2003లో ఈ షేర్‌లో రూ.50 వేలు పెట్టుబడి పెడితే, నేడు రూ. 5 కోట్లు అయింది..
దాదాపు 10000 శాతం రాబడిని ఇచ్చింది..
స్టాక్ మార్కెట్ రిస్కే గానీ, మంచి షేరు తగిలిందంటే.. మీ కిస్మత్ మారిపోతుంది. అలాంటి ఒక షేరు గురించి చర్చించుకుందాం. గతేడాది కూడా చాలా షేర్లు ఇన్వెస్టర్ల అదృష్టాన్ని మార్చివేసి లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టిన వారిని కోట్లకు యజమానులుగా చేశాయి. మీరు అలాంటి షేర్లలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ రోజు మీకు కూడా బంపర్ రిటర్న్స్ వచ్చేవి. అదే ఎలక్ట్రికల్ పరికరాలను తయారు చేసే కంపెనీ హావెల్స్ ఇండియా..
ఎలక్ట్రికల్ పరికరాలను తయారు చేసే కంపెనీ హావెల్స్ ఇండియా..ఈ స్టాక్ గత కొన్నేళ్లుగా బాహుబలి రిటర్న్స్ ఇచ్చింది. పర్సంటేజీలో చెప్పాలంటే 10000 శాతం రాబడిని ఇవ్వడంలో ఈ స్టాక్ సక్సెస్ అయింది. కంపెనీ షేరు రూ.1.37 నుంచి రూ.1,317 స్థాయికి పెరిగింది. ఈ కంపెనీ స్టాక్‌లో 52 వారాల గరిష్టం రూ.1504.45 కాగా, కనిష్ట ధర రూ.958.
స్టాక్ చరిత్రను చూస్తే.. 2003 మే 2 నాటికి బిఎస్ఇలో హావెల్స్ ఇండియా షేరు ధర కేవలం రూ. 1.37. కానీ 2022 ఏప్రిల్ లో ఈ స్టాక్ రూ. 1,317కి చేరుకుంది. సుమారు 19 సంవత్సరాలలో, ఈ స్టాక్ సుమారు 10000 శాతం రాబడిని ఇచ్చింది.
2003 మే 2న ఒక వ్యక్తి ఈ షేర్‌లో 50 వేలు పెట్టుబడి పెడితే, నేడు అది నేరుగా 5 కోట్లకు చేరుకుంది. 2009 మార్చి 6న, హావెల్స్ షేర్ బిఎస్ఇలో రూ.10.61 స్థాయిలో ఉంది. ఈ సమయంలో కూడా మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఈరోజు అది 1.25 కోట్లు అయ్యేది. గత ఐదేళ్లలోనే ఈ కంపెనీ స్టాక్ దాదాపు 170 శాతం రాబడిని ఇచ్చింది. ఈ కంపెనీ స్టాక్ గత ఏడాది కాలంలో 30 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది.
(గమనిక…. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, నిపుణులను సంప్రదించండి. తెలుగు పైసా పెట్టుబడి కోసం మీకు ఎలాంటి సలహా ఇవ్వదు.)