సొంత వ్యాపారానికి ముద్రా యోజన రుణం ఎలా?

Spread the love

 • సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మొదట మూలధన సమస్య ఉంటుంది
 • ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన (PMMY)ను అమలులోకి తెచ్చింది
 • ఈ పథకం కింద తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు 

ఈ రోజుల్లో సొంతంగా వ్యాపారం  చేయాలనే ఆలోచనలు కల్గిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారికి మొదట కావాల్సింది మూలధనం, దీని కోసం అప్పు చేయాల్సి వస్తుంది, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ రుణం పొందడం అంత సులువు కాదు. చాలా నిబంధనలు ఉంటాయి. అలాంటి వారికి ఎలా ముద్ర లోన్ పొందవచ్చు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండాలో తెలుసుకుందాం.  ప్రధానమంత్రి ముద్రా యోజన (PMMY) పథకం ద్వారా తక్కువ వడ్డీ లోన్ పొందవచ్చు. ఈ పథకంలో 3 రకాల రుణాలు ఉన్నాయి. మొదటి కేటగిరీ శిశు లోన్ స్కీమ్, రెండోది కిషోర్ లోన్, మూడోది తరుణ్ లోన్.. వీటి ద్వారా మనకు కావాల్సి లోన్ పొందవచ్చు. ఈ పథకం కింద వ్యాపారం ప్రారంభించడానికి రూ. 50 వేల నుండి రూ. 10 లక్షల వరకు లోన్ లభిస్తుంది.ఈ లోన్ కోసం ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు కూడా.. అంతేకాదు ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన పరిస్థితి కూడా లేదు. అయితే వడ్డీ రేట్లు బ్యాంకు ఆధారంగా మారవచ్చు. బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను వసూలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం బట్టి  కనీస వడ్డీ రేటు 10 నుండి గరిష్ట శాతం 12 వరకు ఉంటుంది.

మీరు ఎంత రుణం తీసుకోవచ్చు?

శిశు లోన్: రూ. 50,000

కిషోర్ లోన్: రూ. 50,000 నుండి రూ. 5 లక్షలు

తరుణ్ లోన్ : రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు

చెల్లింపు కాలం ఎంత?

రుణాలను 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలలోపు చెల్లించాల్సి ఉంటుంది.

అర్హత ఏమిటి?

24 ఏళ్ల నుండి 70 ఏళ్ల మధ్య  వయసు ఉండాలి.

దీనికి ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, KYC సర్టిఫికేట్, ఓటర్ ఐడి ఉండాలి.

అప్లై చేయడం ఎలా?

 1. https://www.mudra.org.in/ వెబ్‌సైట్ ద్వారా ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
 2. తరుణ్, కిషోర్ లోన్ ఫామ్ లు ఒకేలా ఉంటాయి. శిశు లోన్ ఫామ్ కొంత భిన్నంగా ఉంటుంది.
 3. రుణ దరఖాస్తు ఫారమ్‌లో మొత్తం సమాచారాన్ని పూరించండి.
 4. మీరు మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పేరు, చిరునామా ఇవ్వాలి.
 5. వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించాలనుకుంటున్నారనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
 6. OBC, SC/ST కేటగిరీ దరఖాస్తుల వారు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
 7. 2 పాస్‌పోర్ట్ ఫోటోలను ఇవ్వాలి.
 8. ఫామ్‌ను నింపిన తర్వాత ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంక్‌కి వెళ్లి అన్ని ప్రాసెస్ లను పూర్తి చేయాలి.
 9. మీ నుంచి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సమాచారం తీసుకుంటారు. ఆ తర్వాత ముద్రా పథకం కిందలోన్ మంజూరు అవుతుంది.

కావాల్సిన పత్రాలు

 • నివాస ధృవీకరణ పత్రం;
 • పాస్‌పోర్ట్ సైజు ఫోటో;
 • ID ధృవీకరణ పత్రం;
 • వ్యాపార ధృవీకరణ పత్రం;
 • వ్యాపార చిరునామా రుజువు;
 • కుల ధృవీకరణ (cast certificate)..

Spread the love

Leave a Comment

error: Content is protected !!