పెద్ద చదువులు చదివి, తగిన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడేవారున్నారు.
ఎవరిమీదా ఆధారపడకుండా జీవనం కొనసాగించాలనుకునే వారికి.. తక్కువ పెట్టుబడితో చేసేందుకు చాలా వ్యాపార ఆలోచనలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం.
కస్టమ్ గిఫ్ట్ స్టోర్
ప్రస్తుత రోజుల్లో ఎక్కడ బర్త్ డే, మ్యారేజ్ వంటి ఫంక్షన్లకు వెళ్లినప్పడు ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ల అవసరం ఉంటుంది. వారికి తగిన బహుమతి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. అలాంటి వారు ఇంట్లో అలంకారానికి, షోకేజీల కోసం గిఫ్ట్ లను కొనుగోలు చేస్తారు. పర్సనలైజ్డ్ లేదా గిఫ్ట్ స్టోర్లో బహుమతులను కొనుగోలు చేస్తారు. ఇది ఈ రోజుల్లో లాభదాయకమైన వ్యాపారం అని చెప్పవచ్చు.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్
నూడుల్స్, చికెన్ 65, రోటీ వంటి ఆహార పదార్థాలకు మంచి డిమాండ్ ఉంది. వీటి కోసం ప్రత్యేకించి బయటికి వచ్చి తినేవారు ఉన్నారు. పెద్ద పెద్ద హోటళ్లకు వెళ్లే బదులు, ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తక్కువ ధరలో కడుపునింపుకునే వారు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఈ వ్యాపారానికి మంచి డిమాండ్ కూడా ఉంది.
జిమ్ లేదా ఫిట్నెస్ సెంటర్
ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం వ్యాయామం చేసేవారు పెరుగుతున్నారు. అంతేకాదు వ్యాయామం అందరికీ అవసరం కూడా. యువతనే కాదు, అందరూ ఆరోగ్యం కోసం జిమ్ లు లేదా ఫిట్నెస్ సెంటర్లకు వెళుతున్నారు. వీటిని ప్రారంభించి వినియోగదారులను ఆకర్షిస్తే బాగానే సంపాదించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని ఫిట్ నెస్ విషయాలు, ట్రైనింగ్ మెళకువలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంటీరియర్ డిజైనర్
ఇంటీరియల్ డిజైనర్ వ్యాపారానికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అందరూ నేడు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఆదాయం పొందుతున్నారు. అయితే మీకు ప్రత్యేక నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం ఉంది.
చిన్న దుకాణం
ఆన్లైన్ మార్కెట్లు వచ్చినప్పటికీ కిరాణా షాప్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఈ రోజుల్లో ఒక ప్రాంతంలో చిన్న కిరాణా దుకాణం ప్రారంభించి లాభాలను పొందవచ్చు. ఇది మరొక మంచి ఆలోచన చెప్పవచ్చు. అయితే దీనికి ప్రత్యేక నైపుణ్యం అవసరం లేదు. తగిన ప్రదేశం ఎంపిక చేసుకుని చిన్న దుకాణం నుంచి క్రమక్రమంగా దానికి పెద్దగా పెంచుకోవచ్చు.
మేకింగ్ లేదా వెడ్డింగ్ ప్లానర్
నేడు వివాహ వ్యూహకర్తలకు మంచి డిమాండ్ ఉంది. మ్యాచ్ మేకింగ్ లేదా వివాహ వ్యూహకర్త ఆలోచన మంచి వ్యాపార ఎంపిక.
ట్యూషన్, ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సు
హోం ట్యూషన్, క్లాసులు చెప్పడం చేయడం ద్వారా కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అత్యంత అవసరమైంది. ఇప్పటి టెక్నాలజీని వినియోగించుకుని ఆన్లైన్ లో క్లాసులు చెప్పవచ్చు. అన్ని రకాల తరగతులు, అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి క్లాస్ ఇంటికి వెళ్లి చెప్పడం, లేదా ఒక ప్రదేశంలో క్లాస్ లు తీసుకోవడం చేయవచ్చు. దీని ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చు. ఇంట్లో ఉంటూనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లను వినియోగించుకుని ట్యూషన్లు ప్రారంభించవచ్చు. హోమ్ ట్యూషన్ కూడా నేడు బాగా పాపులర్ అయింది.
మొబైల్ షాప్
ప్రస్తుతం అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్న మొబైళ్లకు ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండడం అత్యంత కష్టతరమైన విషయం. చిన్న మొబైల్ షాప్ ఉన్నా వ్యాపారం అదుర్స్ అనే చెప్పాలి.
