మ్యూచువల్ ఫండ్స్ ఎల్లప్పుడు లాభాల్లో ఉండాలా..?

Spread the love

ఈ జాగ్రత్తలు పాటించండి..

మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు ఇప్పుడు సాధారణమయ్యాయి. వీటిపై అవగాహన కూడా పెరుగుతోంది. అయితే అన్ని మ్యూచువల్ ఫండ్స్ లాభాలను ఇవ్వవు అనే విషయం తెలిసిందే. అయితే మంచి ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. అలాగే ఎల్లప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాభాల్లో ఉండేలా చూసుకోవాలి. వీటి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేచప్పుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఎల్లప్పుడూ లాభంలో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ హెచ్చు తగ్గులు ఆధారంగా పనిచేస్తాయి. వీటిలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కొన్ని విషయాలను జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందు దాని గురించి బాగా అర్థం చేసుకోవాలి. పెట్టుబడి లక్ష్యాలు, ఫండ్ పథకం మధ్య సినర్జీని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ వ్యూహాలను అనుసరించడం ద్వారా, మీరు మీ పెట్టుబడిని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

దీర్ఘకాలం పెట్టుబడి తప్పనిసరి

మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా ఉత్తమం. అలాగైతేనే మీరు మార్కెట్ అస్థిరత ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్‌ అస్థిరతను తట్టుకుని నిలబడాలంటే దీర్ఘకాలికంలోనే మంచి రాబడిని వస్తుంది.

క్రమం తప్పకుండా పెట్టుబడి

రెగ్యులర్ గా పెట్టుబడులు పెట్టడం ఎంత అవసరమో, ఎక్కువకాలం పాటు పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం. అంటే, ప్రతి నెలా మీ పొదుపులో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టండి. దీనికోసం మ్యూచువల్ ఫండ్లలో సిప్ విధానం ఎంతో మేలు. రెగ్యులర్ పెట్టుబడి మిమ్మల్ని మార్కెట్ నష్టాల నుండి కాపాడుతుంది.

పనితీరుపై నిఘా

మ్యూచువల్ ఫండ్ పనితీరును పర్యవేక్షించడం కూడా చాలా ముఖ్యమైంది. ఎన్‌ఎవిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఫండ్ లీడ్ మేనేజర్ పాత్ర చాలా అవసరం అని తెలుసుకోవాలి. అందుకే ఫండ్ మేనేజర్ బృందం మారితే జాగ్రత్తగా ఉండండి.

మంచి ఫండ్లలో పెట్టుబడి

బాగా పని చేయని ఫండ్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు ఆ ఫండ్‌ను మార్చుకోవచ్చు. ఒక ఫండ్ నుండి మరొక ఫండ్‌కు మారి పెట్టుబడి పెడితే అది కొన్ని సమయాల్లో ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే సరిగ్గా పనిచేయని ఫండ్ నుంచి బయటపడండి. కొత్తగా మంచి రాబడిని ఇస్తున్న వాటిని ఎంపిక చేసుకోండి.

మెరుగైన రంగంలో పెట్టుబడులు

మంచి పనితీరు కనబరిచే రంగాలలో ఎల్లప్పుడూ పెట్టుబడులు పెట్టండి. బ్యాంకింగ్ రంగం పనితీరు మంచిది కానట్లయితే, డబ్బు సంపాదించే ఫండ్ పనితీరు కూడా మంచిగా ఉండదు. సెక్టార్- స్పెసిఫిక్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మార్కెట్‌పై నిఘా ఉంచాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీరు మంచి రాబడిని పొందవచ్చు.

మీరు మ్యూచువల్ పనితీరు గురించి తెలుసుకోవాలంటే .. ఈ సైట్లలో తనిఖీ చేసుకోండి..

https://www.valueresearchonline.com/funds

https://www.moneycontrol.com/mutual-funds/find-fund/


Spread the love

2 thoughts on “మ్యూచువల్ ఫండ్స్ ఎల్లప్పుడు లాభాల్లో ఉండాలా..?”

Leave a Comment

error: Content is protected !!