మనింట్లోనే ఉంటూ పొందవచ్చు.. ఇది ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.. ఆన్ లైన్ లో యాప్ లతో కస్టమర్లు ఈ ప్రయోజనం పొందవచ్చు
ఈ రోజుల్లో బయటికి వెళ్లకుండానే అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న సాంకేతిక అలాంటిది మరి. దేశంలోని అనేక ప్రముఖ ఆసుపత్రులు, కంపెనీలు ఆన్లైన్ ద్వారా కూడా వైద్య సేవలను అందిస్తున్నాయి. వీటికి యాప్, వెబ్ సైట్ లు పెద్ద ప్లాట్ ఫామ్ గా మారాయి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ సర్వసాధారణం అయిపోయిన ఈ రోజుల్లో కంపెనీలు, ఆసుపత్రులు టెక్నాలజీని తమకు అనుకూలంగా మలుచుకుని, యాప్ ల ద్వారా వేగవంతమైన సేవలను అందిస్తున్నాయి. అయితే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కూడా ఇటీవల కస్టమర్ల కోసం ఆన్‌లైన్ మెడిసిన్ కొనుగోలు, ఇ-కన్సల్టేషన్ అవసరమైన వారికి ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించి, ఇటువంటి ప్లాట్ ఫామ్లను ప్రోత్సహిస్తోంగి. ఫార్మ్ ఈజీ, డా. లాల్ పాత్‌లాబ్స్, అపోలో, టాటా 1ఎంజి వంటి సంస్థలు ఇ-ఫార్మసీ ద్వారా ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేయడం, కన్సల్టింగ్ సేవలను భారీ తగ్గింపు ధరతో అందిస్తున్నాయి.
ఇ-కన్సల్టేషన్ కోసం కస్టమర్‌లు ప్రత్యేక తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే అనేక యాప్ లు ఉన్నాయి. మీరు ఈ పనిని ఎస్బిఐ(SBI) క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చేయవచ్చు. కస్టమర్లు మీ జేబుకు భారం పడకుండా, ఆరోగ్యం రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవచ్చు అని ఈ కంపెనీలు ఇ-మెడిసిన్ ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటి ద్వారా తమతమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. మీరు ఆన్‌లైన్ కన్సల్టేషన్, మెడిసిన్ కొనుగోలు చేయడానికి ఎస్బిఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఆఫర్‌లను ఉపయోగించుకోవచ్చు. దీనిపై మీకు ఎస్బిఐ కార్డు ద్వారా భారీ తగ్గింపు లభిస్తుంది.
ఈ ఇ-మెడికల్ యాప్‌పై తగ్గింపు ప్రయోజనాలు
ఆన్‌లైన్ ఔషధ కొనుగోలు, ఇ-కన్సల్టేషన్‌పై అపోలో(Apollo 24|7) ద్వారా 18% తగ్గింపును పొందుతారు. click here.. https://www.apollo247.com/
ఫార్మ్ ఈజీ(pharmeasy)లో మందులు కొనుగోలు చేస్తే మీకు 25% తగ్గింపు లభిస్తుంది. click here.. https://pharmeasy.in/
డాక్టర్ లాల్ పాత్‌లాబ్స్(lalpathlabs)లో పరీక్ష చేయించుకుంటే 15% తగ్గింపు ఉంటుంది. click here.. https://www.lalpathlabs.com/
ఇండస్ హెల్త్ (indushealthplus) 13 శాతం తగ్గింపును అందిస్తోంది. click here.. https://www.indushealthplus.com/
మీరు టాటా 1ఎంజి(Tata 1mg) యాప్‌లో మెడిసిన్ కొనుగోలుపై 25% వరకు తగ్గింపు పొందవచ్చు. click here.. https://www.1mg.com/online-doctor-consultation