అమెజాన్ పే బ్యాలెన్స్ (Amazon Pay) నుండి షాపింగ్ లేదా బిల్లు చెల్లింపు మొదలైనవాటిని చేస్తున్నారా? ఇది మీకు ఉపయోగకరమైన విషయమే.. మీరు అమెజాన్ పే బ్యాలెన్స్‌ని మీ బ్యాంక్ ఖాతాకు కూడా బదిలీ చేసుకోవచ్చు అని తెలుసా?
మీలో చాలా మందికి Amazon నుండి షాపింగ్ అనుభవం ఉండే ఉంటుంది. చాలా మంది Amazon Pay ఎంపికను కూడా ఉపయోగిస్తున్నారు. అమెజాన్ పే అనేది ఆన్లైన్ చెల్లింపు ప్రాసెసింగ్ సేవ, ఇది కస్టమర్లు తమ అమెజాన్ వాలెట్‌కి డబ్బును జమ చేసేందుకు అనుమతిస్తుంది. వారు ఈ మొత్తాన్ని అమెజాన్‌లో షాపింగ్ చేయడంతో పాటు బిల్లులు చెల్లించడానికి, ఇతరులకు డబ్బు పంపడానికి ఉపయోగించవచ్చు. ఇతరుల నుంచి కూడా డబ్బు తీసుకోవచ్చు.
మీరు మీ Amazon Pay వాలెట్‌కి బ్యాంక్ బదిలీ ద్వారా లేదా గిఫ్ట్ కార్డ్ ద్వారా సులభంగా డబ్బును జోడించవచ్చు, అయితే Amazon వాలెట్లో డిపాజిట్ చేసినట్లయితే డబ్బును తిరిగి ఖాతాకు ఎలా బదిలీ చేయాలో మీకు తెలుసా? ఆ పద్ధతి ఏమిటో తెలుసుకుందాం..
ఈ పని కోసం మీ కెవైసి(KYC) డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఆ తర్వాత మీరు మీ Amazon Pay బ్యాలెన్స్‌ని బ్యాంక్ ఖాతాకు సులభంగా బదిలీ చేయవచ్చు. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో కింద సూచించాను చూడండి.
- ముందుగా మీరు Amazon యాప్ ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత దానిలో Amazon Pay విభాగానికి వెళ్లాలి.
- send money(సెండ్ మనీ)పై క్లిక్ చేసి, ‘టు బ్యాంక్’ ఎంపికను ఎంచుకోండి.
- ఇప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్, ఖాతా నంబరు, ఖాతాదారుడి పేరును బదిలీ చేయాల్సిన బ్యాంకు ఖాతాలో నమోదు చేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత Pay Now పై క్లిక్ చేయండి.
- మీరు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసి, కొనసాగించుపై క్లిక్ చేయండి.
- అమెజాన్ యాప్ స్క్రీన్‌పై చెల్లింపు పద్ధతులు కనిపిస్తాయి.
- మరిన్ని మార్గాలను చూపుపై క్లిక్ చేసి, Amazon Pay బ్యాలెన్స్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు కొనసాగించుపై క్లిక్ చేయండి, ఆ తర్వాత Amazon Pay నుండి డబ్బు బ్యాంకు ఖాతాకు వెళ్తుంది.