ఐస్క్రీం పార్లర్
మరొక్క మంచి ఆలోచన ఏమిటంటే ఐస్ క్రీమ్ పార్లర్. ఐస్క్రీమ్ పార్లర్తో కూడా ఆదాయం పొందవచ్చు. ఇది మరొక మంచి వ్యాపార ఆలోచన చెప్పవచ్చు.
జిరాక్స్ & బుక్ బైండింగ్
ప్రస్తుతం జిరాక్స్ ఎంత అవసరమో మీకు తెలిసిందే. ఇంకా బుక్ బైండింగ్ కూడా ఉంటే వ్యాపారం పెంచుకోవచ్చు. కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రాంతాల్లో, అలాగే స్కూలు ప్రాంతాల్లో వీటికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. నేటి విద్యార్థులకైనా, ఇతరులకైనా దీని అవసరం అంతా ఇంతా కాదు. ఇది లాభదాయకమైనా ఆలోచన అని చెప్పవచ్చు.
పోటో షాప్
పోటో షాప్ నేర్చుకుని, కటౌట్లు వంటి వాటితో డిజైన్లు, ఫోటోలను తీర్చిదిద్దవచ్చు. వీటికి టెక్ట్స్ జోడించి ఫ్లెక్సీలను తయారు చేసుకునే వారు ఉన్నారు. వీటితో కూడా మనం సంపాదించుకోవచ్చు.
మొబైల్ ఫుడ్ షాప్
ఈరోజు మనం మొబైల్ ఫుడ్ షాప్ ప్రారంభించవచ్చు, ఎందుకంటే మనం మొబైల్ తరంలో జీవిస్తున్నారం. ఇది చాలా మంచి వ్యాపార ఆలోచన.
నగల తయారీ సంస్థ
బంగారం ధర పెరగడంతో పాటు వాటికి సంబంధించిన నగల తయారీకి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇది నేటి రోజుల్లో మంచి ఆప్షన్ అనే చెప్పవచ్చు.
ఇన్సూరెన్స్ కన్సల్టెంట్
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి బీమా(ఇన్సూరెన్స్) అనేది తప్పనిసరి అయింది. అది లైఫ్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా కావొచ్చు. దీనికి బీమా కన్సల్టెన్సీ, బీమా ఏజెన్సీ తీసుకోవడం మంచి ఆలోచనే.
ఫ్రీలాన్సర్
మీకు ప్రోగ్రామింగ్, రైటింగ్ లో మంచి పట్టు ఉంటే ఫ్రీలాన్సింగ్ ఉత్తమమైన ఆలోచన అని చెప్పాలి. దీనికి అనేక వెబ్సైట్లు ఉన్నాయి. పనికి తగిన డబ్బులు వస్తాయి కూడా.
బుక్ స్టోర్
ఈ కాలంలోనూ పుస్తక ప్రియులకు కోదువలేదు. పుస్తక ప్రేమికులు ఎల్లప్పుడూ ఉంటారు. మంచి పుస్తకాల కోసం బుక్ దుకాణం వైపు చూస్తారు. ఈ ఆలోచన సరైనదే.
క్యాటరింగ్ సర్వీస్
వివాహం, పార్ట వేడుకలకు క్యాటరింగ్ అవసరం. ఈ వేడుకలు నిర్వహించే వారు మంచి క్యాటరింగ్ సేవల కోసం చూస్తుంటారు. మీరు మంచి ఆహారం, క్యాటరింగ్ సేవలను అందించ గల్గితే గనుక సంపాదనకు లోటు ఉండదు. ఇది మరొక మంచి వ్యాపార ఆలోచన కావచ్చు.
కంప్యూటర్ శిక్షణ
నేటి ప్రపంచంలో కంప్యూటర్ గురించి తెలుసుకోవడం తప్పనిసరి, మీరు కంప్యూటర్ శిక్షణను ప్రారంభించవచ్చు. నైపుణ్యం ఉంటే ఇది కూడా మంచి వ్యాపార ఆలోచన కావచ్చు.
యోగా సెంటర్
నేడు జీవనం ఒత్తిడి, ఆందోళనలమయంగా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రశాంతత కోసం ఇప్పుడు యోగా చేస్తున్నారు. దీనికి ఇప్పుడు మంచి డిమాండ్ కూడా ఉంది. ప్రజలు యోగా కోసం వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు కూడా. యోగా సెంటర్లు ఏర్పాటు చేయటమే కాదు, మెడిటేషన్, ఆసనాల గురించి మీకు తెలిసి ఉంటే ఇది మంచి వ్యాపార ఎంపిక అవుతుంది.
బేబీ సిట్టింగ్ సేవలు
గృహ ఆధారిత వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా.. ఈ వ్యాపార ఆలోచన మహిళలకు అనుకూలమమే చెప్పాలి. మహిళకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరూ జాబ్ లు చెస్తూ పిల్లలను చూసుకోవడం కష్టమవుతోంది. ఇలాంటి వారి కోసమే ఈ సేవలు.
