ఈ వ్యాపారాలతో సక్సెస్ గ్యారెంటీ..

Spread the love

మనం సంతోషంగా జీవించాలంటే కావాల్సినది డబ్బు. ఆ డబ్బును ఏవిధంగా సంపాధిస్తే లాభాలొస్తాయనేది మనం తీసుకునే నిర్ణయాలు, ఆచరణపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఎన్నో వ్యాపార ఆలోచలు ఉన్నాయి. కానీ వాటిని సరిగ్గా పక్కా ప్రణాళికతో అమలు చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఎవరికి వారు తమకు తాము ఎలాంటి వ్యాపారం అనుకూలం ఉంటుందో, ఏది సరిగ్గా చేయగలమో ఆలోచించుకోవాలి. ఈ సోదంతా ఎందుకు ఆ వ్యాపారాలేమిటో చెప్పరాదు అంటారా.. సరే అసలు విషయానికొస్తాను. సరైన వ్యాపారం మనకు లాభాలపంట పండిస్తుంది. అలాంటివి కొన్ని నేను చదవడం, వినడం ద్వారా తెలుసుకున్నాను. వాటిని మీకు తెలియజేస్తున్నాను. మీరు సరిగ్గా ఆ వ్యాపార ఆలోచనలు అమలు చేస్తే భారీ విజయం చూస్తారని చెప్పగలను. అలాంటి అత్యంత విజయవంతమైన వ్యాపార ఆలోచనలు పది ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా.

రెస్టారెంట్

రెస్టారెంట్ వ్యాపారం అత్యంత విజయవంతమైన వ్యాపార ఆలోచనల్లో ఇది ఒకటి. ఆరోగ్యకరమైన & రుచికరమైన ఆహార అందరికీ అవసరం. మీకు ఆహారం పట్ల ఇష్టం, అభిరుచి ఉంటే, ఇంకా ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం అందించడానికి సిద్ధంగా ఉంటే గనుక మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. థీమ్ ఆధారంగా రెస్టారెంట్ చేయడం ఇప్పుడు గొప్ప ఆలోచన. అయితే దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు జంగిల్ ఆధారంగా థీమ్ ఇలా రెస్టారెంట్ను ఆలోచించవచ్చు. బిజీగా జీవనశైలి కారణంగా ఇంట్లో వంట చేసుకోవడానికి సమయం లభించని ప్రజలు పెరుగుతున్నారు. అలాంటి వారు డబ్బులతో ఆహారాన్ని కొనేందుకు సిద్ధంగా ఉంటారు. అంతేకాదు ప్రజలు తరచుగా రెస్టారెంట్లో తినడానికి ఇష్టపడతారు. అందుకే ఈ రెస్టారెంట్ వ్యాపార నేడు అత్యంత విజయవంతమైన వ్యాపార ఆలోచన అని చెప్పవచ్చు. దీనికి తోడు ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లు జొమాటో, స్విగ్గీ వంటి వాటి వల్ల రెస్టారెంట్ల వ్యాపారం పెరుగుతోంది కూడా.

రిక్రూట్మెంట్ సంస్థ

నియామక సంస్థ ప్రారంభించడం నిజంగా మంచి వ్యాపార ఆలోచన. మరో విషయమేమిటంటే నియామక సంస్థకు భారీ పెట్టుబడి అవసరం లేదు. మీరు కేవలం చిన్న ఆఫీస్ ప్రదేశం, కొంత పరిచయం చేసుకునే సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని అంశాల మీద మనకు పట్టుఉండాల్సి ఉంటుంది. నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో రిక్రూట్మెంట్ సంస్థలకు భారీ డిమాండ్ ఉంది. ప్రతి విద్యార్థి లేదా వృత్తి నిపుణుడు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అదే సమయంలో అనేక కంపెనీలకు మంచి ఉద్యోగుల అవసరం కూడా ఉంది. వీరి కోసమే ఈ రిక్రూట్మెంట్ సంస్థలు. మంచి ఉద్యోగం, మంచి అభ్యర్థి పొందడానికి తగిన రిక్రూట్మెంట్ సంస్థలకు డబ్బులు చెల్లించి, కమిషన్ బేస్ సేవలు అందుకునే వారు ఉన్నారు కూడా. అలాగే మంచి అభ్యర్థుల కోసం కంపెనీలు కూడా ఈ రిక్రూట్మెంట్ సంస్థలను ఆశ్రయిస్తాయి.

