దీనికి ఒక ఫార్ములా ఉందనే విషయం మీకు తెలుసా?
బ్యాంకులు, పోస్టాఫీసు వంటి వాటిలో ఎఫ్డీ (ఫిక్స్ డ్ డిపాజిట్)లు చేస్తాం. అయితే ఇప్పుడు వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. అవి ఎంత కాలంలో రెట్టింపు అవుతాయో తెలుసుకోవాలంటే ఎలా? అనే సందేహం మనలో వస్తుంది. అయితే దీనికి సమాధానం ఉంది. అదే 72 ఫార్ములా.. అవును దీంతో ఎంత కాలంలో ఎఫ్డీ రెట్టింపు అవుతుందో తెలుసుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద ఎస్బిఐ(బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- SBI) ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ పరిస్థితిలో మీరు SBIలో FD చేస్తే, లేదా పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా తెరిస్తే, ఇవి ఎంత కాలంలో రెట్టింపు అవుతాయి. ఈ రెండు రెట్టింపు ఎంత కాలంలో అవుతాయో ఉదాహారణలతో తెలుసుకుందా.
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతాలో ఐదేళ్ల కాలానికి 6.7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇది ఒక రకమైన FD లాంటిదే అని చెప్పాలి. నిర్ణీత వ్యవధిలో ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్థిరమైన రాబడిని పొందే అకాశం ఉంది. టైమ్ డిపాజిట్ ఖాతా 1 నుండి 5 సంవత్సరాల వరకు 5.5 నుండి 6.7 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. దీనిలో కనీస పెట్టుబడి రూ.1000గా నిర్ణయించారు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింక్ ను https://www.indiapost.gov.in/Financial/pages/content/post-office-saving-schemes.aspx క్లిక్ చేయండి.
ఎస్బిఐ – టైమ్ డిపాజిట్ ఖాతా వడ్డీ రేట్లు
- డిపాజిట్ కాలం————టైమ్ డిపాజిట్ వడ్డీ————ఎస్బిఐ వడ్డీ
- 1 సంవత్సరం————5.5 శాతం————5.10 శాతం
- 2 సంవత్సరాలు————5.5 శాతం————5.20 శాతం
- 3 సంవత్సరం————5.5 శాతం————5.30 శాతం
- 5 సంవత్సరాలు————6.7 శాతం————5.40 శాతం
వీటిలో డబ్బు ఎంత సమయంలో రెట్టింపు అవుతుందో తెలుసుకుందాం..
SBIలో FD :
ఎస్బిఐలో ఎఫ్ డి రేటు గరిష్టంగా 5.4 శాతం ఉంది. దీనిని రూల్ 72 ప్రకారం చూస్తే, ఈ పథకంలో మీర పెట్టిన డబ్బు రెట్టింపు కావడానికి 13 సంవత్సరాల 3 నెలలు పడుతుంది.
- ఇదెలా అంటే.. 72తో 5.4 ను బాగించాలి. దీనికి సమాధానం 13.3 వస్తుంది.
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ :
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతాలో గరిష్ట వడ్డీ 6.7 శాతం ఉంది. ఈ వడ్డీని రూల్ 72 ప్రకారం చూస్తే, మీరు ఈ పథకంలో పెట్టిన డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల 7 నెలల సమయం పడుతుంది.
ఇదెలా తెలుసుకున్నారంటే, 72తో 6.7 ను బాగించాలి. దీనికి సమాధానం 10.7 వస్తుంది. 72 రూల్ అంటే ఏమిటి?
మన ఇన్వెస్ట్ చేసే డబ్బు రెట్టింపు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పే సూత్రం ఈ 72 రూల్. ఈ ఫార్ములా చాలా సులభంగా ఉంటుంది. పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుసుకునేందుకు వడ్డీ రేటును 72 తో విభజించాలి. రూల్ 72ను నిపుణులు అత్యంత ఖచ్చితమైన నియమంగా పరిగణిస్తారు, దీని ద్వారా మీ పెట్టుబడి ఎంత సమయంలో రెట్టింపు అవుతుందో తెలుసుకోవచ్చు. మీ స్కీమ్ ఏడాదికి 8 శాతం వడ్డీ వస్తే ఎంత టైమ్ పడుతుంతో దీని ద్వారా తెలుసుకోవచ్చు.
గమనిక: ఈ బ్యాంకు వడ్డీ రేట్లు అప్పటి కాలమానానికి సంబంధించినవి. వాటి రేట్లు కాలానుగుణంగా మార్పు చోటుచేసుకుంటాయి. తదనుగుణంగా మీరు ప్రస్తుత వడ్డీ రేట్ల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ విషయం గమనించాలి.
డబ్బు రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుంది..? తెలుసుకోవచ్చా?