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్
రియల్ ఎస్టేట్ ఎప్పుడూ డిమాండ్ ఉండే వ్యాపారం. కాబట్టి రియల్ ఎస్టేట్ గురించి చెప్పే మార్గదర్శకుల అవసరం ఎంతగానో ఉంది. కొనుగోలు, అమ్మకం మరియు అద్దెల ఎంపికకు కన్సల్టెన్సీ మొదలు పెట్టడం మంచి వ్యాపార ఆలోచన.
బ్యూటీ పార్లర్
బ్యూటి పార్లర్ నడపాలంటే కొంత నైపుణ్యం ఉండాల్సి ఉంటుంది. దీనిని కొంత సమయంలో నేర్చుకోవచ్చు. తద్వారా ఇంట్లోనే పార్లర్ ను ప్రారంభించవచ్చు. దీనికి ఒక గది, ఫేషియల్ కు సంబంధించి వస్తువులు, ఇతర సౌకర్యాలు ఉండాలి.
గేమ్ పార్లర్
గేమ్ పార్లర్లకు కూడా ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు మొబైల్, ట్యాబ్, సిస్టమ్ లతో గేమ్ లు ఆడేవారు ఉన్నారు. నేటి తరం వారు ప్లే స్టేషన్, గేమ్ స్టేషన్ ఇష్టపడుతున్నారు కూడా. అందుకే గేమ్ కొన్ని గేమ్ లతో పార్లర్ ప్రారంభించడం ఉత్తమ వ్యాపార ఆలోచన.
ఫోటోగ్రాఫర్
ఈ రోజుల్లో వేడుకలకు ఫోటోగ్రాఫర్ల అవసరం తప్పనిసరి. ఫోటోగ్రఫీ మీద మంచి పట్టు ఉంటే, ఒక క్వాలిటీ కెమెరా తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చు పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు.
మోటివేషనల్ స్పీకర్
కాలేజీలు, పలు కార్యాలయాల్లో మోటివేషనల్ స్పీకర్లకు డిమాండ్ పెరుగుతోంద. మీరు మంచి వక్త అయితే దీనిలో మీకు తగిన నైపుణ్యం కలిగి ఉంటే ప్రేరణ కలిగించే స్పీకర్ గా మారవచ్చు. ఇది మంచి వ్యాపార అవకాశంగా మలుచుకోవడమే కాదు, బాగా సంపాదించవచ్చు కూడా.
ట్రావెల్ ఏజెన్సీ
సెలవు రోజుల్లో పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంద. ఇలాంటి వారి కోసం తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపార అవకాశం ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభించడం. ప్రాంతాల మీద నాలెడ్జ్ ఉండి, ఇతరులతో సంబంధాలను కల్గివుంటే ఈ వ్యాపారంతో సంపాధన బాగుంటుంది.
కంప్యూటర్ షాప్
మీకు ఐటి సంబంధిత జ్ఞానం కలిగి ఉంటే IT సంబంధిత అంశం లేదా కంప్యూటర్ సీలింగ్ కంప్యూటర్ షాప్ ప్రారంభించవచ్చు. ఇంత కంటే మంచి వ్యాపార అవకాశం ఏముంటుంది.
కొరియర్ కంపెనీ
వస్తువులు, ఉత్తరాలను చేరవేసే కొరియర్ సంస్థ మంచి ఎంపిక అనే చెప్పాలి. నేడు ఇతర ప్రాంతాలకు వేగంగా తమ వస్తువులను పంపేందుకు కొరియర్లను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. మీరు ఇప్పటికే ఉన్న కొరియర్ కంపెనీ తో టై అప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చిన్నగా వ్యాపారం ప్రారంభించవచ్చు.
రీసేల్ ఆటో డీలర్
నేడు రీ యూజ్డ్, రీసేల్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. చాలా మందికి పాత కారు లేదా బైక్ సేలింగ్ అవసరం ఉంది. మీరు మంచి ఆటో డీలర్ మారవచ్చు.
రిక్రూట్మెంట్ సంస్థ
మంచి ఉద్యోగం పొందడానికి నియామక సంస్థలు ఉన్నాయి. మీరు ఇతర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని.. ఎవరైనా మరియు ప్రజలు సాధారణంగా దరఖాస్తు చేసుకుంటే వారికి జాబ్ నియామకం పనులు చూసుకోవాలి. ఇది మంచి వ్యాపార ఎంపిక కావచ్చు.
సెక్యూరిటీ లేదా స్పై ఏజెన్సీ
భద్రతా అంశాలపై దృష్టి పెరుగుతున్న నేపథ్యంలో మీకు మరొక మంచి ఎంపిక.. గూఢచారిగా, స్వంత భద్రతా ఏజెన్సీ మొదలు పెట్టొచ్చు.