గిఫ్ట్ స్టోర్

గిఫ్ట్ స్టోర్ ప్రారంభించడం మంచి వ్యాపార ఆలోచనగా చెప్పవచ్చు. దీనికి ఒక ఓ ప్రదేశం ఉండాలి, అయితే మీరు మీ ఇంటి నుంచి ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు కూడా. ఇది తక్కువ పెట్టుబడితో వ్యాపార ఆలోచన అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో వేడుకలు సర్వసాధారణం. ఇలాంటి పంక్షన్లకు వెళ్లే బందువులు, మిత్రులకు కానుకలను ఇచ్చే విధానం పెరుగుతోంది. ప్రజలు కార్డు లేదా సాంప్రదాయ గిఫ్ట్ లను ఇస్తుంటారు. ఇది మంచి వ్యాపార ఆలోచన కావచ్చు.

వెడ్డింగ్ & క్యాటరింగ్

మీరు ఒకే సమయంలో బహుళ పనులు నిర్వహించే సృజనాత్మక, సామర్థ్యం కల్గి ఉంటే మీకు వెడ్డింగ్ & క్యాటరింగ్ వ్యాపారం మంచి ఎంపిక అవుతుంది. దీనికి నైపుణ్యం, నిర్వహణా సామర్ధ్యం అవసరం అవుతాయి. అంతేకాదు ఇది చాలా సవాళ్లతో కూడిన వ్యాపారం కూడా. వివాహం ఎవ్వరికైనా జీవితంలో మధురమైన క్షణాలు, జీవితకాలంలో అవి మరిచిపోలేని రోజులుగా గుర్తుంచుకుంటారు. ఈ వేడుకను చక్కగా నిర్వహించి, అందరికీ ఎలాంటి లోటు లేకుండా ప్రణాళికతో చేసే వ్యాపారం కూడా ఎంతో లాభదాయకంగా ఉంది. ఈ రోజుల్లో వేడుకలు నిర్వహించేందుకు, వాటిని విజయవంతం చేసేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి డిమాండ్ కూడా బాగా ఉందనే చెప్పాలి. ఈ వ్యాపారంలో మీకు నైపుణ్యం, సామర్థ్యం ఉంటే గనుక మీరు ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చు.

ఆన్లైన్ కోచింగ్ క్లాస్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆన్ లైన్ క్లాసులు తప్పనిసరి అయ్యాయి. ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా సులభమైంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్, కోచింగ్ క్లాస్ లకు మంచి డిమాండ్ ఉంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల డైరెక్టు కోచింగ్ క్లాసులు తీసుకోవడం ద్వారా కూడా బాగా సంపాదించవచ్చు. ఇది మంచి వ్యాపార ఆలోచన. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చిన్న ప్రదేశం, దాంతో పాటు నైపుణ్యం ఉండాల్సిన అవసరం ఉంది. నేడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఫస్ట్ క్లాస్ లో ఉండాలని కోరుకుంటున్నారు. అందువలన కోచింగ్ క్లాస్ లకు పంపేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు.

