పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలను భద్రపర్చుకోవచ్చా?
ఇకపై వాట్సాప్ కూడా డిజిలాకర్ లా ఉపయోగపడుతుంది. ప్రజలు వాట్సాప్ సహాయంతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. డిజిలాకర్ సేవను ఉపయోగించడానికి ప్రజలు ఇప్పుడు వాట్సాప్‌లోని MyGov హెల్ప్‌డెస్క్‌ను వినియోగించుకోవాలి. మీరు పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర ముఖ్యమైన పత్రాల భౌతిక కాపీలను ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లకూడదనుకుంటే, ఈ కొత్త ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరిచిపోతే వాట్సాప్‌లో డిజిలాకర్ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఐడి కార్డులను చూపించి, చలాన్లు పడకుండా జాగ్రత్తపడొచ్చు.
వాట్సాప్‌లో డిజిలాకర్‌ని ఉపయోగించే విధానం
ముందుగా మీరు ఫోన్‌లో +91 9013151515 నంబర్‌ను సేవ్ చేయాలి. నంబర్‌ను సేవ్ చేసిన తర్వాత, వాట్సాప్ యాప్‌ను తెరవండి.
వాట్సాప్ తెరిచిన తర్వాత ఈ నంబర్‌తో చాట్ బాక్స్‌ను ఓపెన్ చేసి ఆ తర్వాత ‘నమస్తే’ లేదా ‘హాయ్’ లేదా ‘డిజిలాకర్’ అని టైప్ చేసి పంపండి.
దీని తర్వాత మీరు కోవిన్ (COWIN) సర్వీస్, డిజిలాకర్ సర్వీస్ అనే రెండు ఎంపికలను పొందుతారు.
మీరు డిజిలాకర్ సేవను ఎంచుకున్న వెంటనే ఆధార్ ధృవీకరించి, మీకు ఓటిపి(OTP) వస్తుంది.
ధృవీకరణ తర్వాత మీ డిజిలాకర్‌లో ఏ పత్రాలు ఉన్నాయో అది మీకు తెలియజేస్తుంది.
ఆ తర్వాత ఆ డాక్యుమెంట్‌తో ఏ మొబైల్ నంబర్ రిజిస్టర్ అయిందో నమోదు చేయండి, ఆపై మీకు ఓటిపి(OTP) వస్తుంది.
ఓటిపిని ధృవీకరించిన తర్వాత మీరు డాక్యుమెంట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోగలరు.