ఈ టైర్ కంపెనీ అద్బుతమైన రాబడిని ఇచ్చింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారు మంచి లాభాలను పొందారు. అదే టైర్ల తయారీ సంస్థ సియట్(CEAT), ఈ కంపెనీ షేరు ఇన్వెస్టర్లకు షాకింగ్ రిటర్న్స్ ఇచ్చింది. సియట్ షేరు ధర 20 శాతం పెరిగి రూ.1600 స్థాయిని దాటింది. ఇది 52 వీక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన చూపింది. గతేడాది(2020) మే నెలలో ఈ షేరు రూ.700 వద్ద ఉంది. అంటే రెట్టింపు అయింది. 2022 సెప్టెంబర్ 14 రూ.1386 వద్ద ఉన్న షేరు కేవలం వారం రోజుల్లోనే రూ.300 పెరిగి, ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలను ఇచ్చింది. గత 3 నెలల్లో ఈ షేరు 75 శాతానికి పైగా లాభపడింది. అదే సమయంలో గత నెలలో దాదాపు 23 శాతం పెరుగుదల ఉంది. సియట్ మార్కెట్ క్యాపిటల్ గురించి మాట్లాడితే రూ.6,718.76 కోట్లుగా ఉంది.
పెరుగుదలకు కారణాలేమిటి
ఉత్పత్తులకు డిమాండ్, ముడిసరుకు ధరలను తగ్గడం, సామర్థ్య విస్తరణ వంటి అనేక సానుకూల అంశాలు CEAT స్టాక్ పెరుగుదలకు దారితీశాయి. వచ్చే ఐదేళ్లలో EBITDA మార్జిన్ గ్యాప్‌ను తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో వచ్చే నెలలో ధరలను 1-1.5 శాతం పెంచాలని కంపెనీ యోచిస్తోంది. CEAT శ్రీలంక కార్యకలాపాలు లాభదాయకంగా ఉన్నాయి కానీ వాల్యూమ్‌లు తక్కువగా ఉన్నాయి.
గమనిక…. ఇది పెట్టుబడి సలహా కాదు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, నిపుణులను సంప్రదించండి. తెలుగు పైసా పెట్టుబడి కోసం మీకు ఎలాంటి సలహా ఇవ్వదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలకు లోబడి ఉంటుంది, దయచేసి పెట్టుబడి పెట్టే ముందు మీ సలహాదారుని సంప్రదించండి.