- ఒక పర్సన్ నగదుతో ఎంత బంగారం కొనుగోలు చేయవచ్చు?
- నగల వ్యాపారి ప్రతి లావాదేవీకి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోరు
- బంగారం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, కొన్ని ముఖ్యమైన విషయాలు
బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారా.. జాగ్రత్త.. గోల్డ్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే. మీరు నగదు రూపంలో చాలా బంగారం కొనుగోలు చేస్తే, మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఒక వ్యక్తి ఎంత బంగారాన్ని నగదు రూపంలో కొనుగోలు చేయవచ్చు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తవచ్చు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం బంగారం నగదు కొనుగోలుపై పరిమితి లేదు. కానీ ఈ సందర్భంలో, ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒక్క లావాదేవీలో కొనుగోలుదారుడు రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించకూడదని ఆదాయపు పన్ను చట్టం స్పష్టంగా పేర్కొంది. అటువంటి పరిస్థితిలో, కొనుగోలుదారు తనకు నచ్చినంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే నగదు రూపంలో చెల్లిస్తే నగల వ్యాపారి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బు తీసుకోరనే విషయం తెలుసుకోవాలి.
విక్రేత తెలుసుకోవడం ముఖ్యం
ఆదాయం పన్ను చట్టం ప్రకారం, బంగారు ఆభరణాల విక్రేతలు ప్రతి లావాదేవీకి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోరు. విక్రేత ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధిస్తుంది, కావున వారు డబ్బు పెద్ద మొత్తంలో ఉంటే అంగీకరించరు. ఒక వ్యక్తి నగల వ్యాపారి నుండి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తే, గనుక కోనే వ్యక్తి పాన్ కార్డు లేదా ఆధార్ కార్డును ఇవ్వాల్సిందే. నగదుతో పాటు, ఆన్‌లైన్‌లో లేదా కార్డు ద్వారా లావాదేవీ జరిగినప్పటికీ, ఈ పత్రాలను కొనుగోలుదారుకు తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ మీరు 2 లక్షల రూపాయల కంటే తక్కువ బంగారం కొనుగోలు చేస్తే, మీకు సమస్య ఉండదు. అంతేకాదు మీరు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు.