టాటా షేర్‌కు భవిష్యత్ అదుర్స్.. 

Spread the love

 స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారు, టాటా గ్రూప్‌లోని ఈ షేర్‌లో డబ్బును పెట్టుబడి పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ స్టాక్ వచ్చే ఏడాదిలో మీకు భారీ లాభాలను ఇవ్వగలదు. స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టాలనేది మీ ప్లాన్ అయితే, ఖచ్చితంగా ఈ స్టాక్ను పరిశీలించండి.

22% పెరగవచ్చని అంచనా

టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్ షేర్లను కొనుగోలు చేయాలని ఎంకే గ్లోబల్ కూడా సూచించింది. ఎంకే గ్లోబల్ అంచనాల ప్రకారం, ఈ స్టాక్ వచ్చే ఏడాదిలో రూ.530 స్థాయికి చేరుకోవచ్చు. ఏప్రిల్ 29న ముగిసిన సెషన్‌లో ఈ స్టాక్ రూ.436 స్థాయిలో ముగిసింది. అంటే, మీరు ఇప్పుడు ఈ షేరును కొనుగోలు చేస్తే, మీరు రాబోయే ఒక సంవత్సరంలో దాదాపు 22 శాతం లాభం పొందవచ్చు.

టాటా వాహనాలను ప్రజలు ఇష్టపడుతున్నారు

టాటా మోటార్స్ లిమిటెడ్ ఆటో రంగంలో అగ్రగామి సంస్థ అనే విషయం తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన వాహనాలకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. టాటా వాహనాలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. 2022 మార్చి 31తో ముగిసిన  నాలుగో త్రైమాసికంలో కంపెనీలో ప్రమోటర్లు 46.4 శాతం వాటాను కలిగి ఉండగా, ఎఫ్‌ఐఐలు 14.45 శాతం, డిఐఐలు 14.39 శాతం కలిగి ఉన్నారు.

కంపెనీ భవిష్యత్తు ప్రణాళిక

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) ఉత్పత్తిని 80,000 యూనిట్లకు పెంచాలని టాటా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది. 2026 మార్చి నాటికి 10 ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తామని టాటా గతేడాది తెలిపింది.

(గమనిక…. ఇది పెట్టుబడి సలహా కాదు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, నిపుణులను సంప్రదించండి. తెలుగు పైసా పెట్టుబడి కోసం మీకు ఎలాంటి సలహా ఇవ్వదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలకు లోబడి ఉంటుంది, దయచేసి పెట్టుబడి పెట్టే ముందు మీ సలహాదారుని సంప్రదించండి.)


Spread the love

Leave a Comment

error: Content is protected !!