ఆన్‌లైన్‌ షాపింగ్లో నకిలీ ఎలా గుర్తించాలి?

Spread the love

దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతున్నట్టుగానే.. పాటు మోసాల కేసులు కూడా పెరిగాయి. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆర్డర్ చేసిన ఉత్పత్తులు చాలాసార్లు నకిలీవి వస్తున్నాయి. అసలైన, నకిలీ మధ్య వ్యత్యాసం గురించి కస్టమర్ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేసి, అది నకిలీ అని తేలితే ఏం చేయాలి? అసలు, నకిలీ వస్తువుల మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

మీరు ఈ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తి పేరులో అంటే స్పెల్లింగ్ లో పొరపాటు కనుగొంటే, ఆ ఉత్పత్తి నకిలీది అని గమనించాలి. తరచుగా కొన్ని కంపెనీలు బ్రాండ్ పేర్లతో సమానమైన పేర్లను ఉపయోగించడం ద్వారా వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తాయి. బ్రాండెడ్ ఉత్పత్తులు వచ్చే పేరుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

ప్రతి ఆన్‌లైన్ సైట్ అందుబాటులో ఉన్న ఉత్పత్తుల గురించి కస్టమర్ సమీక్షలను(రివ్యూ) కూడా ఇస్తుంది. అందువల్ల ఇప్పటికే ఉత్పత్తిని కొనుగోలు చేసిన కస్టమర్‌లు దాని గురించి ఏం అభిప్రాయం చెప్పారో అక్కడ మీరు తనిఖీ చేయాలి. మీకు రివ్యూ నచ్చకపోతే, మీరు కొనుగోలు చేయడం ఆపివేయవచ్చు.

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం మంచిది. ఈ కంపెనీలకు భారీ యూజర్ బేస్ ఉన్నందున, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాయి.

మీరు కొత్త వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేస్తుంటే, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నకిలీ వస్తువులు దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా సార్లు డబ్బు చెల్లించిన తర్వాత ప్రోడక్ట్ అందుతుందో లేదో అనే భయంతో ఉంటారు. అందుకే కంపెనీకి సంబంధించిన రివ్యూలు చూసుకుని కొనడం మంచిది.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఏదైనా ఇ-కామర్స్ సైట్ నుండి ఆర్డర్ చేసినప్పుడు, డెలివరీ సమయంలో వస్తువును పూర్తిగా తనిఖీ చేయండి. 

ఇది చాలాసార్లు గమనించిన విషయం.. ఒక్కోసారి ఇంటికి వచ్చిన ప్యాకేజీలో మోసం జరగవచ్చు.

 ఒక్కోసారి ప్యాకెట్‌లో బంగాళదుంపలు, రాళ్లు కూడా పెట్టిన సందర్భాలు, కేసులు ఉన్నాయి. రవాణా సమయంలో ఇటువంటి మోసం జరిగే అవకాశం ఉంది.


Spread the love

Leave a Comment

error: Content is protected !!