చిన్న ఖర్చులే కానీ.. భారీ మూల్యం

Spread the love

కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తపడితే మీ డబ్బు ఆదా, ఆరోగ్యం..

అవేంటో తెలుసుకోండి..

జీవితం రెండో అవకాశం ఇవ్వదు. ఒక్క చిన్న తప్పు చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. మీరు ఖర్చు విషయంలో తప్పులు చేయకుండా ఉండగల్గితే డబ్బును ఆదా చేయగల్గుతారు. జీవితంలో డబ్బే ప్రధానం అవునా, కాదా, వదిలేయండి. కానీ డబ్బు లేనిదే జీవితమూ ముందుకు సాగదు. ఇది నిజం. మన డబ్బు నిర్వహణ సరిగ్గా ఉంటేనే పొదుపు చేసి భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చు. ఈ డబ్బు విషయంలో తప్పులు చేయొద్దు. మనం చేయకూడదని ఆ కొన్ని తప్పిదాలేమిటో తెలుసుకుందాం.

మనం ఏం ఖర్చులు చేస్తున్నాం..

మనం ఏం ఖర్చు చేస్తున్నామో సరైన అవగాహన ఉండాలి. కొందరు ఖర్చులు చేస్తారు, కానీ అది అవసరమా, లేదా, బేరీజు వేసుకోరు. మీ ఖర్చులను పరిశీలించే విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఖర్చులను నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఖర్చులు ఏమిటి, అది సరైందేనా, కాదా, తెలుసుకోలేకపోతున్నారు అంటే మీరు తెలియని ఖర్చులను ఆహ్వానిస్తున్నారన్న మాట.

సరైన ఆర్థిక ప్రణాళిక

సరైన ఆర్థిక ప్రణాళిక అనేది లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టడం అనేది కూడా తప్పు. మీరు పెద్ద మొత్తంలో ఖర్చు చేసే మరో సాధారణ తప్పు ఏమిటంటే సరైన ప్లానింగ్ లేకపోవడమే అని చెప్పాలి. డబ్బును ఇష్టారీతిలో అంటే అడ్డగోలుగా పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. పక్కా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి.

ఎమర్జెన్సీ ఫండ్

ఎమర్జెన్సీ ఫండ్ అంటే అత్యవసర నిధి. మీరు జీవితంలో ఏదైనా అనుకోని సంఘటనలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. కొంత ఎమర్జెన్సీ ఫండ్ అంటే డబ్బు ఉండాలి. లేకపోతే మీ డబ్బు ఖర్చయ్యే అవకాశముంది.

ఆలోచించకుండా పెట్టుబడి వద్దు..

సరైన విశ్లేషణ చేయకుండా స్టాక్స్ లో పెట్టుబడి వద్దు. మీరు సరైన పరిశోధన చేయకుండా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టకూడదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది ఎంతో రిస్క్ తో కూడిన వ్యవహారం. ఏమాత్రం ఆజాగ్రత్త ఉన్నా, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కోల్పోవాల్సి వస్తుంది.

డబ్బును ఒకే బుట్టలో పెట్టకండి..

మీరు మొత్తం డబ్బును ఒకే బుట్టలో పెట్టకండి. అంటే మీరు మీ పెట్టుబడి నిధులను విభిన్న వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఉదాహరణకు.. డబ్బుతో ఒకే షేరులో పెద్ద మొత్తం చేయకుండా, వివిధ రంగాలను ఎంపిక చేసుకుని పెట్టుబడి చేయాలి. మీ మొత్తం డబ్బును ఒకే దానిలో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు కొన్ని సందర్భాల్లో నష్టాలకు గురిచేయవచ్చు.

ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్

కుటుంబానికి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఎంతో నష్టం. మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోవడం అనేది మరో తప్పు అవుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ ఏ సమయంలోనైనా ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు దాచుకున్న డబ్బు పెద్దగా ఖర్చు అయ్యే అవకాశముంది.

