ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా

Spread the love

పెద్ద కంపెనీల ఫ్రాంచైజీల గురించి మీకు తెలుసా..
 ఈ బిజినెస్ ప్లాన్లో పెట్టుబడి ఎలా పెట్టాలి
వీటితో అద్భుతమైన లాభాలు ఎలా పొందవచ్చు.. 

కంపెనీల్లో ఉద్యోగాలు ఒకరి కింద పని చేయడమే కదా, మనకంటూ ఒక ఫ్రీడమ్ ఉండదు. అంతేకాదు కంపెనీ ఏం చెబితే అది చేయాలి, లేదంటే మన జాబ్ కే ముప్పు ఉంటుంది.  చాలా సార్లు ఉద్యోగాల్లో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కానీ కొత్త ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల, చేస్తున్న ఉద్యోగాలను వదిలి వెళ్ళలేరు. కానీ ఉద్యోగాన్ని వదిలి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు కొన్ని వ్యాపార ఆలోచనల గురించి తెలుసుకోండి. ఈ వ్యాపారాల ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఇంట్లో నుంచే చేయవచ్చు. స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తోంది. అనేక కంపెనీలు ఫ్రాంచైజీని తెరవడానికి ప్రజలకు సహాయం చేస్తున్నాయి. మీరు ఫ్రాంచైజ్ వ్యాపారం చేయవచ్చు. ఫ్రాంఛైజీ సహాయంతో చేసే వ్యాపారం గురించి తెలుసుకుందాం, దాంతో మరో రెండు ప్రత్యేక వ్యాపారాల గురించి తెలుసుకుందాం. అంటే మొత్తం 4 సొంత వ్యాపారాల గురించి తెలుసుకుందాం..

ఆధార్ ఫ్రాంచైజీ

మీరు ఆధార్ కార్డ్ ఫ్రాంచైజీని ప్రారంభించవచ్చు. ఈ ఫ్రాంచైజీని పొందడానికి, మీరు ముందుగా పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, యుఐడిఎఐ(UIDAI) మీకు ఆధార్ కార్డ్ ఫ్రాంచైజీలో ఒకదాన్ని తెరవడానికి అవకాశం ఇస్తుంది. ఈ ఫ్రాంచైజీలో మీరు బయోమెట్రిక్ ధృవీకరణ, ఆధార్ నమోదు సంఖ్యను తనిఖీ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తర్వాత కామన్ సర్వీస్ సెంటర్‌లో నమోదు చేసుకోవడం కూడా అవసరం.

 ఈ ఫ్రాంచైజీని పొందడానికి మీరు https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action వెబ్‌సైట్‌ను చూడండి. దీని తర్వాత మీరు ఇక్కడ నుండి ఆధార్ ఫ్రాంచైజీని తీసుకోవడం గురించి సమాచారాన్ని పొందవచ్చు.

అమూల్ ఫ్రాంచైజీ

ప్రతి కుటుంబానికి పాల అవసరం ప్రతి రోజూ ఉంటుంది. దేశంలోని అతిపెద్ద పాల ఉత్పత్తుల తయారీ సంస్థ అమూల్ ప్రజలకు తన ఫ్రాంచైజీని అందిస్తోంది. ఈ ఫ్రాంచైజీ ప్రత్యేకత ఏమిటంటే దీంతో మీకు పెద్దగా ఖర్చు ఉండదు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు 4 నుండి 5 లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. అనంతరం అమూల్ పాలు లేదా అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ ఫ్రాంచైజీని తీసుకోవచ్చు. దీని కోసం మీరు రూ.2 లక్షలు ఇన్వేస్ట్ చేసి ఫ్రాంచైజీని తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలో రూ.25 వేలు నాన్ రిఫండబుల్ సెక్యూరిటీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ ఫ్రాంచైజీని పొందడానికి మీరు retail@amul.coopకి మెయిల్ చేయాలి. ఇది కాకుండా మీరు http://amul.com/m/amul-scooping-parlors ని సందర్శించవచ్చు. దీని ద్వారా అమూల్ ఫ్రాంచైజీ గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

