అకస్మాత్తుగా డబ్బు అవసరమైందా.. వీటిని పరిశీలించండి
మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే ఏం చేస్తారు.. ఎవరినైనా డబ్బు అడగడం ద్వారా అవసరాన్ని తీర్చుకోవచ్చు. కానీ ద్రవ్యోల్బణం ప్రతి ఒక్కరినీ తాకుతున్న ఈ రోజుల్లో ఎవరూ మీకు అప్పు ఇవ్వలేరు. అందువల్ల మీకు లోన్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఒక బ్యాంకు మీకు రుణం ఇస్తే, దానిపై మీరు ఏమి తనఖా పెడతారు? రుణం తీసుకోవడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. అటువంటి 5 ఎంపికల గురించి తెలుసుకుందాం. వీటితో సులభంగా రుణం పొందవచ్చు.
ఆస్తిపై లోన్
మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే గనుక మీ ఇల్లు మీకు రుణం పొందడంలో సహాయకరంగా ఉంటుంది. మీ ఇంటి విలువలో చాలా వరకు అంటే 70 శాతం రుణం పొందవచ్చు. రెండు సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు మీ బ్యాంక్‌తో మాట్లాడి ఈ లోన్‌ని తీసుకోవచ్చు. రెసిడెన్షియల్ ప్రాపర్టీపై తీసుకున్న రుణంపై ఎక్కువ శాతంలో వడ్డీని చెల్లించాలి.
షేర్లపై రుణం
స్టాక్ మార్కెట్‌లో షేర్లు కూడా మనకు రుణం పొందేందుకు ఉపయోగుడతాయి. అవసరాన్ని తీర్చడానికి నష్టానికి మీ షేర్లను అమ్మాల్సిన అవసరం లేదు. షేర్లపై రుణం తీసుకునే సౌకర్యం ఉంది. దీనిపై వసూలు చేసే వడ్డీ భారీగా ఉంటుంది. అయితే, ఈ లోన్ కాలవ్యవధిని పూర్తిగా బ్యాంకు నిర్ణయిస్తుంది. సాధారణంగా, మీరు దాని విలువలో సగం వరకు షేర్లపై రుణం పొందడానికి వీలుంటుంది.
బంగారంపై రుణం
నేటి కాలంలో గోల్డ్ లోన్ కొత్త విషయం కానప్పటికీ, చాలా మంది ఇప్పటికీ గోల్డ్ లోన్‌ను పట్టించుకోరు. ఇంటిలో ఉండే నగలు, గోల్డ్ తో బ్యాంకు నుండి రుణం తీసుకోవచ్చు. అన్ని గోల్డ్ లోన్ కంపెనీలు మంచి రేటుకు రుణం ఇస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, బంగారంపై మీరు గరిష్టంగా 75 శాతం విలువలో రుణాన్ని పొందవచ్చు.
ఎఫ్డీపై లోన్
చాలా మంది వ్యక్తులు తమకు డబ్బు అవసరమైనప్పుడు వారి ఎఫ్డీని ఉపసంహరించుకోవాలని చూస్తారు. మీరు ఎఫ్డీని విత్ డ్రా చేస్తే, దానికి గాను కొంత ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు సంవత్సరాలుగా దాచుకున్న నిధిని విత్ డ్రాతో ముగింపు పలికినట్టవుతుంది. ఈ పరిస్థితిలో మీకు కావాలంటే ఎఫ్డీపై కూడా లోన్ తీసుకునే సౌకర్యం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
బీమా పాలసీపై రుణం
బీమా పాలసీ మీ జీవితాన్ని రక్షించడమే కాదు, అవసరమైనప్పుడు బీమా పాలసీపై రుణం ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. బీమా సరెండర్ విలువలో 90 శాతం వరకు రుణం పొందడానికి చాన్స్ ఉంది. దీనిపై 10 శాతం వడ్డీ చెల్లించాలి. మీకు డబ్బు అవసరమైతే మీ బీమా పాలసీని ఉపయోగించుకోండి.