వాట్సాప్ వినియోగదారులు జాగ్రత్త!

Spread the love

ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు చాలా బాధపడవచ్చు. మీరు వాట్సాప్ యూజర్ అయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాట్సాప్‌లో ఏదో ఒక రకమైన స్కామ్ జరుగుతోంది, దీనిలో మీరు వీడియోలను పంపితే గనుక డబ్బు లక్షల్లో నష్టపోతారు.

ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజా కేసును చూస్తే.. సూరత్ లో 32 ఏళ్ల వజ్రాల వ్యాపారి ఇలాంటి మోసం బారిన జేబులు గుల్ల చేసుకున్నాడు. విషయం ఏంటంటే, వజ్రాల వ్యాపారికి తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి రూ.6 లక్షలు ఇవ్వమని అడిగాడు. వ్యాపారి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో బ్లాక్ మెయిల్ మొదలైంది.

ఘటన ఇలా ఉంటే.. దీనికి ముందుగా పూజా శర్మ అనే అమ్మాయి నుంచి ఫేస్‌బుక్‌లో ఆ వ్యాపారవేత్తకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. వజ్రాల వ్యాపారి రిక్వెస్ట్ ను అంగీకరించిన తర్వాత రెండింటి మధ్య సన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత, ఒకానొక సమయంలో వాట్సాప్ వీడియో కాల్‌లో ఆ అమ్మాయి వజ్రాల వ్యాపారిని నగ్నంగా ఉండమని కోరింది. ఆపై వీడియో రికార్డ్ చేసి డబ్బు వసూలు దందా స్టార్ట్ చేసింది. ఇలాంటిది మొదటిసారి కాదు, ఇంతకు ముందు చాలా కేసులు ఉన్నాయని తెలుసుకోండి. ఈ పరిస్థితిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం గుర్తుంచుకోండి .


Spread the love

Leave a Comment

error: Content is protected !!