వీటి తర్వాత రెండు ప్రత్యేత వ్యాపారాలేమిటో చూద్దాం…

ఈ ప్రత్యేక వ్యాపారాల్లో మొదటిది.. బ్యూటీ అండ్ స్పా షాప్, రెండోది గేమ్ స్టోర్. ఈ రెండు వ్యాపారాలు ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. మీరు మహిళ అయితే స్వయం సమృద్ధిగా మారాలనుకుంటే, బ్యూటి అండ్ స్పా మీకు గొప్ప అవకాశమనే చెప్పాలి. ఈ రెండు వ్యాపార ప్రణాళికల గురించి వివరంగా తెలుసుకుందాం..

బ్యూటీ అండ్ స్పా షాప్ వ్యాపారం

మీరు మహిళ అయితే, సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నట్లయితే, బ్యూటీ అండ్ స్పా షాప్ మీకు గొప్ప వ్యాపార ప్రణాళికగా చెప్పవచ్చు. ఈ వ్యాపారం ప్రత్యేకత ఏమిటంటే మీరు దీన్ని ఇంట్లో కూర్చొని కూడా ప్రారంభించవచ్చు. దీని కోసం మొదట మీకు ఇంట్లో ఒక గది అవసరం. దీని తర్వాత మీరు బ్యూటీ అండ్ స్పాకు సంబంధించిన ప్రతిదాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

దీని తరువాత మీకు ప్రత్యేక బ్యూటీ చైర్ కూడా అవసరం, మీరు సౌందర్య ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనిలో మీరు ప్రారంభ దశలో రూ.2 నుండి 3 లక్షల పెట్టుబడి పెట్టాలి. దీని తర్వాత మీరు ఒక నెలలో కనీసం రూ.3 నుండి 4 లక్షల వరకు సంపాదించగలరు. అయితే ఇది ఆయా ప్రాంతాల ఆధారంగా ఉంటుంది.

గేమ్ స్టోర్ వ్యాపారం

ఈ రోజుల్లో పిల్లల్లో ఆటలంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ పరిస్థితుల్లో పిల్లల కోసం గేమ్ స్టోర్‌ను తెరవొచ్చు. పిల్లలు సులభంగా వచ్చే ప్రదేశాన్ని మీరు ఎంచుకోవాలని గుర్తుంచుకోండి. గేమ్ స్టోర్‌ని తెరవడానికి మీకు కొన్ని ప్రత్యేక విషయాలు అవసరం, దీని కోసం ముందుగా కంప్యూటర్ గేమ్ అవసరం. మీకు ఎక్కువ నిధులు ఉంటే, మీరు కంప్యూటర్ గేమ్‌లను కొనుగోలు చేయవచ్చు. మీకు నిధుల కొరత ఉంటే, కొనుగోలు చేయడానికి బదులుగా అద్దెకు కూడా తీసుకోవచ్చు.

గేమ్ స్టోర్ తెరవడానికి కనీసం 5 నుండి 6 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాలి. కానీ క్రమంగా మీరు ఈ వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ప్రతి నెలా రూ.1 నుండి 2 లక్షల వరకు సంపాదించవచ్చు. కొన్ని రోజుల్లోనే మీ పెట్టుబడి తిరిగి రాబట్టుకోవచ్చు.


Spread the love

4 thoughts on “ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా”

  1. Hi there, just became aware of your blog through Google, and
    found that it’s truly informative. I am gonna watch out for brussels.
    I will be grateful if you continue this in future.
    A lot of people will be benefited from your writing.

    Cheers!

    Reply
  2. We absolutely love your blog and find most of your post’s to be just what I’m looking for.
    Do you offer guest writers to write content for you personally?
    I wouldn’t mind writing a post or elaborating on a few of
    the subjects you write related to here. Again, awesome weblog!

    Reply
  3. Hello! I’ve been following your site for some time now and finally got the bravery to go ahead and give you a
    shout out from Kingwood Texas! Just wanted to say keep up the great job!

    Reply

Leave a Comment

error: Content is protected !!