లాభాల పంట.. ఈ ఎల్ఐసి ఐపిఒ.. మిస్ కావొద్దు..

మే 4న ఇష్యూ ప్రారంభం..

ఒక్కో షేరు ధర రూ. 902-949

ఎట్టకేలకు ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తన ఐపిఒను మే 4న ప్రారంభించనుంది. రూ. 21,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా వస్తున్న ఈ ఐపిఒలో ఒక్కో షేరుకు రూ. 902-949 ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఐపిఒలో పాలసీదారులకు రూ.60 తగ్గింపు, రిటైల్ పెట్టుబడిదారులు, ఉద్యోగులకు రూ.45 తగ్గింపు లభిస్తోంది.యాంకర్ ఇన్వెస్టర్ల కోసం మే 2న, మిగిలిన వారికి మే 4 నుంచి 9 వరకు ఐపిఒ తెరవనున్నట్లు నివేదిక పేర్కొంది. ఇష్యూలో 10% (2.21 కోట్ల షేర్లు) పాలసీదారులకు, 0.15 కోట్ల షేర్లు అర్హులైన ఉద్యోగులకు రిజర్వ్ చేశారు. ఎల్‌ఐసిలో 3.5% వాటా (22 కోట్ల షేర్లు) విక్రయించడం ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.21,000 కోట్లను సమీకరించాలనుకుంటోంది.

ఒక లాట్ ఎంత ?
ఈ ఐపిఒలో ఎల్ఐసి ఉద్యోగి కనీసం 13,560 రూపాయల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. పాలసీదారులు కనీసం రూ. 13,335 పెట్టుబడి పెట్టాలి. అదే సమయంలో, ఇతర పెట్టుబడిదారులు ఎల్ఐసి 15 షేర్లను కొనుగోలు చేయడానికి రూ.14,235 ఖర్చు చేయాలి.

మే 13న షేర్ల కేటాయింపు
షేర్ కేటాయింపు ఎల్ఐసి ఐపిఒ మే 4న ప్రారంభమై, మే 9న ముగుస్తుంది. మే 9 సోమవారం, కావున కంపెనీ 3 రోజుల పాటు ఐపిఒ బిడ్‌లను పరిశీలిస్తుంది. శని, ఆదివారాల్లో షేర్ కేటాయింపు ఉండదు. అందువల్ల మే 13 శుక్రవారం షేర్ల కేటాయింపు జరగనుంది.

మే 16 నాటికి మీ డీమ్యాట్‌లోకి షేర్లు
ఎల్ఐసి ఐపిఒ పెట్టుబడిదారులకు కేటాయించిన షేర్లు మే 16 నాటికి డీమ్యాట్ ఖాతాలోకి క్రెడిట్ చేస్తారు. ఈ ఐపీఓలో మొత్తం 22.13 కోట్ల ఎల్‌ఐసీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది.

మే 17 నుంచి షేర్ల ట్రేడింగ్
ఎల్‌ఐసీ షేర్లు మే 17న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి. దీనిలో ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మెగా ఐపీఓ (ఎల్‌ఐసీ మెగా ఐపీఓ) ధరను రూ.902 నుంచి రూ.949గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఐపిఒలో ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి.

error: Content is protected !!