ఇంట్లోనే ఉంటూ వ్యాపారాలు చేసుకోవచ్చు
ఇది ఆర్థికంగా ఓ భరోసా ఇస్తుంది. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే వ్యాపారాలు చేయవచ్చు
గృహ ఆధారిత వ్యాపారాలు గృహిణులు, తల్లులకు ఓ వరమనే చెప్పాలి. ఇంట్లోనే ఉంటూ వ్యాపారాలు చేసుకునే అవకాశం, ఇది వారికి ఆర్థికంగా ఓ భరోసాను ఇస్తుంది. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే కొంత సమయం కేటాయించడం ద్వారా వ్యాపారాలు చేయవచ్చు. ఈ రోజుల్లో అనేకమంది గృహిణులు ఇంట్లోనే వ్యాపారం చేస్తున్నారు. వారు ఖాళీ సమయాల్లో అదనపు ఆదాయం కోసం ఏదైనా పని చేయడం ద్వారా మరింత డబ్బు సంపాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారికి కొన్ని వ్యాపార ఆలోచనలు చూద్దామా..
చాక్లెట్ తయారీ ఆలోచన..
మొదటగా చాక్లెట్ తయారీ తక్కువ పెట్టుబడితో కూడిన వ్యాపార ఆలోచన అని చెప్పవచ్చ. ఇది గృహిణులకు సరైనదని చెప్పవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు నియంత్రణ సంస్థ FSSAI నుంచి లైసెన్స్ పొందాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యాపారంలో మీరు చాక్లెట్ల తయారీ, అమ్మకం చేయాలి. మీరు ఆకర్షణీయమై చాక్లెట్లు చేయాల్సి ఉంటుంది. చాక్లెట్ అమ్మకానికి మీరు షాపింగ్ మాల్స్ లేదా స్థానిక కిరాణా దుకాణాలతో ఒప్పందాలు చేసుకొని, వ్యాపారం వృద్ధి చేసుకోవాలి.
కేక్ తయారీ, బేకరీ ప్రొడక్ట్స్
గృహ ఆధారిత వ్యాపారాల్లో కేక్ లు, బేకరీ ఉత్పత్తుల తయారీ ఒకటి. ఇంట్లోనే తగిన వనరులతో కేక్లను తయారు చేయవచ్చు. దీనికి అనేక వనరులు, పరికారాల అవసరం కూడా ఉండదు. అయితే మీరు కేక్ తయారీలో తగిన నైపుణ్యం, శిక్షణ పొందాల్సి ఉంటుంది. మార్కెట్ట్కు అనుగుణంగా కొత్త రకమైన కేక్లతో అలరించాల్సి ఉంటుంది. కేక్ల అమ్మకాలను ఇంటి నుంచే నిర్వహించవచ్చు. అంతేకాదు మీరు సేల్స్ను పెంచుకునేందుకు స్థానిక బేకరీలతో ఒప్పందం చేసుకుంటే చేతినిండా పని ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.
కుకింగ్ క్లాస్ లు చెప్పడం..
ఈ కాలంలో కుకింగ్ క్లాస్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇది మహిళలకు అనుకూలమైన వ్యాపార ఆలోచన అని చెప్పవచ్చు. అయితే దీనికి చెప్పడానికి మంచి నైపుణ్యం ఉండాల్సి ఉంటుంది. ఇంకా అనేక వంట సమాన్లు, పరికరాలతో పాటు ఇంట్లో చిన్న స్థలం ఏర్పాటు చేసుకోవాలి.
క్యాండిల్స్ తయారీ
ఈ రోజుల్లో కొవ్వొత్తుల(క్యాండిల్స్)కు మంచి డిమాండ్ ఉంది. గృహిణులకు ఇది ఉత్తమమైన వ్యాపార ఆలోచన అని చెప్పవచ్చు. దీనికి 20 వేల వరకు పెట్టుబడి అవసరం ఉంటుందని అంచనా.
గ్రీటింగ్ కార్డ్ తయారీ
గ్రీటింగ్ కార్డ్స్ తయారీ ఇప్పుడు మంచి బిజినెస్, ఇది కూడా ఒక చిన్న గృహ ఆధారిత వ్యాపారం అని చెప్పవచ్చు. అంతేకాదు గ్రీటింగ్ కార్డులకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి పెట్టుబడి తక్కువే, అయితే సృజనాత్మకత ఉండాల్సి ఉంటుంది. గ్రీటింగ్ కార్డు తయారీకి అవసరమైన పెట్టుబడి ఒక మూడు నుంచి నాలుగు వేల వరకు ఉంటుందని చెప్పవచ్చు.
Thank you very much for sharing, I learned a lot from your article. Very cool. Thanks. nimabi