రూ.5 లక్షల పెట్టుబడితో వ్యాపారాలు

Spread the love

వీటితో మీరు మంచి ఆదాయం పొందవచ్చు

నేడు ఏ వ్యాపారమైనా డబ్బు అవసరం. చిన్న బిజినెస్ చేయాలన్నా ఈ రోజుల్లో తక్కువ ఖర్చు కావడం లేదు. రూ.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో వ్యాపారం కొంత వరకు సులభమైన మార్గం. అయితే వ్యాపార ఆలోచన అత్యంత ముఖ్యమైనది. చాలా మందికి విభిన్న ఆలోచనలు ఉంటాయి, కానీ తగినంతగా అవసరమైన డబ్బు ఉండదు. లాభదాయకమైన సంస్థను ప్రారంభించడంలో వారి వైఫల్యానికి ఇది ప్రధాన కారణం అవుతుంది. రూ.5 లక్షల లోపు పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీకు ఈ ఆర్టికల్ బాగా ఉపయోగపుడుతుందని అనుకుంటాను.రూ. 5 లక్షల లోపు అనేక విజయవంతమైన వ్యాపార ఆలోచనలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

ఆన్‌లైన్ లో సేల్స్

ఇప్పుడు మొబైల్ అందరికి నిత్యావసరం అయింది. మీరు మొబైల్ ఫోన్ ఉపకరణాలు వంటి వాటిని అందించే వ్యాపారాన్ని ఎంచుకోండి. అంటే స్క్రీన్ ప్రొటెక్టర్‌లు, చార్జర్‌లు, కవర్‌లు, బ్లూటూత్ కేబుల్‌లు వంటివి అన్నమాట. వీటి గురించి ఒక వెబ్ సైట్లో వివరాలను ఇవ్వండి. దీనికి గాను మీ వ్యాపారాన్ని నమోదు చేసుకొని, జిఎస్టి నంబర్‌ను పొందండి. అమెజాన్ స్టోర్‌ను ఏర్పాటు చేసుకోండి. చాలా మంది వినియోగదారులకు విక్రయించడానికి అమెజాన్ మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్‌లు, ఆటోమొబైల్స్, ఆభరణాలను కూడా అమ్మవచ్చు. ఈ రోజుల్లో ఆన్‌లైన్ మార్కెటింగ్ అనేది ఒక ప్రముఖ వ్యాపార వేదిక, దీనిలో అన్నింటిని నిల్వ చేసుకోవచ్చు. వస్తువులు తక్కువ రేటుతో, నాణ్యతతో ఉంటే ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఫలితంగా చాలా డబ్బు వస్తుంది. తక్కువ మూలధన పెట్టుబడితో రూ.5 లక్షల పెట్టుబడి వ్యాపారం లాభదాయకత ఎక్కువగా ఉంటుంది. మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మీ ఆన్‌లైన్ స్టోర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి వ్యాపారం రిజిస్టర్ చేసుకునేందుకు రూ.35 వేల ఖర్చు అవుతుంది. వ్యాపారం ప్రారంభించేందుకు రూ.1 లక్ష పెట్టుబడి అవసరమవుతుంది. ఇంకా ఇ కామర్స్ స్టోర్ ఏర్పాటు చేసేందుకు రూ.2 లక్షలు పెటుబడి కావాలి.

ప్రింటింగ్ వ్యాపారం

ప్రింటింగ్ వ్యాపారానికి కూడా ఈ రోజుల్లో డిమాండ్ ఉండడమే కాదు, లాభదాయకంగానూ ఉంటుంది. ప్రతిరోజూ ప్రింటింగ్ కార్డులు, పత్రికలు, ఇతర వస్తువుల అవసరం ఉన్నందున ఈ వ్యాపారం బాగుంటుంది. ప్రింటింగ్‌తో పాటు ఫ్లెక్స్ ప్రింటింగ్, జిరాక్స్ వంటి వాటికి కూడా డిమాండ్ ఉంది. దీనిలో మీ పెట్టుబడికి అద్భుతమైన రాబడిని అందుకుంటారు. ఇన్విటేషన్ కార్డుల నుండి బిజినెస్ కార్డుల వరకు అన్నీ ప్రింట్ చేయవచ్చు. వీటితో మంచి బిజినెస్ వచ్చిందంటే చాలా డబ్బు సంపాదించవచ్చు. రూ.5 లక్షలలోపు ఈ చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీకు చిన్న దుకాణం అవసరం. మీ పరిసరాల్లోని దుకాణాన్ని నెలకు ₹10,000 కంటే తక్కువ ధరకు అద్దెకు తీసుకొని ప్రారంభించవచ్చు.