రెగ్యులర్ గా కార్ మెయింటెనెన్స్

తప్పనిసరి రెగ్యులర్ గా కార్ మెయింటెనెన్స్ చేయాలి. మీరు కారుని కలిగి ఉన్నట్లయితే రెగ్యులర్ గా కార్ మెయింటెనెన్స్ కోసం సమయం కేటాయించాలి. ఎందుకంటే ట్యూనింగ్, ఆయిల్‌లో మార్పు, ఫిల్టర్ మొదలైనవి ఉంటాయి. ఇది భవిష్యత్తులో పెద్ద రిపేర్లను నివారించడానికి దోహదం చేస్తుంది.

కారు బీమా రెన్యూవల్

కారు బీమా రెన్యూవల్ చేసుకోవాలి. కారుకు సంబంధించిన మరో సాధారణ తప్పు మీ కారుకు బీమాను రెన్యువల్ చేయకపోవడం. ఇది చాలా చిన్న పొరపాటు, కానీ మీరు నిర్లక్ష్యం చేశారంటే, పర్యవసానంగా చాలా డబ్బు ఖర్చు అవుతుంది.

క్రెడిట్ కార్డు పేమెంట్ డ్యూ డేట్ మరవద్దు..

క్రెడిట్ కార్డ్ చెల్లింపు తేదీ మర్చిపోవద్దు. మీరు క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించాలని గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడంలో విఫలమైనట్లయితే, పర్యవసానంగా మీరు చాలా వడ్డీని చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.

పర్సనల్ లోన్

పర్సనల్ లోన్ తీసుకోవడం మనం చేసే తప్పుల్లో ఒకటి. మీకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసే మరో చిన్న పొరపాటు పర్సనల్ లోన్ తీసుకోవడం. మీరు పర్సనల్ లోన్ తీసుకోవడం మానుకోవాలి. వ్యక్తిగత రుణం మీకు పెద్ద మొత్తంలో ఖర్చుకు దారితీస్తుంది.

అనవసర వస్తువులు కొనొద్దు

ఉపయోగం లేకుండా వస్తువులను కొనవద్దు. ఎందుకంటే ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేయాలనుకుంటే, ముందు అది మనకు ఖచ్చితంగా అవసరమా, కాదా, స్పష్టంగా తెలుసుకోవాలి. ఉపయోగం లేకుండా వస్తువులను కొనుగోలు చేయడం వల్ల డబ్బు వృధా అవుతుంది.

డిస్కౌంట్ల వలలో పడొద్దు

తక్కువ నాణ్యత వస్తువులను కొనొద్దు. సగం ధరలో లభించే చౌకైన వస్తువుల వలలో పడొద్దు. తక్కువ ఖర్చుతో కూడిన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల మీ డబ్బు ఆదా అవుతుంది. కానీ తక్కువ నాణ్యత ఎక్కువ కాలం ఉండదు అని గుర్తుంచుకోండి. మీరు నాణ్యమైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి.

బయట డిన్నర్ తరుచూ చేస్తున్నారా..

మీరు రోజూ లంచ్ లేదా డిన్నర్ కోసం ఖరీదైన హోటళ్లను సందర్శిస్తున్నారా.. అయితే వీటికి దూరంగా ఉండండి. హోటళ్లలో ఎక్కువసార్లు భోజనం చేయడం, పార్టీలు చేసుకోవడం వంటివి మానుకోవాలి. మీకు తరచుగా పార్టీని నిర్వహించే అలవాటు ఉంటే, మీరు అలాంటి వాటికి దూరంగా ఉండడం నేర్చుకోండి. తరచూ బయట భోజనం చేయడం, పార్టీ చేసుకోవడం వల్ల మీకు చాలా డబ్బు ఖర్చవుతుంది.

స్మోకింగ్, ఆల్కహాల్

స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ వద్దు. స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం, కానీ ఎవరు పట్టించుకుంటారు. ఈ రెండూ మన జీవనశైలిలో భాగంగా మారాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది సులభమైన మార్గం. కారణం ఏమైనప్పటికీ వీటికి దూరంగా ఉండి, ఖర్చులను తప్పించుకోవడం ఉత్తమం. వీటి వల్ల క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.


Spread the love

Leave a Comment

error: Content is protected !!