్ చేస్తే, అది ధృవీకరించబడుతుంది.
ఈ విధంగా ఎటిఎం ద్వారా మీ మొబైల్ నంబర్ మార్చబడుతుంది.