యాడ్ ఏజెన్సీ
ప్రకటన ఏజెన్సీ ప్రారంభించి కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు.
వెబ్ డిజైనింగ్ & హోస్టింగ్
మీరు వివిధ ఐటి టూల్స్ మరియు ప్రోగ్రామింగ్ భాష గురించి జ్ఞానం కలిగి ఉంటే మీరు వెబ్ డిజైనర్ సంస్థ కెరీర్ కోసం ఎంచుకోవచ్చు.
ఆన్లైన్ బ్లాగు
మీకు ఏ రంగంలోనైనా మంచి పరిజ్ఞానం కలిగి ఉంటే. ఆన్లైన్ బ్లాగ్ మొదలు పెట్టి, మంచి డబ్బు సంపాదించవచ్చు. మీ బ్లాగ్ లో మంచి కంటెంట్ ఉంటే, దీని ద్వారా నెలకు రూ.30 వేల వరకు సంపాదించుకోవచ్చు.
పురాతన ఆర్టికల్ షాప్
పురాతన విగ్రహాలు, వస్తువులు ఇంట్లో అమర్చుకోవడం నేడు అనేక మందికి ఫ్యాషన్ గా భావిస్తున్నారు. పురాతన వస్తువుల దుకాణం మంచి వ్యాపార ఎంపిక అవుతుంది
డేటా ఎంట్రీ సేవలు
అనేక కంపెనీలు నేడు డేటా ఎంట్రీ పనులను ఇస్తున్నాయి. డేటా ఎంట్రీ పని చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
ఎస్ఇఒ కన్సల్టెంట్
ఇప్పుడు వెబ్సైట్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అన్ని వెబ్సైట్లకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కన్సల్టెంట్ అవసరం ఉంది. దీనిలో సామర్ధ్యం ఉంటే మీరు మంచి SEO కన్సల్టెంట్ అవుతారు.
డైరీ & స్వీట్ పార్లర్
మీరు పాల ఉత్పత్తులు, స్వీట్ వ్యాపారం మొదలు పెట్టొచ్చు. మీ ప్రాంతంలో చిన్న స్వీట్ పార్లర్లకు మంచి డిమాండ్ రావచ్చు.
ప్యాకర్స్ అండ్ మూవర్స్
ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాానికి వస్తువులను తరలించే ప్యాకింగ్, ఫార్వార్డింగ్ వ్యాపారం మంచి డిమాండ్ను కల్గివుంది. మీకు ఇది మంచి వ్యాపార అవకాశం అవుతుందని చెప్పవచ్చు.
మొక్కల పెంపకం(నర్సరీ బిజినెస్)
ఇప్పుడు మొక్కల పెంపకం లేదా నర్సరీ వ్యాపారం ద్వారా కూడా సంపాదించవచ్చు. మొక్కలను పెంచడానికి ఎలా చేయాలనేది ముందు తెలుసుకోవాలి. దీనికి తగిన ప్రదేశం కూడా ఉండాలి. ఔషధ మొక్కలు, పూల మొక్కలకు మంచి డిమాండ్ ఉంది.
ఇంటి వద్దకే కూరగాయలు
ఈ రోజుల్లో ఇంటి వద్దకే సేవలు అందించే వాటికి మంచి డిమాండ్ ఉంది. చాలా మందికి బయటికి వెళ్లి తాజా కూరగాయలను తెచ్చుకునేంత సమయం ఉండదు. కొన్ని ప్రాంతాల్లో దగ్గర్లో కొనేందుకు కూరగాయలు అందుబాటులో ఉండవు. అలాంటి వారి కోసం ఇంటి వద్దకే రోజూ కొన్ని కూరగాయలను తెచ్చి ఇవ్వొచ్చు. దీంతో ప్రతి నెలా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు.
పూజా సామాగ్రి
పూజలు, వ్రతాలకు కావాల్సి వస్తువులను అందజేసేందుకు ప్రత్యేకంగా షాప్ నడపడం ఇప్పుడు పెరిగింది. అన్ని ఒకే చోట లభించే ఇలాంటి షాప్ లకు డిమాండ్ ఉంది. భక్తులకు ఫవిత్ర ప్రాంతాల నుంచి తెప్పించిన గంగాజలం వంటి ఇతర వస్తువులను సేల్ చేయడం చేస్తే మీరు మంచి ఆదాయం పొందవచ్చు.
ఈ చిన్న పెట్టుబడి వ్యాపారాల ఆలోచనల గురించి పాఠకులు అభిప్రాయం తెలియజేయాలని కోరుకుంటున్నాను.
Your article helped me a lot, is there any more related content? Thanks! https://accounts.binance.com/ru/register-person?ref=OMM3XK51