బట్టల వ్యాపారం

ఈ రోజుల్లో దుస్తులు మనిషికి తప్పనిసరి. బట్టల విక్రయదారులకు డిమాండ్ బాగుంది. బట్టల మెటీరియల్స్ నుండి రెడీ టు వేర్ దుస్తుల వరకు అన్నీ వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్నవే. దుస్తుల వ్యాపారాన్ని నిర్వహించడం కష్టమైన పనేం కాదు, మీరు ఈ వ్యాపారాన్ని ₹ 5 లక్షల కంటే తక్కువ పెట్టుబడితో చేయవచ్చు. మీరు కొంత పెట్టుబడితో దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, మార్కెట్ ట్రెండ్‌లకు అనుగుణంగా వస్త్రాలను అందుబాటులో ఉండేలా చూడాలి. మీ వ్యాపారం పురుషులు, మహిళలు, పిల్లలు వీరందరికీ దుస్తులను విక్రయించేలా సరుకు ఉండాలి. ఇలా చేస్తే అది మరింత లాభదాయకంగా ఉంటుంది.

కేక్ డిజైనింగ్ కోర్సు

బర్త్ డే, ఈవెంట్ లకు కేక్ లు తప్పనిసరి, అంతేకాదు వీటికి డిమాండ్ ఎక్కువగానే ఉంది. కేక్ డిజైనింగ్ కూడా ఒక కళే.. దీనికి కూడా బోధన చేసేవారు ఉన్నారు. ఆకర్షణీయమైన కేక్‌లను ఎలా తయారు చేయాలో నేర్పేవారున్నారు. కేక్‌ను గొప్పగా మార్చడం అనేది ఇప్పుడు ఒక సృజనాత్మకతో కూడినది. ఇది ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైన వ్యాపార ఆలోచనగా చెప్పవచ్చు. మీరు ఐసింగ్‌తో ఆకృతిని ఎలా సృష్టించాలో, ప్రాథమిక కేక్ డిజైన్ పద్ధతులు, ఈ తరగతులలో ఫాండెంట్‌తో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటారు. కేక్ తయారీకి సమయం పడుతుంది. పుట్టినరోజులు లేదా ఇతర సందర్భాలలో ప్రత్యేకతతో కూడిన కేక్‌లను తయారు చేయడానికి వ్యక్తులు తమ ప్రతిభకు పదును పెట్టాల్సి ఉంటుంది. ప్రారంభించిన తర్వాత ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు స్థానిక ఆరోగ్య ప్రమాణాల ప్రకారం, మీ కుకింగ్ రూమ్ ను శుభ్రంగా ఉంచుకోవడం, అవసరమైన భద్రతా జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.

వివాహ సామగ్రి అద్దె

పెళ్లిళ్లు, ఈవెంట్ లు నిర్వహించేందుకు చాలా డబ్బు అవసరం, దీనిని వ్యాపారంగా మలుచుకుని సంపాదించే అవకాశం ఉంది. మీకు అన్ని వివాహ సామగ్రిని సమకూర్చుకుని పార్టీలకు అద్దెకు ఇవ్వవచ్చు. వివాహ సామగ్రిలో సాధారణంగా కుర్చీలు, బల్లలు, అలంకరణ దీపాలు, లైటింగ్, అలంకరణ కోసం ఫాబ్రిక్, వెదురు, తీగలు, ఇతర వస్తువులు అవసరమవుతాయి. ఇటువంటి పరికరాలను తక్కువ ఖర్చుతో రవాణా చేసి, అధిక ధరకు వినియోగదారులకు అద్దెకు ఇవ్వవచ్చు. ఈ వస్తువులు మళ్లీ మళ్లీ వినియోగించేవి కావున వాటి నుంచి వచ్చే అద్దెతో లాభాలను పొందవచ్చు. దీనికి రూ.5 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. ఈ వ్యాపారంపై గణనీయమైన రాబడిని పొందవచ్చు.

డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్ల తయారీ

వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, వ్యాపార కార్యక్రమాలు వంటి వాటికి డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్లు అవసరమవుతాయి. అందుకే ఈ వ్యాపారం లాభదాయకమైనదని నిరూపించబడింది. దీనికి కావాల్సిన ముడిసరుకు కొనడానికి, యంత్రాలు ఏర్పాటు చేయడానికి, ఉద్యోగులను నియమించుకోవడానికి కొంత డబ్బు అవసరమవుతుంది. అయితే దీంతో గణనీయమైన లాభం పొందే అవకాశం ఉంది. ఇది వినియోగదారుని లభ్యత,యు ఉత్పత్తి నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఈ పేపర్, ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్‌లకు చాలా డిమాండ్ ఉంది. మీరు ఒక యంత్రంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీనికి రూ.3 లక్షల ప్రారంభ పెట్టుబడి అవసరమవుతుంది.

కిరాణ కొట్టు

చిన్న కిరాణా కొట్టు సమీపంలో ఉండే కుటుంబాలకు అవసరాలను తీర్చుతుంది. అనేక రకాల వస్తువుల కోసం  అంటే వార్తాపత్రికల నుండి నిత్యావసరాలు, ఆహారం వస్తువులు మొదలైనవి కిరాణ షాప్ లో పొందవచ్చు. అందువల్ల ఎన్ని సూపర్ మార్కెట్ లు వచ్చినా ఈ కిరాణా దుకాణాలకు ఆదరణ తగ్గలేదు. కిరాణా షాప్ నిర్వహించడం చాలా ఖరీదైనది, కానీ ఇది మంచి ఆర్థిక రాబడిని ఇస్తుంది. ఇది దీర్ఘకాలిక నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడానికి డిస్కౌంట్‌లను అందించవచ్చు. దీనికి ₹50,000 నుండి ₹2 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది.

రెస్టారెంట్ తెరవడం

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెస్టారెంట్ కు మించి బిజినెస్ లేదు. కానీ దీనికి సరైన ప్రదేశం అవసరం. దేశంలో రూ.5 లక్షలకు రెస్టారెంట్ ప్రారంభించవచ్చు. ఇది వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా తగిన వంటకాల ఎంపికతో మీ రెస్టారెంట్ ఉండాలి. కస్టమర్ల ప్రాధాన్యతలను తీర్చాలి. మీ ఆర్థిక వనరుల ఆధారంగా మీరు రెస్టారెంట్ ను ప్రారంభించవచ్చు. లేదా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి పాత రెస్టారెంట్‌ను కొనుగోలు చేసి డిజైన్ చేయవచ్చు. మీరు ప్రారంభ పెట్టుబడిని, ఖాతాదారులను సంపాదించిన తర్వాత మీ సంస్థను పెంచుకోవచ్చు. కస్టమర్లు ఆహారానికి ఆకర్షితులైతే మంచి లాభాలను పొందవచ్చు. 

టిఫిన్ సర్వీస్ వ్యాపారం

ప్రతి రోజు ఉదయమే కాకుండా, ఇతర వేళల్లోనూ ఇడ్లీ, దోష, ఉప్మా వంటి వాటిని తినేవారు ఉంటారు. చాలా మంది వ్యక్తులు, ఉద్యోగం, విద్యను అభ్యసించే వారు సమయానికి వంట చేసుకునే వీలు ఉండదని, బయట టిఫిన్లు చేస్తారు. రుచికరమైన వంటకాలను వారికి అందించడం ద్వారా ఆదాయం పొందవచ్చు. టిఫిన్ సర్వీస్ బిజినెస్ కాన్సెప్ట్ సులభమైంది, విజయవంతమైనది. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని కోరుకునే నేటి ప్రపంచంలో ఈ వ్యాపారంతో తప్పకుండా సక్సెస్ పొందుతారు. రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ఇష్టపడితే రూ. 5 లక్షలతో టిఫిన్ సర్వీస్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.


Spread the love

Leave a Comment

error: Content is protected !!