టూర్, ట్రావెల్ ప్లానర్

ఒకప్పుడు పర్యటన ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కానీ ఇప్పుడు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం టూర్, ట్రావెల్ ప్లానర్ గా మారితే అది గొప్ప వ్యాపార ఆలోచన అనే చెప్పాలి. ఈ వ్యాపార వస్తువును అన్ని ప్రాంతాలపై జ్ఞానం, పరిచయాలు చాలా అవసరం. ఖచ్చితంగా ఇది విజయం పొందవచ్చు. దీనికి గాను మీరు కూడా యాత్రా.కామ్ వంటి వెబ్సైట్ లతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఇటీవల సర్వే ప్రకారం, దేశంలో ప్రతి సంవత్సరం వ్యాపార పర్యటనలు పెరుగుతున్నాయి. అంతేకాదు దీపావళి, వేసవి, క్రిస్మస్ మొదలైన సెలవు రోజుల్లో ప్రజలు విభిన్న ప్రదేశాలు, హిల్ స్టేషన్లను సందర్శించాలని కోరుకుంటున్నారు. సెలవులను ఆస్వాదించడానికి వారు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అందువలన ఇది లాభదాయకమైన వ్యపారం అవుతుంది అని చెప్పవచ్చు.

స్మార్ట్ ఫోన్ అమ్మకం, రిపేర్

ఈ కాలంలో జీవనం అంతా టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందులోనూ స్మార్ట్ ఫోన్లు జీవితంలో ఒక భాగం అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ల అమ్మకం, రిపేర్ ఇప్పుజు అత్యంత మంచి వ్యాపార ఆలోచన. స్మార్ట్ ఫోన్ అమ్మకం, మరమ్మత్తు వ్యాపార ప్రారంభించడానికి గాను మీకు నైపుణ్యం, పెట్టుబడి అవసరం అవుతాయి. మొబైల్ ఫోన్ వ్యాపారం వేగంగా వృద్ధిని సాధిస్తోంది. ప్రతి సాధారణ వ్యక్తి నేడు స్మార్ట్ ఫోన్ ఇష్టపడతున్నాడు. రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడంతో వాటికి సంబంధించిన రిపేర్ కు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇది మంచి వ్యాపార అవకాశంగా భావించి, వినియోగించుకుంటే సంపాధన బాగానే ఉంటుంది.

ఈవెంట్ మేనేజ్మెంట్

పెద్ద కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్ మెంట్ అవసరం తప్పనిసరి అయింది. ప్రస్తుత సమసయంలో ఇది అత్యంత ఉత్తమమైన వ్యాపార ఆలోచన. ఈ వ్యాపారానికి ప్రణాళిక, నిర్వహణ సామర్థ్యం అవసరమవుతుంది. కంపెనీలు తరచూ మార్కెట్ ఉత్పత్తులు, సేవలకు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. పలు కంపెనీలు ఈవెంట్లను విజయవంతం చేసేందుకు గాను ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను వినియోగించుకుంటాయి.

కన్సల్టెన్సీ, కాంట్రాక్టింగ్

ఆఖరుగా మరో విజయవంతమైన వ్యాపార ఆలోచన కన్సల్టెన్సీ, కాంట్రాక్టు అని చెప్పవచ్చు. ఈ వ్యాపారానికి నైపుణ్యం, తగినంత నాలెడ్జ్ అవసరం అవుతుంది. ఈ వ్యాపారానికి మూలధనం అవసరం చాలా తక్కువగానే ఉంటుంది. ఇంజనీరింగ్, మార్కెటింగ్, శాస్త్రీయ పరిశ్రమలు సహా అన్ని రంగాల్లో కన్సల్టెంట్స్, కాంట్రాక్టర్ అవసరం పెరుగుతోంది. పెద్ద కంపెనీలు కూడా మంచి కన్సల్టెంట్స్, కాంట్రాక్టర్లకు చాలా పెద్దమొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ వ్యాపార ఆలోచనలు మీకు ఉపయోగపడతాయనుకుంటే కామెంట్ ద్వారా స్పందన తెలియజేయండి.


Spread the love

4 thoughts on “ఈ వ్యాపారాలతో సక్సెస్ గ్యారెంటీ..”

Leave a Comment

error: Content is protected !!