మ్యూచువల్ ఫండ్ కట్టేవారు, లేదా సిప్ విదానం కొనసాగించేవారు క్లిష్ట పరిస్థితులు లేదా రుణం అవసరం ఉంటే ఏం చేస్తారు. ఈ ఫండ్ ను ఆపేద్దాం అని అనుకుంటారు. దాని ద్వారా డబ్బును సమకూర్చుకోవాలని భావిస్తారు. కానీ మనకు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ద్వారా రుణం పొందవచ్చని, ఫండ్ కు ఎలాంటి నిలుపుదల లేకుండా చేసుకోవచ్చని తెలుసా, అంటే తెలియని వారు ఉన్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నుండి డబ్బును ఉపసంహరించుకునే బదులు లేదా సిప్ (సిస్టమెటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్) ఆపాలని నిర్ణయించుకునే బదులు మ్యూచువల్ ఫండ్ యూనిట్ నుండి రుణం తీసుకోవడం అనేది ఉత్తమైన విషయం.
కొందరి స్వల్పకాలిక అవసరాలు ఉంటాయి. మూడు నెలల లేదా ఆరు నెలల రుణం అవసరం ఉంటే కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నుండి మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటారు. లేదా సిప్ ని నిలిపివేయడం ద్వారా మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ దీని కంటే మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై రుణం తీసుకునే ఎంపిక ఎంతో ప్రయోజనకరమని చెప్పొచ్చు. దీనిపై పూర్తి వివరాలను తెలుసుకుందాం.
యూనిట్లపై రుణంతో ప్రయోజనం ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ యూనిట్‌పై రుణం తీసుకున్నప్పుడు మీరు యూనిట్లను అమ్మాల్సిన అవసరం ఉండదు. దీని అర్థం ఫైనాన్షియల్ ప్లాన్ కు ఎలాంటి ప్రభావం పడదు. పన్ను సమస్య ఉండదు, ఫండ్ యూనిట్ తనఖాతో సంస్థ యాజమాన్యాన్ని ప్రభావితం చేయదు. మ్యూచువల్ ఫండ్స్ అప్పులను త్వరగా చెల్లించడానికి ఉపయోగిస్తారు. ఇతర రుణాలతో పోలిస్తే స్వల్పకాలిక రుణాల అవసరాన్ని తీర్చడానికి ఈ ఎంపికను సరైందని చెప్పవచ్చు.
- మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ అనేది మీ సొంత ఎంఎఫ్ యూనిట్లపై తక్షణ లిక్విడిటీని పొందేందుకు ఒక అద్భుతమైన మార్గం.
- మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిష్క్రియంగా ఉందనుకుంటే, స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు, త్వరగా డబ్బును సమీకరించేందుకు ఇది ఒక అద్భుతమైన మార్గం.
- మ్యూచువల్ ఫండ్స్‌పై రుణానికి వడ్డీ రేట్లు పర్సనల్ లోన్ వడ్డీ రేటు కంటే తక్కువగా ఉండవచ్చు.
- మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై రుణాన్ని ఎంపి చేసుకుంటే, మీ యూనిట్లను విక్రయించాల్సిన అవసరం లేదు, కావున మీ ఆర్థిక ప్రణాళిక, ఫండ్ మేనేజ్ మెంట్ పై ఎలాంటి ప్రభావం ఉండదు.
ఎంత రుణం పొందవచ్చు?
మీరు రుణం కోసం ఫండ్ యూనిట్లను బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బిఎఫ్సి)కి తనఖా పెట్టగల్గితే, తద్వార తీసుకునే రుణానికి వడ్డీ చెల్లించాలి. సాధారణంగా వడ్డీ రేటు 10 నుంచి 11 శాతం వరకు ఉంటుంది. యూనిట్‌లను బ్యాంకు వద్ద తనఖా ఉన్నంత వరకు అది విక్రయించరు.
- ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో NAV(నికర ఆస్తి విలువ)లో 50 శాతం వరకు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో 80 శాతం వరకు రుణం పొందవచ్చు.
- కొన్ని బ్యాంకులు ఆమోదించిన, క్యామ్స్ తో రిజిస్టర్ అయిన మ్యూచువల్ ఫండ్‌ల జాబితాపై ఈ లోన్ సౌకర్యం అందుబాటులో ఉంది.
- లిక్విడేషన్ లేకుండా మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో దీర్ఘకాలిక నిలుపుదల, వినియోగించిన మొత్తంపై. వినియోగించిన కాలానికి మాత్రమే వడ్డీ విధిస్తారు. ఇది సంస్థల ఆధారంగా వేర్వేరుగా ఉండవచ్చు.
దరఖాస్తు చేయడం ఎలా?
బ్యాంకులు, కొన్ని ఆన్‌లైన్ పోర్టల్‌లు మీకు ఇలాంటి రుణాలకు అంగీకరిస్తాయి. డీమ్యాట్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉంటే,ఈ పని మరింత సులభం అవుతుంది. యూనిట్లు భౌతిక రూపంలో ఉన్నట్లయితే రుణం తీసుకునే ప్రక్రియ కొంత ఆలస్యం కావచ్చు. ముందుగా రుణం ఇచ్చే సంస్థతో ఒప్పందం చేసుకోవాలి.
ఆ తర్వాత లోన్ ఇచ్చే సంస్థ మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రార్ నుండి యూనిట్‌ను రిక్వెస్ట్ చేస్తారు. రుణగ్రహీత డిమాండ్ ప్రకారం, ఫిక్స్ డ్ యూనిట్లు స్తంభింపజేస్తారు. సాధారణంగా ఏదైనా ఫైనాన్షియర్ తనఖా పెట్టిన యూనిట్ విలువలో 60 నుండి 70 శాతం వరకు ఆమోదిస్తారు. రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత, ఫైనాన్షియర్ ఫండ్‌ను విడుదల చేయమని ఆదేశిస్తూ ఫండ్ హౌస్‌కి లేఖ రాస్తారు